chicken biryani
-
చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్య చేసిన భార్య
మడకశిర: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ వివరాలను తెలియజేశారు. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మిస్సింగ్ కేసుల ఆధారంగా ..మడకశిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మడకశిర సీఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుత మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ కేసు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి సోదరులైన అరుణ్‌కుమార్, కిరణ్‌కుమార్‌లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.విచారణలో పోలీసులకు దొరికిన క్లూమృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి, అతని భార్య కవితకు మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుమకూరులోనే శిరా గేట్లో వేరుగా తన కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షితతో కలిసి ఉంటోందని వారు పోలీసులకు వివరాలు అందించారు. ఈవివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.భార్య విచారణతో వీడిన మిస్టరీమృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అతనితో సహ జీవనం కూడా చేసేది. అక్తర్‌పాషాతో కవిత డబ్బులు ఇప్పించుకుని తుమకూరులోనే ఓ హోటల్ పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్‌కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, హోటల్లో పని చేసే వంట మనిషి మోహన్‌ప్రసాద్, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్యపథకం ప్రకారం కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగా లేదని మోహన్‌కుమార్‌ను భార్య కవిత 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్‌కుమార్‌కు పెట్టారు. భోజనం చేసిన తర్వాత మృతుడు మత్తులోకి పోయాడు. ఈక్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్‌ప్రసాద్... మోహన్‌కుమార్ తలపై రోకలిబండతో కొట్టారు. మృతుడి భార్య ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు. మోహన్‌కుమార్ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు.నలుగురు నిందితుల అరెస్ట్పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బంది ఆదివారం నిందితులను తుమకూరులో అరెస్ట్ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మరణాయుధాలు కూడా సీజ్ చేశారు. నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్, మోహన్‌ప్రసాద్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ మునిప్రతాప్ తదితర పోలీసులను ఎస్పీ రత్న అభినందించినట్లు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఈ ఎన్నికల్లో బిర్యానీ రూ.150 అంతే.. కాస్ట్లీ అంటే కుదరదు!
లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వారు ఖర్చు చేసే ప్రతి పైసాకు ఎన్నికల కమిషన్‌కు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ప్రచార సమయంలో తమ మద్దతుదారులకు ఇప్పించే ఛాయ్, సమోసాలకు ఖర్చుపెట్టిన డబ్బుకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించే 200కు పైగా వస్తువుల సవరించిన ధరల జాబితాను ఇటీవలి నోటిఫికేషన్లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు ఖర్చు పరిమితిని మించకుండా చూసుకోవడానికి వీటిని ఎన్నికల ప్రకటిచింది. ఈసీకి సమర్పించే ఖర్చుల వివరాల్లో ఆయా వస్తువులు, ఆహార పదార్థాలకు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా చూపించేందుకు వీలుండదు. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్ కమిషన్ ఈ సారి రూ.95 లక్షలకు పెంచింది. ఇది 2019 ఎన్నికల సమయంలో రూ. 70 లక్షలు ఉండేది. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వినియోగించే వస్తువులు, సేవల ధరలను కూడా ఈసీ స్వల్పంగా పెంచింది. ధరల జాబితాను ఉపయోగించి అభ్యర్థులు చేసే ఖర్చులను జిల్లా ఎన్నికల అధికారి మూల్యాంకనం చేస్తారు. చెన్నై జిల్లా ఎన్నికల అధికారి జె.రాధాకృష్ణన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. టీ ధరను రూ.10 నుంచి రూ.15కి, కాఫీ ధరను రూ.15 నుంచి రూ.20కి పెంచారు. అయితే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ధరను మాత్రం రూ. 2019తో పోలిస్తే రూ.180 నుంచి రూ.150కు తగ్గించారు. మరోవైపు మటన్ బిర్యానీ ప్యాకెట్ ధరలో మార్పు లేదు. అది రూ. 200గా ఉంది. టీషర్టులు, చీరల ధరలు కూడా పెంచలేదు. ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే వారికి అందించే ఆహారం, వాహనాలు, ప్రచార కార్యాలయాలు, సమావేశాల కోసం అద్దెకు తీసుకున్న ఇతర ఫర్నిచర్, వేదిక అలంకరణ ఖర్చులు, కూలీల ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యానర్లు, పోస్టర్లు, కుర్చీలు వంటి వస్తువులతో సహా అనేక అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. జెండాలు, బాణాసంచా, పోస్టర్లు, దండలు, సాంస్కృతిక నృత్యాలతో సహా రాజకీయ నేతలకు స్వాగతం పలికేందుకు అయ్యే ఖర్చులు కూడా అభ్యర్థి ఖర్చుల్లోనే చేరుస్తారు. -
చికెన్ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్.. రూ.30 వేలు పరిహారం!
కర్ణాటక: చికెన్ ముక్క లేకుండా బిర్యాని తినడం ఎంత అవమానకరమో మాంసప్రియులకు తెలుసు. అయితే మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా?, అలాగే చికెన్ బిర్యానీలో చికెన్ ఉంటుందా? అని వాదించిన హోటల్‌కు కస్టమర్ కోర్టు ద్వారా షాక్ ఇచ్చాడు. ముక్క లేకుండా బిర్యాని ఇచ్చిన హోటల్ యాజమాన్యంపై కేసు వేసి కోర్టులో గెలిచి పరిహారం సాధించుకున్నాడు. రూ.30 వేలు ఇవ్వాలని కేసు.. వివరాలు.. బెంగళూరు ఐటీఐ లేఔట్ నివాసి కృష్ణప్ప.. మే నెలలో భార్యకు బాగాలేక వంట చేయలేదు. దీంతో స్థానిక ప్రశాంత్ హోటల్‌కు వెళ్లి రూ.150 పెట్టి చికెన్ బిర్యాని తీసుకున్నాడు. ఇంటికి తీసికెళ్లి పొట్లం విప్పి చూడగా అందులో చికెన్ ముక్కలు లేవు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణప్ప వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. సాక్ష్యం కోసం బిర్యాని ఫోటోలు, బిల్లు ఇచ్చాడు. తనకు రూ.30వేల నష్టపరిహారం అడిగాడు. కేసు పరిశీలించిన కోర్టు రూ.1000 పరిహారం, బిర్యానీ ధర రూ.150 తిరిగి ఇవ్వాలని హోటల్వారికి ఆదేశించింది. ఈ కేసులో కృష్ణప్ప తానే వాదించుకుని గెలిచాడు. కోడికూర కోసం భార్య హత్య.. 6 ఏళ్ల జైలు చికెన్కూర వండలేదనే కోపంతో భార్యను హత్య చేసిన కిరాతక భర్తకి కోర్టు 6 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించిన సంఘటన దావణగెరె జిల్లా హరిహరలో చోటుచేసుకుంది. హరిహర తాలూకా మాగనహళ్లికి చెందిన కెంచప్ప భార్య శీలా కోడికూర వండలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపం పట్టలేక కత్తితో పొడిచి హత్య చేసాడు. హరిహర గ్రామీణ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో కెంచప్ప నేరం రుజువు కావడంతో కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. కాగా, జైల్లో కెంచప్పకు వారానికి రెండుసార్లు మాంసాహారం లభిస్తుంది. -
దేవుడికిచ్చిన మాట.. రూ.20కే చికెన్ బిర్యానీ
అల్లవరం: సాధారణంగా సమాజంలో ఎవరైనా వ్యాపారం చేసేది లాభాల కోసమే అయ్యుంటుంది. అలాంటిది అసలు లాభాపేక్ష అన్నదే లేకుండా ప్రజాహితమే పరమార్థంగా భావించి వ్యాపారం చేసేవాళ్లుంటారా..? ఉన్నారంటే నమ్ముతారా..? అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామానికి చెందిన గోడి సత్యనారాయణ మాత్రం దేవుడికి చేసిన వాగ్దానాన్ని మరవకుండా రుచిగా, శుచిగా తయారుచేసిన బిర్యానీ, ఫ్రైడ్ రైస్ రూ.20కే అందిస్తూ అందరి మనన్నలు అందుకుంటున్నారు. అందుకే అల్లవరం మండలం గుడ్డివానిచింతలో ఆయన ఏర్పాటుచేసిన అంజలి బిర్యానీ సెంటర్ నిరుపేదల పైవ్‌స్టార్ హోటల్‌గా మారిపోయింది. అందరి ఆకలి తీర్చడంలోనే ఆనందం ఉందంటున్న చిరు వ్యాపారి సత్యనారాయణపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.. హైదరాబాద్ నుంచి అమలాపురానికి.. కోనసీమ ప్రాంతానికి చెందిన గోడి సత్యనారాయణ యుక్త వయసులో ఉండగానే జీవనోపాధి కోసం హైదరాబాద్ మహానగరానికి వెళ్లిపోయారు. తొలుత అక్కడ వంట మాస్టర్‌గా పని చేసిన ఆయన.. అనంతరం సొంతంగా బిర్యానీ సెంటర్ తెరిచారు. పద్దెనిమిదేళ్ల పాటు రుచికరమైన వంటకాలను తక్కువ ధరలకే వినియోగదారులకు అందించి శభాష్ అనిపించుకున్నారు. పఠాన్ చెరువు ప్రాంతంలో సత్యనారాయణ బిర్యానీ సెంటర్ నుంచి పోటీని తట్టుకోలేక ఎందరో వ్యాపారులు దుకాణం సర్దేశారు. అయితే స్థానిక వ్యాపారులు కాలక్రమంలో సత్యనారాయణపై బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు. అక్కడ తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన సత్యనారాయణ అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చేశారు. అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద నాలుగేళ్ల క్రితం బిర్యానీ పాయింట్, భోజనం అమ్మకాలు ప్రారంభించారు. అనతికాలంలోనే బిర్యానీ పాయింట్ ప్రజల మనసుని గెలుచుకుంది. దైవ సన్నిధిలో ఇచ్చిన మాట సత్యనారాయణకు తన కుమార్తె అంజలి అంటే ఎంతో ప్రేమ.. స్థానికంగా ఉన్న చర్చికి సత్యనారాయణ తన కుటుంబంతో పాటు తరచుగా వెళుతుంటారు. తన కుమార్తె అంజలి పుట్టిన రోజును పురస్కరించుకుని ఏటా దైవసన్నిధిలో బిర్యానీ అందించేవారు. తాను వ్యాపారంలో నిలదొక్కుకున్నాక లాభాపేక్ష లేకుండా రూ.20కే బిర్యానీ అందించి అందరి ఆకలి తీరుస్తానని తన కుమార్తె పుట్టిన రోజున దేవుడికి వాగ్దానం చేశారు. సరిగ్గా మూడేళ్ల తరువాత ఈ ఏడాది మే నెలలో అంజలి బిర్యానీ పాయింట్‌ని ఏర్పాటు చేసి దేవుడికిచ్చిన మాటను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. పగలంతా ఇక్కడ రూ.50, రూ.80, రూ.120 ధరల్లో బిర్యానీలు అమ్ముతారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత మాత్రం రూ.20కే చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నిప్పులపై కాల్చే చీకులను అమ్ముతున్నారు. బయట కనీసం రూ.100కు కూడా లభించని బిర్యానీ కేవలం రూ.20కే లభిస్తూండటంతో భోజనప్రియులు దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి క్యూ కడుతున్నారు. వచ్చే సంక్రాంతి నుంచి రూ.30కే భోజనం అందిస్తామని, అందరి ఆకలి తీర్చడంలోనే తనకు ఆనందమని సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. -
తరచూ చికెన్ బిర్యానీ తింటున్నారా? ఫ్రీగా మీకు క్యాన్సర్, గుండెజబ్బులు
బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా,పెద్దా అని తేడా లేకుండా చాలామంది ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో బిర్యానీ ముందుంటుంది. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలు కూడా మనసు పారేసుకుంటారు. నాన్‌వెజ్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా చికెన్ బిర్యానీ ప్రత్యేకతే వేరు. అందుకే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ యాప్స్‌లోనూ బిర్యానీ మోస్ట్ సేలబుల్ డిష్. అయితే టేస్ట్ బాగుంది కదా అని రోజూ బిర్యానీ కుమ్మేస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు. తరచూ బిర్యానీ తింటే ముప్పు తప్పందని హెచ్చరిస్తున్నారు. చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఏదైనా అకేషన్, పార్టీ ఉంటే కశ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. ఈ క్రేజ్‌కు తగ్గట్లే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ బిర్యానీ పాయింట్లు వెలిశాయి. అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో దొరికే బిర్యానీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వాటిలో వినియోగించే మసాలా దినుసులు,నాసీరకం పదార్థాల వల్ల కడుపులో లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కలర్స్‌తో క్యాన్సర్ అసలే మార్కెట్లో ఇప్పుడు కల్తీ బాగా పెరిగిపోయింది. కాదేదీ అనర్హం అన్నట్లు తినే తిండి దగ్గర్నుంచి తాగే నీళ్ల వరకు అన్నింటిని కల్తీ చేసి పడేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇష్టమొచ్చినట్లు రంగులు, ఆర్టిఫిషియల్ ఎసెన్సులు వాడేస్తున్నారు. ఇలాంటి కలర్స్ వాడటం వచ్చే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బిర్యానీ అధికంగా తింటే ఊబకాయం, గ్యాస్, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చికెన్‌పై బాక్టీరియా చికెన్‌పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియా ఉంటుంది. కాబట్టి వండేముందు శుభ్రంగా కడిగి బాగా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. లేకపోతే ఈ బాక్టీరియా శరీరం లోపలికి చేరి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ రెస్టారెంట్స్, హోటల్స్‌లో ఎంతవరకు హైజీన్ మెయింటైన్ చేస్తారన్నది చెప్పలేం. దీనివల్లే ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తరచూ బయట బిర్యానీ తింటే గుండె సమస్యలు కూడా వస్తాయట. మేం రోజూ చికెన్ తింటున్నాం. మాకేం కాలేదు కదా అని వాదించే వాళ్లూ ఉంటారు. అయితే ఇప్పుడు సమస్యలు రాకపోయినా ప్రతిరోజూ బిర్యానీ, మసాలాలు ఎక్కువగా ఉండే వంటలు తింటే దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయట. ప్రోటీన్ సంగతి సరే, మరి కొవ్వు? సాధారణంగా చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జిమ్, వర్కవుట్స్ చేసే వాళ్ల డైట్ లిస్ట్‌లో ప్రతిరోజూ చికెన్ ఉంటుంది. దీనివల్ల ప్రోటీన్ అధికంగా శరీరంలో చేరిపోయి కొవ్వు రూపంలో మారిపోతుంది. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. కాబట్టి రోజూ తినే అలవాటు మానుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే మంచిదంటున్నారు వైద్యులు. -
హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా
ఫుడ్ అన్నింటిలోనూ బిర్యానీకి క్రేజే వేరు. స్నాక్స్, స్టాటర్స్ అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడి తినేది బిర్యానీనే.. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు చెప్పండి. వారానికి ఒకసారి అయినా బిర్యానీ నోట్లో పడాల్సిందే. అంతలా ఇష్టపడుతుంటారు. దేశంలో బిర్యానీ ప్రియుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచికి, ఆదరణకు తగినట్లుగా సరికొత్త పద్ధతి రుచుల్లో ఫుడ్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఏ హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ ధర ఎంత కాదన్న 200 ఉంటుంది. రెస్టారెంట్, టేస్ట్‌ను బట్టి ఇంక ధర ఎక్కువ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైనా బిర్యానీని రూ.59 రూపాయలకే రుచి చూశారా?.. వినడానికి ఆశ్యర్యంగా ఉంది కదూ!.. కానీ ఓ హోటల్ వాళ్లు నిజంగానే 59 రూపాయలకు బిర్యానీని అందిస్తున్నారు. ఈ బిర్యానీ పాయింట్ ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. ‘కాకా 55’ బిర్యానీ పాయింట్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ లభిస్తోంది. దమ్ బిర్యానీ 59 రూపాయలు ఉండగా.. ఇద్దరు తినాలనుకుంటే 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక ఫ్రై బిర్యానీ కూడా రూ. 70కే దొరుకుతుంది. వీరికి హైదరాబాద్‌లో 3 ఔట్లెట్స్ ఉన్నాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయం, కూకట్పల్లి సెకండ్ ఫేజ్, మూడో ఫేజ్ దగ్గర ఉన్నాయి. ఒక్కో హోటల్ వద్ద రోజూ 250 ప్లేట్స్ వరకూ సేల్స్ చేస్తున్నారు. ఆర్డర్లపై కూడా బిర్యానీ తయారు చేసి అందిస్తారు. ఏ పార్టీ ఉన్నా ఒక రోజు ముందు చెప్తే నోరూరించే బిర్యానీ ఆర్డర్ మనముందు ఉంచుతారు. కాస్ట్ తక్కువ ఉన్నా.. రుచి సూపర్‌గా ఉంటుందని అక్కడ తిన్నవారు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకు బిర్యానీ లభించడం హైదరాబాద్‌లోనే ఫస్ట్ టైం. మరి మీరూ కూడ టేస్ట్ చేయాలనుకుంటే కాకా 55 బిర్యానీ వద్దకు వెళ్లాల్సిందే.. వీళ్లకు స్విగ్గీ జొమాటలో కూడా సదుపాయం ఉంది. -
ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఏటీఎంలో బిర్యానీ.. ఎక్కడుందో తెలుసా?
ATM.. ఈ పేరు వినగానే ఎవరికైనా డబ్బులు డ్రా చేసుకునే మిషన్ గుర్తొస్తుంది. వివిధ బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం కార్డుల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల బంగారం కొనుక్కోవడానికి ఏటీఎం వచ్చాయి. తాజాగా మరో కొత్త ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోనే మొట్టమొదటిసారి తమిళనాడులో బిర్యానీ ఏటీఎం తెరిచారు. దీని ద్వారా కేవలం నిమిషాల్లోనే వినియోగదారులు ఘుమఘుమలాడే బిర్యానీని పొందవచ్చు. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకొచ్చింది. నగరంలోని కొలత్తూర్‌లో బాయ్ వీటు కల్యాణం (బీవీకే) ఈ బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించింది. ఇది ప్రీమియం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీని అందిస్తోంది. బిర్యానీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేసినట్లు దీని ప్రతినిధులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. అది వైరల్ అయింది. ఇందులో ఫుడ్ ఎలా డెలివరీ అవుతుందో చూపిస్తోంది. ఈ బిర్యానీ ఏటీఎంలు ఎలా పనిచేస్తాయంటే.. సాధారణ ఏటీఎంల లోపల ఎలా ఉంటుందో ఈ బిర్యానీ ఏటీఎం కూడా అలాగే ఉంటుంది. ఈ ఔట్లెట్లో 32 అంగుళాలతో ఏర్పాటు చేసిన ఈ మెషిన్ లోని మెనూలో నుంచి కావాల్సిన బిర్యానీని టచ్ స్క్రీన్ పై ఎంచుకుని, పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. తరువాత బిర్యానీ ధరను డెయిట్/క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ స్కానర్ ద్వారా చెల్లించాలి. డబ్బు చెల్లించిన అనంతరం స్క్రీన్‌పై కౌంట్ డౌన్ టైమర్ ఆన్ అవుతుంది. వేడి వేడి బిర్యానీ ఇంకెంత సేపట్లో వస్తుందో ఈ టైమర్ ద్వారా తెలుసుకోవచ్చు. నిర్ణీత సమయం పూర్తవగానే ఏటీఎం మెషిన్‌కు ఉన్న చిన్న డోర్‌ను తెరవగానే అందులోని బిర్యానీ పార్శల్‌ను తీసుకెళ్లిపోవడమే. సరికొత్త ఆలోచనతో వచ్చిన ఈ బిర్యానీ ఏటీఎం కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బీవీకే ఐడియా అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. చదవండి: ప్రాంక్ వీడియో.. తెలియక గర్ల్‌ఫ్రెండ్ ఎంత పని చేసిందంటే! View this post on Instagram A post shared by FOOD VETTAI (@food_vettai) -
వైరల్ వీడియో: చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు
-
చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు: వీడియో వైరల్
రెస్టారెంట్లో ఒక్కోసారి మనం ఏదైనా ఆర్డర్ చేస్తే సాంకేతిక సమస్య వల్లో లేక సిబ్బంది కన్ఫ్యూజ్ అవ్వడం వల్లో ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం లేదా సకాలంలో అందచేయలేకపోవడం జరుగుతుంది. ఇది సర్వసాధారణం. ఐతే ఇక్కడోక వ్యక్తి తన ఆర్డర్ చేసిన ఫుడ్ రాలేదని చిర్రెత్తుకొచ్చి ఏకంగా రెస్టారెంట్‌కి నిప్పుపెట్టేశాడు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బంగ్లాదేశ్ రెస్టారెంట్‌కి 49 ఏళ్ల చోఫెల్ నోర్బు అనే వ్యక్తి వచ్చి చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. ఎందువల్లనో సిబ్బంది అతనికి సమయానికి తన ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో కోపేద్రేకంతో రెస్టారెంట్ నుంచి బయటకొచ్చేశాడు. ఆ తర్వాత రోజు సదరు రెస్టారెంట్ వద్దకు వచ్చి మండించే ఒక విధమైన ద్రవాన్ని తీసుకువచ్చి ఆ రెస్టారెంట్ పార్క్ గార్డెన్‌పై వేసి నిప్పు పెట్టాడు. ఐతే ఈ నిప్పు పెట్టే క్రమంలో అతనిపైకి కూడా మంటలు ఎగిసిపడ్డాయి. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు కావడంతో న్యూయార్క్ పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: హిజాబ్ తొలగించి మరీ పోటీల్లో.. అరెస్ట్ కాదు ఆమెకు ఘన స్వాగతం!) -
బిర్యానీ తిని బాలుడి మృతి?
సాక్షి, హైదరాబాద్: చికెన్ బిర్యానీ తెచ్చుకొని కుటుంబ సమేతంగా కలిసి భోంచేసిన ఆ కుటుంబంలో ముగ్గురు హాస్పిటల్ పాలు కాగా..ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖైరతాబాద్ మారుతీనగర్‌లో నివాసముండే రాంబాబు ప్రైవేటు ఉద్యోగి. ఇతనికి భార్య త్రివేణి, కుమారుడు గౌతం నంద (10), కూతరు నిహారిక ఉన్నారు. ఈ నెల 13వ తేదీ శనివారం ఖైరతాబాద్‌లో మొఘల్ రెస్టారెంట్ నుంచి రెండు సింగల్ చికెన్ బిర్యాని పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్లాడు. రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి బిర్యాని తిని పడుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలైనా ఇంట్లోవారెవ్వరు బయటకు రాకపోవడంతో పక్కింటి వారు తలుపు తట్టి లేపారు. మత్తుగా మేల్కొన్న త్రివేణి తలుపు తీయడంతో పక్కింటి వారు వెంటనే అంబులెన్స్‌లో తండ్రితో పాటు కుమారుడు, కూతుర్ని ప్రభుత్వ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే బాబు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి, కూతుర్ని అమీర్‌పేట్ వెల్నెస్ సెంటర్‌కు తరలించి చికిత్స ఇవ్వడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తాము 13 వ తేదీ రాత్రి బిర్యానీ తెచ్చుకుని తిని నిద్రపోయామని, ఆ తర్వాత ఏ జరిగిందో తెలియలేదని త్రివేణి పేర్కొందని, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
రూ.200 బిర్యానీ తిన్న పాపానికి ఆసుపత్రి బిల్లు ఎంతయిందో తెలుసా..?
Food Adulteration Impact On Health: అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉంటున్న రాము మూడు రోజుల కిందట ఓ హోటల్లో బిర్యానీ కొన్నాడు. మధ్యాహ్నం వేళ ఇంటికెళ్లి ఆవురావురుమంటూ తినేశాడు. సాయంత్రానికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్‌గా తేల్చారు. రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసం... కలర్ కోసం వాడిన రంగుల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు చెప్పారు. రూ.200 బిర్యానీ తిన్న పాపానికి రూ.2 వేలు ఆస్పత్రి బిల్లు కట్టి బయటపడ్డాడు. ఇలాంటి కేసులు జిల్లాలో ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తమ ఉద్యోగాన్నే మరిచిపోవడంతో... వ్యాపారులు డబ్బు కోసం జనం ప్రాణాలతో ఆటలాడుతున్నారు. సాక్షి, అనంతపురం: జిల్లాలో ఆహార భద్రత నియంత్రణ శాఖ నిద్ర మత్తులో జోగుతోంది. ఇబ్బడి ముబ్బడిగా కల్తీ ఆహారం సరఫరా అవుతున్నా తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. ముగ్గురు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నా...వారు ఎక్కడున్నారో...ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. జిల్లా ఫుడ్‌కంట్రోల్ అధికారిగా మరో జిల్లాకు చెందిన అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎప్పుడొస్తారో.... ఎప్పుడు వెళతారో కూడా అంతుబట్టడం లేదు. దీంతో ఏ హోటళ్లలో ఎలాంటి ఆహారం వండి వడ్డిస్తున్నారన్న దాని గురించి ఆరా తీసే నాథుడే లేకుండా పోయారు. దీంతో వ్యాపారులు ఆహార ప్రియులను ఆకర్షించడానికి ప్రమాదకర రంగులు వాడుతూ జనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. కల్తీ జోరు...చర్యలు తీసుకునే వారే లేరు ఇటీవల పప్పులు మొదలుకొని నూనెల వరకూ అన్నీ కల్తీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కల్తీపై నిఘా వేసి జనాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. వాస్తవంగా వండిన ఏ ఆహారమైనా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు ర్యాండమ్‌గా నమూనాలు తీయాలి. ఆహార పదార్థాలపై ఆర్సెనిక్ (క్యాన్సర్ కారక) ప్రభావం ఉన్న రంగులు వేస్తే వాటిపై చర్యలు తీసుకోవాలి. టీపొడి నుంచి పాల వరకూ ఇలా ప్రతి ఒక్కదానిపైనా నాణ్యతను పరిశీలించడం, ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలి. చదవండి: (Neem Tree: వెయ్యి జబ్బులను నయం చేసే.. వేప చెట్టుకు ఆపదొచ్చింది) ఈ క్రమంలో ఒక్కో ఫుడ్ ఇన్స్పెక్టర్ నెలకు కనీసం 12 నమూనాలు తీసి ఎఫ్ఎస్ఎల్ (ఫుడ్‌సేఫ్టీ ల్యాబొరేటరీ)కి పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం కల్తీ అయినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్రతను బట్టి సదరు హోటల్‌ను సీజ్ చేసే అధికారం కూడా వారికి ఉంటుంది. కానీ జిల్లాలో ఒక్క కేసూ నమోదు కావడం లేదు. అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారన్న విషయం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. మూడు వేల షాపుల పైనే జిల్లాలో చిన్న చిన్న బడ్డీ కొట్ల నుంచి మోస్తరు హోటళ్ల వరకు దాదాపు 3 వేలు ఉన్నాయి. ఇందులో చాలా వాటిని మున్సిపాలిటీ లైసెన్సు గానీ, ట్రేడ్ లైసెన్సు గానీ లేకుండానే నడిపిస్తున్నారు.. గంటల తరబడి మరిగించిన నాసిరకం నూనెల్లో వేయించిన చిప్స్ అమ్ముతున్నారు. వీటిపై మాన్యుఫాక్చరింగ్ తేదీలుగానీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) లోగోలు గానీ ఉండవు. అయినప్పటికీ వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడా కనిపించడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఐపీఎం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) పరిధిలో ఉంటారు. వీరిపై ఐపీఎం డైరెక్టర్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. చదవండి: (విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!) ధర తక్కువ...కల్తీ ఎక్కువ ►కిలో వంటనూనె, కిలో క్రీమ్‌పౌడర్‌ను బాగా కలిపి మిక్సీలో వేసి తిప్పితే 10 లీటర్ల నకిలీ పాలు తయారవుతాయి. లీటర్ రూ.40 అమ్మినా రూ.400 సొమ్ము చేసుకోవచ్చు. ►స్వచ్ఛమైన నెయ్యి కిలో రూ.600 నుంచి రూ.800 వరకూ అమ్ముతున్నారు. కానీ కొందరు కిలో రూ.120 అమ్ముతున్నారు. ఇదెలా సాధ్యమంటే పామాయిల్లో నెయ్యి వాసన వచ్చే పదార్థాలను కలిపి తయారు చేస్తున్నారు. ఇదేమీ తెలియని జనం ఎగబడి కొంటున్నారు. ►గ్లూకోన్‌డీ పౌడర్ పేరుతోనూ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. రసాయనాల మిశ్రమం, తియ్యగా ఉండేందుకు శాక్రిన్ కలిపి మల్టీ నేషనల్ కంపెనీ కంటే అద్భుత ప్యాకింగ్‌లో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇది తాగితే చాలా ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ►చికెన్ 65, చిల్లీ చికెన్ పేరు చెప్పగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. కానీ తింటే ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్లపై బండ్లలో విక్రయించే వారు మిగిలి పోయిన మాంసాన్ని రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. దానికి ఆర్సెనిక్ కారక రసాయనాలు చల్లి ఆర్డర్ రాగానే వండి వారుస్తున్నారు. ఫలితంగా దీన్ని తిన్న వారు ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ►పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. కిలో శనగపప్పులో 250 గ్రాముల బియ్యాన్ని కలిపి నేరుగా మెషిన్ ఆడిస్తారు. ఈ విషయం ఇటీవలే అధికారుల దృష్టికి వచ్చింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరే ఉన్నారు మా వద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరే ఉన్నారు. అందుకే అనంతపురంలో ఆహార నమూనాలు సేకరించడం లేదు. జనవరిలో పోస్టులు భర్తీ అవుతాయని చెప్పారు. కొత్తగా సిబ్బంది వస్తే నమూ నాలు తీస్తాం. నేను కూడా ఇన్చార్జిగా ఉన్నాను. –శ్రీనివాసులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ (ఇన్చార్జ్) నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా ఏదైనా ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం. అనంతపురం జిల్లాలో నమూనాలు తీసే విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. –డా.మంజరి, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ -
ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే హవా..సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్
గతంతో పోలిస్తే హైదరాబాదీలలో ఆరోగ్య స్పృహ పెరిగిందనేది ఫుడ్ ఆర్డర్ల ద్వారా మరోసారి రుజువైంది. విందు వినోదాల వీకెండ్ తర్వాత రోజు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలివీ.. – సాక్షి, హైదరాబాద్ గ్రాసరీస్‌తో సహా విభిన్న రకాల కేటగిరీ ఉత్పత్తులను స్విగ్గీ అందిస్తున్నప్పటికీ.. మొత్తం ఆర్డర్లలో 48 శాతం ఫుడ్‌కు సంబంధించినవే. ఈ ఏడాది పెట్ ఫుడ్ కూడా ఆర్డర్లు బాగా పెరిగాయి. ఆసక్తికరంగా.. 20వేల ఆర్డర్స్ పెట్ ఫుడ్ కోసం వచ్చాయి. ఫుడ్ ఫర్ హెల్త్.. ఆరోగ్యకరమైన ఆహారం కోరుతూ హెల్త్ హబ్‌కి ఆర్డర్లు ఈ ఏడాది 200 శాతం పెరిగాయి. దేశంలోనే ఆరోగ్య స్పృహ కలిగిన ఆహారం కోరే నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా గతం కంటే మెరుగ్గా హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. విందూ వినోదాలు ఎక్కువగా జరిగే వారాంతపు రోజుల అనంతరం సోమవారం ఆరోగ్యకర ఆహారం గురించి ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటే.. ఆ తర్వాత స్థానం గురువారం దక్కించుకుంది. కీటో శైలి ఫుడ్‌లో 23 శాతం వృద్ధి కనిపించగా, వెగాన్ శైలి, శాకాహారపు ఆర్డర్స్‌లో 83 శాతం పెరుగుదల నమోదైంది. చదవండి: అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ.. సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్.. నగరంలో చికెన్ బిర్యానీ ఆర్డర్లకే ఫస్ట్ ప్లేస్ దక్కుతోంది. అలాగే యాప్‌ని తొలిసారి వినియోగిస్తున్నవారిలో అత్యధికులు చికెన్ బిర్యానీతోనే అరంగేట్రం చేస్తున్నారట. దేశవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు 2 బిర్యానీలుగా చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ వినియోగంలో వరుసగా చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లు టాప్‌లో ఉన్నాయి. ముంబైలో మాత్రం చికెన్ బిర్యానీని దాల్ కిచిడీ దాటేసింది. చదవండి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి ! బ్రౌనీస్ బాక్స్ డెలివరీకి 43.3 కి.మీ జర్నీ.. ► అత్యధిక దూరం ప్రయాణం చేయించిన ఆర్డర్లలో నగరానికి రెండో స్థానం దక్కింది. ఓ కస్టమర్ తన ప్రియ నేస్తానికి ఆర్డర్ చేసిన చాక్లెట్ బ్రౌనీస్ బాక్స్‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అందించడం కోసం సిటీకి చెందిన డెలివరీ బాయ్ 43.3 కి.మీ ప్రయాణం చేశాడు. ► ఈ విషయంలో ప్రథమ స్థానం దక్కించుకున్న బెంగళూరులో ఫుడ్ ప్యాక్ అందించడానికి ఓ స్విగ్గీ బాయ్ ఏకంగా 55.5 కి.మీ ప్రయాణం చేశాడు. కోల్‌కతాలో ఓ బిర్యానీ ప్రేమికురాలు తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ కోసం 39.3 కి.మీ ప్రయాణం చేయించింది. చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు మనసు దోసె... దోసెలు ఆర్డర్ చేయడంలో బెంగళూరు టాప్‌లో ఉంది. బటర్ దోసె ఆర్డర్లలో బెంగళూరు తర్వాత స్థానం నగరానికి దక్కగా ముంబై మూడో స్థానంలో ఉంది. నగరవాసులు అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో.. చికెన్ బిర్యానీ తొలిస్థానంలో ఉండగా, చికెన్ 65 తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో పన్నీర్ బటర్ మసాలా నిలవగా, మసాలా దోసె 4, ఇడ్లీ 5వ స్థానాల్లో నిలిచాయి. సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాత స్నాక్స్‌కు ఆర్డర్స్ పెరిగాయి. 80 శాతం మంది ఆన్లైన్ ద్వారా పేమెంట్స్‌కు మొగ్గు చూపుతున్నారు కొద్దిమంది మాత్రమే డెలివరీ తర్వాత నగదు చెల్లిస్తున్నారు. -
నిమిషానికి 115 ఆర్డర్స్..! 2021లో భారతీయులు ఎగబడి లాగించేసిన ఫుడ్ ఇదే...!
2021గాను ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్స్ చేసిన ఫుడ్ డిషెస్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్‌తో బిర్యానీ టాప్ పొజిషన్లో నిలిచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఆరో వార్షిక నివేదిక StatEATstics రిపోర్ట్‌లో పలు విషయాలను కంపెనీ పేర్కొంది. అగ్రస్థానం బిర్యానీదే..! భోజన ప్రియులు 2021లో స్విగ్గీ ప్లాట్‌ఫాంను భారీగానే తలుపుతట్టారు. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గీలో చేరినట్లు కంపెనీ ప్రకటించింది. వీరు మొదటి ఆర్డర్‌గా చికెన్ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్ చేసిన స్నాక్ ఐటమ్‌గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం. గత ఏడాది 2020లో, నిమిషానికి 90పైగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాదిలో ఫుడ్ లవర్స్ ఒక సెకనులో సుమారు రెండు బిర్యానీలను ఆర్డర్స్ చేసినట్లు పేర్కొంది. చికెన్ బిర్యానీ, సమోసాల తరువాత చికెన్ వింగ్స్, పావ్ భాజీ నిలిచాయి. 21 లక్షల ఆర్డర్స్‌తో ఇండియా సెకండ్ ఫేవరెట్ స్నాక్ పావ్‌బాజీ నిలిచింది. స్విట్స్లో 21 లక్షల ఆర్డర్స్‌తో గులాబ్ జామూన్ నిలవగా, తరువాతి స్థానంలో రస్మలై సుమారు 12 లక్షల ఆర్డర్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. హెల్త్‌పై ఎక్కువ.. కరోనా రాకతో చాలా మంది హెల్తీ డైట్‌పై అవగాహన పెంచుకున్నారు. స్విగ్గీలో హెల్తీ డైట్‌ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పెడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా తొలిస్థానంలో బెంగుళూరు నిలవగా, తరువాతి స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి. గ్రాసరీ బిజినెస్ విషయానికి వస్తే..! స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలతోపాటుగా ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రాసరీ డెలివరీ సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో 28 మిలియన్ ప్యాక్‌ల పండ్లు , కూరగాయలను డెలివరీ చేసింది. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసిన మొత్తం అరటిపండ్ల పరిమాణం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2.6 రెట్లు అధికం. చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి? -
హైదరాబాద్‌లో దమ్ బిర్యానీ మాత్రమే కాదు.. ఈ వెరైటీలు తెలుసా?
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది..అసలు ఎప్పుడు తొలిసారిగా తయారు చేశారనే దానిపై ఎన్నెన్నో వాదనలున్నాయి. పర్షియా నుంచి మొఘల్స్ మన దేశానికి తీసుకువచ్చారనేది ఓ వాదన. తొలిసారిగా బిర్యానీ రుచులను 16వ శతాబ్దంలో మాత్రమే చవిచూశారని..ఆ తరువాత లోకల్ ఫ్లేవర్స్ కూడా జోడించి ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న బిర్యానీలు తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బిర్యానీ పుట్టుక క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ దీనిని తీసుకువచ్చాడనేది మరో ప్రచారమూ ఉంది. ఎవరి వాదనలు ఎలాగున్నా.. బిర్యానీ ఇప్పుడు స్థానికీకరించబడిందన్నది మాత్రం నిజం. హైదరాబాద్ దమ్ బిర్యానీ.. కశ్మీరీ డ్రైఫ్రూట్స్ బిర్యానీ, నవాబుల కిచెన్ల నుంచి నేరుగా వచ్చిన లక్నోవీ బిర్యానీ.. సింధీ, మొగలాయి, మలబార్ అన్నీ విభిన్నం. సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ..ఆ మాటే చాలు ఆహారాభిమానులకు నోటిలో లాలాజలం ఊరటానికి! బాస్మతి బియ్యం, మాంసం లేదంటే కూరగాయలు.. కాదంటే పన్నీర్...మరో వెరైటీ..ఇలా బిర్యానీ గురించి చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. నగర ఆహారంలో ఎంతగానో మమేకమై.. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన హైదరాబాదీ గురించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ బిర్యానీ ఇలా ఉంటే..నగరంలో మరెన్నో వెరైటీల బిర్యానీలు సైతం లభిస్తున్నాయి. అందులో కొన్ని మలబార్ బిర్యానీ, మొఘలాయ్, కలకత్తా, లక్కోవి, సింధీ పేరిట తయారు చేస్తున్న వెరైటీ బిర్యానీలు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ అయ్యాయి. చదవండి: (నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’) ►నగరంలో దమ్ బిర్యానీ కాకుండా ఇంకెన్నో రకాల బిర్యానీలూ కూడా లభ్యమవుతున్నాయి. ►భిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయాలు, కొత్తకొత్త అభిరుచులకు తగ్గట్టుగా ప్రస్తుతం నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్స్‌ల్లో దేశ వ్యాప్తంగా లభించే వివిధ రకాల బిర్యానీలు అంటుబాటులో ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ నిజాం నవాబుల కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. ఇప్పటికీ మన నగరంలో ఉంది. మన హైదరాబాదీ బిర్యానీ ప్రధానంగా రెండు రకాలలో లభ్యమవుతుంది. ఒకటి పక్కీ బిర్యానీ అయితే మరోటి కచ్చీ బిర్యానీ. పక్కీ బిర్యానీ అంటే..బాస్మతి బియ్యం వేరేగా వండటంతో పాటుగా మాంసం కూడా ప్రత్యేకంగా వండి ఆ తర్వాత రెండింటినీ లేయరింగ్గా చేసి వండటం. కచ్చీ బిర్యానీ అంటే మాంసం, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్..ఇలా అన్ని పదార్థాలు కలిపి, మైదాతో సీల్ చేసిన పాత్రలో ఉడికించి వండుతారు. నగరంలో ఎక్కువగా లభించేది ఈ బిర్యానీయే. మొఘలాయ్ బిర్యానీ అత్యంత రుచికరమైన బిర్యానీలలో ఇది ఒకటి. టోలిచౌకి ప్రాంతంలోని కొన్ని రెస్టారెంట్లు ఈ బిర్యానీ అందిస్తున్నాయి. మొఘల్ కిచెన్ నుంచి వచ్చిన అద్భుతమైన రుచులలో ఇది కూడా ఒకటి. పెరుగు, బాదం పేస్ట్, నెయ్యి, డ్రైఫ్రూట్స్, మాంసం లాంటి ముడి పదార్థాలతో ఇది తయారవుతుంది. మనహైదరాబాదీ బిర్యానీకి దగ్గర చుట్టం ఇది. ఆఫ్ఘనీ .. ఆఫ్ఘనీ బిర్యానీ కూడా నగరంలో లభిస్తుంది. అయితే పాతబస్తీలోని మొఘల్‌పురాలో ఒకటి రెండు చోట్ల ఇది రెగ్యులర్‌గా లభిస్తుంది. ఇందులో మసాలాలు తక్కువగా వినియోగిస్తారు. డ్రైఫ్రూట్స్‌తో పాటు జైఫల్, జావాత్రి, నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తారు. మలబార్ కేరళలోని మలబార్ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిర్యానీ సైతం దమ్ శైలిలోనే వండుతారు. స్వీట్ అండ్స్పైసీ బిర్యానీ ఇది. దీనిలోనూ పలు రకాలున్నాయి. అంటే ప్రాంతాన్ని బట్టిఫ్లేవర్లు కూడా మారుతుంటాయి. ఈ బిర్యానీ పంజాగుట్ట ప్రాంతంలోని పలు రెస్టారెంట్లలో ప్రత్యేకంగా అందిస్తున్నారు. సింధీ గుజరాతీలకు ప్రీతిపాత్రమైన బిర్యానీ ఇది. సింధ్ ప్రాంతపు రుచులను ఇది చవిచూపిస్తుంది. దీనిలో పచ్చిమిర్చి, రోస్టెడ్స్పైస్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, డ్రైఫ్రూట్స్, పులిసిన పెరుగు వంటివి విరివిగా వాడతారు. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులోని సింధీ రెస్టారెంట్లో లభిస్తుంది. లక్నోవీ మన హైదరాబాద్ బిర్యానీకి దగ్గర చుట్టం ఈ లక్నోవీ బిర్యానీ. ఇది కూడా నిజామ్ల (అవధ్ ప్రాంతీయులు) కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. కాకపోతే మన హైదరాబాద్ బిర్యానీ అంత స్పైసీగా మాత్రం ఇది ఉండదు. దమ్పుక్త్ శైలిలో ఇది రూపుదిద్దుకుంటుంది. మీరాలంమండిలోని హోటల్స్‌లో ఈ బిర్యానీని ఆఫర్ చేస్తున్నారు. కలకత్తా బిర్యానీ.. ఈ లక్నోవీ బిర్యానీకి సబ్‌వేరియంట్ కలకత్తా బిర్యానీ. అదెలా అంటే, బ్రిటీషర్లను కలుసుకోవడానికి కలకత్తా వెళ్లిన అవధ్ నవాబు వాజీద్ అలీ షా ఫుడ్ పరంగా అమిత జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎక్కడకు వెళ్లినా తన వంట వారిని వెంటపెట్టుకుని వెళ్లే అతను కలకత్తాకు కూడా అలాగే వెళ్లారట. అక్కడ చేసిన ప్రయోగాలకు ప్రతిరూపం కలకత్తా బిర్యానీ అన్నది ఓ వాదన. అయితే బెంగాలీల ఇతర వంటకాల్లాగానే కాస్త తియ్యదనం ఈ బిర్యానీలో ఉంటుంది. ఎల్లో రైస్, యోగర్ట్ బేస్డ్మీట్, బాయిల్డ్‌ఎగ్, బంగాళా దుంపలతో ఈ బిర్యానీ రూపుదిద్దుకుంటుంది. బెంగాలీ స్నేహితుల ఇళ్లలో మాత్రమే కాదు.. నగరంలో కొన్ని రెస్టారెంట్లలో జరిగే ఫుడ్ఫెస్టివల్స్ సమయంలో ఈ రుచులను ఆస్వాదించొచ్చు. ప్రత్యేంగా పాతబస్తీలోని ఘాన్సీబజార్‌లోని పలు బెంగాలీ హోటల్స్ అందుబాటులో ఉంది. -
నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’
సాక్షి, పహాడీషరీఫ్: నగర వాసులను నోరూరిస్తోంది మండీ బిర్యానీ. ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ బిర్యానీని ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జల్పల్లి, ఎర్రకుంట, షాయిన్‌నగర్, పహాడీషరీఫ్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ మండీ హోటల్స్(మతామ్) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్ భాషలో మండీ అంటే బిర్యానీ అని, మతామ్ అంటే హోటల్ అని అర్థం. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు. చదవండి: మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ ! పౌష్టిక విలువలు పుష్కలం మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు.ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి: బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఎవరి ప్లేట్లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్‌గా వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి తినడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ హోటళ్లన్నీ అరబ్ స్టైల్‌ను అనుసరిస్తున్నాయి. ఏ మతామ్లోకి వెళ్లినా ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు. మండీ తయారు చేసే విధానం.. మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్/చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు. ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసేందుకు అరబ్ దేశానికి చెందిన వంట మాస్టర్లనే వినియోగిస్తున్నారు. ప్రధాన రోహదారుల్లో వెలుస్తున్న హోటళ్లు ఎర్రకుంట ప్రధాన రహదారికిరువైపులా వెలిసిన మతామ్లతో ఆ రహదారిని ప్రస్తుతం మండీ రోడ్డుగా పిలుస్తున్నారు. ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మొదలుకొని షాహిన్‌నగర్ హైవే హోటల్ వరకు దాదాపు 30 మండీ మతామ్‌లు వెలిశాయటే ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. -
ఎక్స్ట్రా మసాలా.. లెగ్ పీస్ లేదు.. స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు రోజూ ఎంతో మంది తమ సమస్యలపై విజ్ఞప్తులు చేస్తుంటారు. వీటిపై ఎప్పటికప్పుడు స్పందించే కేటీఆర్.. తన కార్యాలయ సిబ్బంది ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు శుక్రవారం ఓ చిత్రమైన విజ్ఞప్తి వచ్చింది. తోటకూరి రఘుపతి అనే నెటిజన్ ‘‘జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీసులో ఎక్స్ట్రా మసాలా, లెగ్ పీస్తో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. కానీ నాకు ఏదీ రాలేదు. జొమాటో ప్రజలకు సేవ చేసేది ఇలాగేనా?’’అంటూ బిర్యానీ ఫోటో తీసి పెట్టిన పోస్టును కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘నన్ను ఎందుకు ట్యాగ్ చేశావు. నా నుంచి ఏం కోరుకుంటున్నావు’’అంటూ రిప్లై ఇచ్చారు. ఇది వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు వ్యంగ్యంగా, హాస్యభరితంగా స్పందించారు. -
నువ్వు గ్రేట్ గురు! వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ
ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా దేశంలో ఇప్పటికే అధిక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వల్ల ఆరోగ్యపరంగానే కాదు ఆర్థికంగాను తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కొంత మంది ఇతరులకు సహాయం చేస్తూ మానవత్వానికి మరో పేరులా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సుమారు 200 వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నాడు. అది కూడా చికెన్ బిర్యానీతో వాటి కడుపు నింపడం విశేషం. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రంజిత్ నాథ్ రోజూ దాదాపు 40 కిలోల బిర్యానీ వండుకుని నగరంలోని పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఆహారాన్ని అందిస్తున్నాడు. లాక్డౌన్ మొదలయిన తర్వాత జంతువులకు ఆహారం దొరకడం కష్టమైంది. వాటిని చూసి ఎంతో చలించిపోయారు రంజిత్. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. నాగ్‌పూర్‌లో వీధి కుక్కలు, పిల్లులకు ప్రతి రోజు అన్నం పెట్టేందుకు ముందుకొచ్చారు. అలా అప్పటి నుంచి ప్రతి రోజు దాదాపు 200 వరకు వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు. బుధవారం ఓ పత్రిక సంస్థతో రంజిత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ కుక్కల కోసం ప్రతీ రోజు 30-40 కిలోల చికెన్ బిర్యానీని సిద్ధం చేసుకుంటాను. వీధి జంతువులను నా పిల్లల్లాగే భావిస్తాను. నేను జీవించి ఉన్నంత వరకు ఈ పని చేస్తుంటాను. పైగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపాడు. నా పని మధ్యాహ్నం వంటతో మొదలై.. ఇలా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు బైక్ మీద నగరం చుట్టూ తిరిగి పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు భోజనం పెట్టి వాటి ఆకలిని తీర్చడంతో నా పని పూర్తి అవుతుంద’ని అన్నాడు. చదవండి: మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ Ranjeet Nath from Nagpur feeds more than 150 strays 🐶 “They’re like my kids now & I will do this till I am alive. It makes me happy” He’s a true inspiration 🙇 If anyone has his contact details, do share. Would like to contribute a bit from my end 🙏 📸: IG/abhinavjeswani pic.twitter.com/DDm2sTDXf7 — Nigel D'Souza (@Nigel__DSouza) May 20, 2021 -
అంతరిక్షానికి తీసుకెళ్లే వంటకాలు ఇవే!
మైసూరు: మనలో చాలా మందికి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ ఏమి తింటారు అనే ప్రశ్నలు సాధారణంగా వస్తుంటాయి. అయితే వారికోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఆహార పదార్దాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా గగన్‌యాన్ వ్యోమగాముల కోసం ఇస్రో ప్రత్యేకంగా వంటకాలను తయారు చేస్తుంది. ఈ వంటకాలను మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎఫ్ఆర్ఎల్) మీల్స్ రెడీ టు ఈట్ ప్యాకింగ్ ఫుడ్‌ను సిద్ధం చేసింది.(చదవండి: లీకైన ఎంఐ11 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ ధరలు) ఆవకాయ పచ్చడి, చికెన్ బిర్యానీ, మూంగ్‌దాల్ హల్వా, దాల్ మక్ని, షాహి పన్నీర్, చికెన్ కోర్మా వంటి 40 ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసినట్లు ఒక డిఎఫ్ఆర్ఎల్ అధికారి తెలిపారు. అధికారి మాట్లాడుతూ... వ్యోమగాముల రుచి లేదా ఆహార ప్రాధాన్యతలు గురుంచి మాకు తెలియదు. ఎందుకంటే వారి ఇష్టానికి అనుగుణంగా కాకుండా ఇస్రో తెలిపిన మేరకు వీటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గగన్‌యాన్ కోసం ఎంపికైన 6గురు ఇచ్చిన జాబితాలో నుంచి ఆహార పదార్థాలను ఎంచుకోనున్నట్లు తెలిపారు. తర్వాత వారి అభిప్రాయం ఆధారంగా ఆహారం సర్దుబాటు చేయబడుతుంది అని అతను పేర్కొన్నారు. డిఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను సిద్ద చేసి ప్యాక్ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది. అలాగే ఈ వంటకాలు తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు పాడవ్వకుండా ఉంటాయి. వండాల్సిన అవసరం లేని పౌచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. రోజూ సుమారు 2,500 కిలోల కేలరీలు శరీరానికి అందేలా మొత్తం డైట్ ప్లాన్ చేశారు. అలాగే ఆహారాన్ని వేడి చేయడం కోసం అంతరిక్షంలో ఉపయోగించగల ప్రత్యేక హీటర్ సిద్ధం చేసారు. వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేసారు. -
చికెన్.. చికెన్.. మటన్.. చికెన్
ఏం తిందాం? రెస్టారెంట్‌కు వెళ్లినా... ఇంటికి పార్శిల్ తెప్పించుకున్నా వచ్చే మొదటి ప్రశ్న. అడగడం పూర్తయిందో లేదో... సమాధానం వచ్చేస్తుంది. బిర్యానీ... అదీ చికెన్ బిర్యానీ. బిర్యానీకి హైదరాబాద్ ఎప్పుటినుంచో ఫేమస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్. మనోళ్లు చికెన్ బిర్యానీ అంటే చాలు లొట్టలేస్తూ లాగించేస్తున్నారు. భారతీయులకు చికెన్ బిర్యానీయే అత్యంత ప్రీతిపాత్రమైన డిష్ అని మరోసారి రుజువైంది. అంతేకాకుండా నాన్‌వెజ్, వెజ్ అనే తేడాలు లేకుండా 2020లో మనదేశంలో ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువగా బిర్యానీ పార్శిల్ ఆర్డర్లు వస్తున్నాయి. మొత్తం ఆర్డర్లలో... అత్యధికంగా ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ కాగా ఆ తర్వాతి స్థానాల్లో మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ నిలిచాయి. దేశంలో 2020 జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చిన లక్షలాది ఆర్డర్లను ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’విశ్లేషించింది. స్విగ్గీ విడుదల చేసిన ఐదో ఎడిషన్ స్టాట్‘ఈట్’స్టిక్స్ రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్ హెల్తీఫుడ్కు మెట్రోల మొగ్గు: హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోలలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల కోసం మొగ్గుచూపుతున్నట్టు తేలింది. సూపర్ గ్రెయిన్స్ ఆధారిత ఆహారాన్ని కోరే ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది 127 శాతం పెరిగింది. శాకాహార పదార్థాల ఆర్డర్లు 50 శాతం, అధికప్రొటీన్ ఫుడ్ ఆర్డర్లు 49 శాతం పెరిగాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తీసుకోవడం, మధ్యాహ్నభోజనం ఓ మోస్తరుగా, రాత్రిపూట మితంగా తినడమనేది పాటించదగ్గ ఆరోగ్యసూత్రం. మెట్రోల్లో దీన్ని జనం ఆచరిస్తున్నారని తేలింది. సగటున 427 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో, 350 కేలరీల ఫుడ్డును లంచ్‌కు, సగటున 342 కేలరీలనిచ్చే ఆహారాన్ని డిన్నర్లో తీసుకుంటున్నారని తమ ఆర్డర్లను బట్టి స్విగ్గీ విశ్లేషించింది. హైఫైబర్ ఇడ్లీ, హైప్రోటీన్ కిచ్డీ, కొవ్వుతక్కువుండే సలాడ్లు, శాండ్విచెస్, గ్లూటెన్ రహిత ఐస్‌క్రీమ్‌లను ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా ఎక్కువ తీసుకుంటున్నారు. స్ట్రీట్ ఫుడ్‌కూ డిమాండే.. పానీపూరి, ఇతర స్ట్రీట్‌ఫుడ్‌ను సైతం వినియోగదారులు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 2 లక్షలకు పైగా పానీపూరి ఆర్డర్లను డెలివరీ చేశారు. పీఎం స్వనిధి స్కీంతో భాగస్వామ్యంలో భాగంగా దేశంలోని 125 నగరాల్లోని 36 వేల వీధివ్యాపారుల ద్వారా మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్స్ రకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్విగ్గీ ప్రకటించింది. ► ఈ ఏడాది నమోదైన 3 లక్షల మంది కొత్త స్విగ్గీ వినియోగదారుల మొట్టమొదటి ఆర్డర్ చికెన్ బిర్యానీయే. ► ఈ ఏడాది 1 వెజ్బిర్యానీకి 6 చికెన్ బిర్యానీ నిష్పత్తిలో ఆర్డర్లు వచ్చాయి ► లాక్డౌన్ మొదలు ఇప్పటివరకు పానీపూరీల కోసం 2 లక్షల ఆర్డర్ చేశారు ► స్విగ్గీ ద్వారా ఇంట్లో వండుకోవడానికి తెప్పించుకునే మాంసాహారంలోనూ చికెన్‌దే అగ్రస్థానం. 6 లక్షల కేజీల చికెన్‌ను డెలివరీ చేశారు. తర్వాతి స్థానంలో చేపలు నిలిచాయి. ► మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో బెంగళూరుది మొదటిస్థానం. ► ఈ ఏడాది ‘లాక్డౌన్ బర్త్‌డేస్’సెలబ్రేషన్స్ కోసం 6 లక్షల కేక్‌లు డెలివరీ అయ్యాయి. ► స్విగ్గీ డెలివరీ స్టాఫ్‌కు భోపాల్, బెంగళూరుకు చెందిన ఇద్దరు వినియోగదారులు అత్యధికంగా రూ.5 వేల చొప్పున టిప్పులిచ్చారు . హైదరాబాద్ అభి‘రుచు’లు 1) చికెన్ బిర్యానీ 2) ఇడ్లీ 3) మసాలా దోశ 4) చికెన్ 65 5) పన్నీర్ బటర్ మసాలా 6) వడ 7) మటన్ బిర్యానీ 8) వెజ్ బిర్యానీ ఆర్డర్లలో టాప్–5 నగరాలు 1) బెంగళూరు 2) ముంబై 3) చెన్నై 4) హైదరాబాద్ 5) ఢిల్లీ -
ప్రతీ సెకనుకో బిర్యానీ : స్విగ్గీ సీక్రెట్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఇండియన్స్ ఫేవరెట్ ఫుడ్ ఐటెంల జాబితాను ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తాజాగా వెల్లడించింది. చికెన్ బిర్యానీ భారతదేశానికి ఇష్టమైన వంటకంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ,లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన ఇండియన్స్ 2020లో సెకనుకు ఒక చికెన్ బిర్యానీ లాగించేశారట. స్విగ్గీ స్టేట్ఈటిక్స్ 2020 ప్రకారం, ఈ ఏడాది ప్రతి సెకనుకు బిర్యానీ ప్లేట్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఆర్డర్ చేశారు. ప్రతి వెజ్ బిర్యానీకి, ఆరు చికెన్ బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ అందుకుందట. "వెజ్, చికెన్, మటన్, ఆలూ ఇలా మొత్తంగా 2020లో ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీని అర్డర్లను అందుకున్నామని స్వీగ్గీ మంగళవారం ప్రకటించింది. కరోనా కాలంలో సెకనుకో బిర్యానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా రెస్టారెంట్లు నెలల తరబడి మూసి వేయడంతో, నిబంధనల సడలింపు తరువాత తమ ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరిగిందని స్విగ్గీ తెలిపింది. మైటీ చికెన్ బిర్యానీ దేశానికి అత్యంత ఇష్టమైన వంటకంగా నిలిచిందని పేర్కొంది. ఇంకా ‘పన్నీర్ బటర్ మసాలా', 'మసాలా దోస', 'చికెన్ ఫ్రైడ్ రైస్' 'మటన్ బిర్యానీ' వంటి వంటకాలు భారతదేశానికి ఇష్టమైన పిక్-మీ-అప్ వంటకాలుగా ఉన్నాయి. లాక్డౌన్ అనంతరం రెండు లక్షల 'పానిపురి' ఆర్డర్లను డెలివరీ చేశామని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించిన స్విగ్గి హెల్త్‌హబ్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో కూడా వృద్ధిని సాధించిందని కంపెనీ తెలిపింది. చికెన్ బిర్యానీ కోసమే 3 లక్షల మంది యాప్ ఇన్స్టాల్ మూడు లక్షల మంది కొత్త వినియోగదారులు చికెన్ బిర్యానీని ఆర్డర్ చేయడం కోసమే స్విగ్గి యాప్‌ను ఇన్స్టాల్ చేశారని వెల్లడించింది. దీంతోపాటు సూపర్ ధాన్యాల వంటకాల ఆర్డర్లలో 127 శాతం, శాకాహార వంటకాలు 50 శాతం, అధిక ప్రోటీన్ ఆహార పదార్థాలు 49 శాతం, కీటో- ఫ్రెండ్లీ ఐటెమ్స్ 46 శాతం పెరుగుదల నమోదు చేశాయి. అలాగే "హై-ఫైబర్ ఇడ్లీ, హై-ప్రోటీన్ కిచ్డీ, వేగన్ గ్రేవీ, లోఫ్యాట్ సలాడ్లు, కీటో-ఫ్రెండ్లీ శాండ్విచ్లు, గ్లూటెన్-ఫ్రీ ఐస్ క్రీమ్" లాంటి వంటకాలు స్విగ్గీ ప్లాట్ఫామ్లో 2020 లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆరు ఆరోగ్యకరమైన వంటకాలుగా నిలిచాయి. 2014 లో స్థాపించబడిన స్విగ్గి ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఉంది. ఏప్రిల్ 2020లో 43 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన స్విగ్గీ విలువ 3.6 బిలియన్ డాలర్లకు చేరింది. -
పది పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం
సాక్షి, చెన్నై : దక్షిణ భారత్‌లో బిర్యానీ ప్రియులు అధికంగా ఉంటారు. చికెన్, మటన్ బిర్యానీ అంటే లొట్టలేసుకొని తినేవారు చాలా మంది ఉంటారు. బిర్యానీకి ఉన్న ఈ క్రేజ్‌తో చాలామంది వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు, యాభై రూపాయలు, పదిరూపాలయకే బిర్యానీ అంటూ ఇప్పటివరకు రకరకాల ఆఫర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా 10 పైసలకు బిర్యానీ దొరుకుతుంది. ఈ రోజు(అక్టోబర్ 11) బిర్యానీ డే. ఈ సందర్భంగా తమిళనాడు బిర్యానీ వ్యాపారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. తిరుచ్చి, మధురై, దింగిగల్, చెన్నైలలో 10 పైసలకే బిర్యానీ అమ్మకాలు నిర్వహించారు. దీంతో భారీగా జనం ఎగబడ్డారు. కిలో మీటర్ల మేర బారులు తీశారు. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా బిర్యానీ కోసం స్థానికులు క్యూకట్టారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే బెంగళూరులో ఓ ప్రముఖ రెస్టారెంట్ భారీ ఆఫర్ ప్రటించింది. దీంతో ఉదయం 4 గంటల నుంచే బిర్యానీ కోసం జనం క్యూ కట్టారు. దాదాపు 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారుతీరుతారు. అక్కడ ప్రతి ఆదివారం ఇదే సీన్ కనిపిస్తుంది.కనీసం కరోనా నిబంధనలను కూడా వారు పాటించలేదని స్థానికులు అంటున్నారు. -
ఒకే కంచం...‘ఆరు’గించు తలా కొంచెం
సాక్షి, సనత్‌నగర్: హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్‌కి గుర్తొచ్చే బిర్యానీకి ఇప్పుడు పెద్ద పోటీ వచ్చి పడింది. అచ్చం బిర్యానీనే తలపించే ఒకనాటి సంప్రదాయ మండీ... నగరవాసులకు లేటెస్ట్ క్రేజీ డిష్‌గా మారిపోయింది. ఇటీవలి కాలంలో మరే డిష్ కూడా ఇంత వేగంగా సిటిజనులకు చేరువ కాలేదని ఫుడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆరేబియన్ రెస్టారెంట్లలో మండీ, ఖబ్సా వంటకాలే ప్రధానం. వీటిని మటన్, చికెన్, బోన్‌లెస్ ఫిష్, కౌజుపిట్టలతో తయారుచేస్తుంటారు. ఒకనాటి అరబిక్ సంప్రదాయ యెమిని వంటకం అయిన మండీని మటన్, రైస్‌కు తగినన్ని మసాలాలు కలిపి మాంసంలోని కొవ్వులతో దీనిని వండుతారు. కొన్ని చోట్ల మండీని డ్రైఫ్రూట్స్, మటన్ సూప్‌ను మిక్స్ చేసి కూడా అందిస్తారు. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతంలో ఒకప్పుడు ఇది బాగా పాపులర్ కాగా.. ఇప్పుడు నగరవ్యాప్తంగా అంతకు మించి భోజన ప్రియుల ఆదరణ పొందుతోంది. మండి పుణ్యమాని బార్కాస్‌కి కూడా సిటీ ఫుడ్ మ్యాప్‌లో చెప్పుకోదగ్గ స్థానమే లభించింది. అడుగడుగునా.. కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే మండీ సిటి వ్యాప్తమైంది. బార్కాస్ తర్వాత బంజారాహిల్స్‌లోని స్పైస్ 6 ఈ అరబిక్ ఫుడ్, ఆ తర్వాత మెహదీ పట్నం అలా అలా... ఇప్పుడు మండీని నగరంలోని దాదాపు ప్రతి రెస్టారెంట్ అందించడం ప్రారంభించాయి. స్విగ్గీ జాబితా ప్రకారం... ప్రతి చోటా సగటున 10 ప్రాంతాల్లో ఇది లభ్యమవుతోంది. ఖైరతాబాద్‌లో 22, అత్తాపూర్‌లో 17, సైనిక్‌పురిలో 10, అమీర్‌పేట్‌లో 23 చోట్ల మండీ అందుబాటులో ఉంది. ఇక ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో సైతం పెద్ద సంఖ్యలో ఆరేబియన్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయంటే కారణం మండీయే. ఆ‘ధర’ణ అందుకే.. ఇది రూ.200 సమీప ధరలో అందుబాటులో ఉండడం వల్ల యువతకు బాగా చేరువైంది. అలాగే మరోవైపు చూడడానికి బిర్యానీ తరహా రుచి, పొడిగా ఉండడం వల్ల హైదరాబాదీలకు బాగా నచ్చుతోందని ఫుడ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దీనిలో చికెన్, ఫిష్ మండీ కూడా లభిస్తోంది. ఒకే కంచం...‘ఆరు’గించు తలా కొంచెం అందరూ కలిసి ఒకే కంచంలో తినడం అనేది అరబిక్ సంప్రదాయంలో భాగం. యెమన్, సౌదీ అరేబియా, ఒమన్, సోమాలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. పీట చుట్టూ కూర్చొని ఆ పీటపై ఉంచిన పెద్ద ప్లేటులో వడ్డించిన మండీని అందరూ కలసి భుజిస్తారు. అదే ఇప్పుడు భోజన ప్రియులను కట్టిపడేసింది. .గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేసే సంస్కృతి దాదాపుగా కనుమరుగైపోయింది. ఎవరికి సమయాన్ని బట్టి వారు తినేస్తున్నారు. బయట రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు కలసి భోజనం చేస్తుంటారు. కానీ ఒకే కంచంలో కలిసి భోజనం చేసే సంస్కృతి ని అరేబియన్ మండీ రెస్టారెంట్లు తిరిగి తెచ్చాయని చెప్పవచ్చు. ఫుడ్రిఫ్టర్కు చెందిన అశిష్ నాయక్ ఏమంటారంటే... పలువురు స్నేహితులతో కలిసి కూర్చుని కబుర్లతో పాటు తినడం చాలా ఆనందాన్ని అందిస్తుంది. మండీ గెట్ టు గెదర్ ఓవర్ ఫుడ్ లాంటిది కమ్యూనిటీ డైనింగ్‌కు ఇది మంచి ఊతమిస్తోంది’’ అంటున్నారు. పాత ఒక కొత్త... సిటీ ప్రజలు కొత్త రకం వంటకాలను కోరుకుంటుంటారనడానికి మండీ రెస్టారెంట్లకు వస్తున్న ఆదరణే సాక్ష్యం. ఒకప్పుడు ఓల్డ్‌సిటీలోనే ఉన్నప్పటికీ చాలా మందికి వీటి గురించి తెలియదు. దీంతో వారికి ఇది కొత్తగా పరిచయమైంది. అరేబియన్ సంప్రదాయం అయినప్పటికీ ఎక్కువ శాతం ముస్లిమేతరులే రెస్టారెంట్‌కు వస్తున్నారు. – మహ్మద్ ఇమ్రాన్, ఆరేబియన్ మండీ రెస్టారెంట్ మూసాపేట కలిసి తింటే కలదు రుచి... ఇంట్లో ఉన్నప్పుడు కలసి భోజనం చేసే సమయం కుదరదు. అందులోనూ ఒకే కంచంలో తినడం జరగని పని. ఆరేబియన్ మండీ రెస్టారెంట్లో కలసి భోజనం చేయడమే కాదు..ఒకే కంచంలో చేయడం, అందులోనూ ఎంచక్కా కింద కూర్చొని తినడం మధురానుభూతిని ఇస్తోంది. – జ్యోతి, కూకట్పల్లి. కాక్టైల్ మిక్సింగ్ మిక్సింగ్ అనేది ఒక కళ. కలపడంలో మెళకువలు తెలిస్తే కాక్టెయిల్ కింగ్ అనిపించుకోవచ్చు. నగరానికి చెందిన మిక్సాలజిస్ట్ చాపాయ్ ఆనంద్ అదే సాధించారు. తాజాగా ఢిల్లీ జరిగిన బ్రౌన్ఫోర్మన్ అమెరికన్ విస్కీ లెగసీ కాక్టైల్ ఛాలెంజ్ 2020 గెలుచుకున్నారు. భారతదేశపు బెస్ట్ మిక్సాలజిస్ట్ పురస్కారం కోసం నిర్వహించిన వేట ముగిసింది. నగరంలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న చపాయ్ ఆనంద్ ఈ పోటీలో విజేతగా నిలిచాడు. ఈ చాలెంజ్‌లో దేశవ్యాప్తంగా 250 మంది పాల్గొన్నారు. వీరిలో 8మంది ఫైనలిస్టులుగా ఎన్నికయ్యారు ఢిల్లీలోని ఏరో సిటీలో ఉన్న జెడబ్ల్యూ మారియట్ హోటల్ ప్లే గ్రౌండ్ బార్లో ఈ పోటీ నిర్వహించారు. దేశంలోని మరో ఏడుగురు ఫైనలిస్ట్స్‌తో పోటీ పడి చపాయ్ ఆనంద్ ఈ టైటిల్ దక్కించుకున్నారు. ముంబయికి చెందిన ఓమ్ చౌహాన్, ఈ పోటీలో ఏకైక మహిళ బెంగుళూర్‌కి చెందిన ఆరతీ మెర్సీ వీరిద్దరూ ఫస్ట్, సెకండ్ రన్నరప్ టైటిల్స్ అందుకున్నారు. ది డార్క్ సోల్, ది చాంటిక్ జాక్, ది మానికర్స్ వంటి కాక్‌టైల్స్‌ను ప్రదర్శించి ఆనంద్ ప్రశంసలు పొందాడు. ‘‘నా అవార్డ్‌ని నా కో కాంటెస్టెంట్స్ అందరికీ అంకితం చేస్తున్నా. ఆహారం వృథా చేయడానికి నేను వ్యతిరేకిని. బైకర్‌గా ట్రెక్స్, రైడ్స్‌కి వెళ్లినప్పుడు కొన్ని సార్లు ఏ రకమైన ఆహారం దొరకని చోట ఇరుక్కుపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అందుకే ఫుడ్ వేస్ట్ లేని ముడిదినుసులనే నా కాక్టైల్ మేకింగ్‌లో వినియోగించానని చెప్పాడు ఆనంద్. ఈ టైటిల్ విజయాలకు సంబంధించి అమెరికా తదితర దేశాల్లోని ప్రసిద్ధ డిస్టలరీలు సందర్శించడం, విస్కీ మేకింగ్ మెళకువలను నేర్చుకోవడం వంటివి ఆనంద్ అందుకోనున్నాడు. -
మన బిర్యానీకి ప్రపంచమే ఫిదా
న్యూఢిల్లీ : భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో తయారు చేసుకోనో లేదా ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్ చేసుకొనో లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆన్లైన్ బుకింగ్‌లో చికెన్ బిర్యానీది ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసే.ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు.. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్‌మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది. పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్లు సర్వే తెలిపింది.ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయులు ఉండడం వల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది. -
ఆ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు
భారతదేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. అయితే.. ఆ రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి, చివరకు బిస్మిల్లా బాత్ కూడా ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తుండటం మనం చూశాం. కానీ ఏకంగా మాంసాహారాన్ని ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తారా.? అంటే ఇలాంటి కొన్ని వింతలు కూడా ఉంటాయన్నది సత్యం. కానీ.. మునియాండి స్వామి ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉండటం గమనార్హం. Tamil Nadu: Biryani is served as 'prasad' at Muniyandi Swami temple in Vadakkampatti, Madurai. A devotee says,'I come here every yr,we're celebrating this festival for last 84 yrs.Around 1000 kg rice,250 goats&300 chickens are used to make biryani, we use public donations for it' pic.twitter.com/6ZYEIlKZkt — ANI (@ANI) January 26, 2019 -
భళారే.. బిర్యానీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడే ఆహారంగా బిర్యానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అదే సమయంలో భారతీయుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వెలుగుచూశాయి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఆహారం తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ స్విగ్గీ తాజాగా జరిపిన సర్వేలో తేలింది. స్టాట్‘ఈట్’స్టిక్స్ పేరిట స్విగ్గీ ఏటా నిర్వహించే సర్వేలో ఈసారి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 530కి పైగా స్విగ్గీ డెలివరీ కేంద్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో సేవలందిస్తోంది. ఆన్లైన్ ఆహార సరఫరా మార్కెట్లో 50 శాతంపైగా వాటాతో స్విగ్గీ మొదటి స్థానంలో ఉండగా, 26 శాతం వాటాతో జొమాటో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని ఫుడ్‌పాండా, ఫాసోస్, బాక్స్ 8 వంటి యాప్స్ పంచుకుంటున్నాయి. మార్కెట్లో 35,056 రకాల బిర్యానీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,056 రకాల బిర్యానీలను సరఫరా చేస్తున్న స్విగ్గీ.. బోన్‌లెస్ చికెన్ బిర్యానీ, చికన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలకే అత్యధికంగా డిమాండ్ ఉందని తేల్చింది. ముంబైలో ‘చాల్ థానో తావా బిర్యానీ’ అతి తక్కువ ధర రూ.19కే లభిస్తుంటే.. పూణేలో లభించే ‘చికెన్ సజక్ తప్’ బిర్యానీ రూ.1,500లతో అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అంతేకాదు.. ప్రతీ నిమిషానికి 95 మంది బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారంటే దీనిపై భారతీయులకు ఉన్న మోజును అర్థంచేసుకోవచ్చు. నాన్‌వెజ్‌లో చికెన్ బిర్యానీ మొదటిస్థానంలో ఉండగా, శాఖాహారంలో మసాలా దోశ, పన్నీర్ బట్టర్ మసాలాకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆరోగ్యమూ ముఖ్యమే.. ఈ ఏడాది భోజన ప్రియులు ఆరోగ్యకరమైన ఆహారం వైపు అత్యధికంగా మొగ్గు చూపుతున్నట్లు స్విగ్గీ సర్వేలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే కేలరీలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఫుడ్‌కి ఆర్డర్లు మూడు రెట్లు పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఆహార ఆర్డర్లు 306 శాతం పెరిగి 3.15 లక్షలకు చేరాయి. కీటో బ్రౌనీస్, కీటో ఫ్రెండ్లీ టస్కాన్ చికెన్, హెల్దీ రెడ్ రైస్ పోహా వంటి వాటిని అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. ఇంటి వద్ద తయారుచేసే ఆహారానికీ ఆదరణ పెరుగుతోందట. ఈ ఏడాది పప్పు–బియ్యంతో తయారు చేసే కిచిడీ ఆర్డర్లలో 128 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇదే సమయంలో రాజ్మా చావల్, పెరుగు అన్నం వంటి వాటికి కూడా డిమాండ్ బాగుంది. దూసుకుపోతున్న గులాబ్‌జామ్ ఇక తీపి పదార్థాలు, శీతల పానీయాల విషయానికి వస్తే.. అత్యధిక ఆర్డర్లతో గులాబ్‌జామ్ దూసుకుపోతోంది. ఈ ఏడాది పది నెలల కాలంలో 17.69 లక్షల మంది గులాబ్‌జామ్ కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత 11.94 లక్షల ఆర్డర్లతో ఫలూదా రెండో స్థానంలో నిలిచింది. శీతల పానీయాల్లో ఫలూదాకు ఒక్కసారిగా ఈ స్థాయిలో డిమాండ్ పెరగడంపై స్విగ్గీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కేకుల్లో బ్లాక్ ఫారెస్ట్ 3 లక్షల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచింది. డెత్ బై చాక్లెట్, టెండర్ కోకోనట్ ఐస్‌క్రీం, తిరమిసూ ఐస్‌క్రీం, కేసరి హల్వాలను కూడా అత్యధికంగా ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒకేరోజు అత్యధిక ఆర్డర్లు ఇవ్వడం ద్వారా భోజన ప్రియులు ఈ ఏడాది ప్రత్యేకంగా కొత్త జాతీయ ఆహార తేదీలను కూడా ప్రకటించుకున్నారట. ఫిబ్రవరి 17 జాతీయ గులాబ్‌జామ్ డే, మే 12 కాఫీ డే, జూన్ 16 ఫ్రెంచ్ ఫ్రైస్, సెప్టెంబర్ 22 పిజ్జా, అక్టోబర్ 20 బిర్యానీ, టీ డేలుగా ప్రకటించుకోవడం గమనార్హం. -
ఈ పేరు వింటే లొట్టలు వేస్తుంటారు
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): మండీ.. ఈ పేరు వింటేనే నగరవాసులు లొట్టలు వేస్తుంటారు. ఈ వంటకం సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. పాతబస్తీ కేంద్రంగా విస్తరించిన క్రేజ్.. ఇటీవలి కాలంలో మరింత పుంజుకుంది. మటన్‌లో సహజసిద్ధంగా ఉత్పతన్నమయ్యే ద్రవాలు లేదా జ్యూసెస్తోటే బిర్యానీ రైస్ అన్నం ఉడకడం ద్వారా దీనికో ప్రత్యేకమైన రుచి, పరిమళం అబ్బుతుంది. అందుకే దీని రుచి చూసినవారు ఆ రుచిని ఇక దేనితోనూ పోల్చలేరు. ఒకేసారి కనీసం ఇద్దరు నుంచి అరడజను మంది దాకా తినేందుకు అవకాశం ఉండడం దీనిలో మరో విశేషం. మటన్, చికెన్, ఫిష్ మూడు వెరైటీల్లోనూ మండీ సర్వ్ చేస్తున్నారు. నవతరానికి కూడా బాగా దగ్గరైన ఈ వంటకం... ఓల్డ్‌సిటీలోని బార్కస్‌లో పుట్టి... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాలన్నింట్లోని రెస్టారెంట్లు దీనికి ప్రత్యేకంగా మెనూలో స్థానం కల్పించక తప్పని పరిస్థితి తెచ్చింది. ఇక పూర్తిగా మండీ పేరు మీదే ఏర్పాటవుతున్న రెస్టారెంట్లు, కేఫ్‌లకు కూడా నగరంలో కొదవలేదు. దీని ధర రూ.250 నుంచి రూ.600 దాకా ఉంటుంది. కొన్ని చోట్ల వెరైటీని బట్టి ఇంకా ఎక్కువ కూడా చెల్లించాలి. మండీకి పేరొందిన కొన్ని రెస్టారెంట్లు: గచ్చిబౌలి, మాదాపూర్‌లోని ఎమ్ఎమ్ ట్రీ, ఫైవ్ 6, మండీ ఎట్ 36, హిమాయత్‌నగర్‌లో మండిలీషియస్. -
చికెన్ బిర్యానీలో బల్లి...రెస్టారెంట్ సీజ్
-
బిర్యానీలో బల్లి.. ఇద్దరికి అస్వస్థత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీలో బల్లి రావడం కలకలం రేపుతోంది. రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వలనే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ సంఘటన నగరంలోని టీచర్స్ కాలనీలోని ఓ రెస్టారెంట్లో శుక్రవారం చోటుచేసుకుంది. బల్లి పడిన చికెన్ బిర్యానీ తిని ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. బిర్యానీ తిన్న వారు వాంతులు చేసుకోవడంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్ బిర్యానీని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు బల్లి పడిన బిర్యానీ వడ్డించిన రెస్టారెంటుని పరిశీలించారు. రెస్టారెంట్‌లోని వంటశాల తనిఖీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్ధాలను తయారీ చేస్తున్నట్లు నిర్ధారించారు. అధికారులు ఆహార పదార్ధాల శాంపిళ్లను సేకరించి, రెస్టారెంట్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. -
బిర్యానీకి ఫిదా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ ఇలా మెట్రో నగరం ఏదైనా లక్షలాది మంది నగరవాసులు చికెన్ బిర్యానీపైనే మనసు పారేసుకుంటున్నారట. లంచ్.. డిన్నర్.. లేట్‌నైట్.. ఇలా సమయం ఏదైనా వేడివేడి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసేందుకే మౌస్‌ను క్లిక్ మనిపిస్తున్నారట. ఆహార ప్రియులు చికెన్ బిర్యానీకే ఓటేస్తుండటంతో ఆర్డర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగి ఈ వంటకం నంబర్ వన్ స్థానంలో నిలిచిందట. మసాలా దోశ, బటర్ నాన్, తందూరీ రోటీ, పన్నీర్ బటర్ మసాలా ఐటమ్స్ ఆ తర్వాత నాలుగు స్థానాలు దక్కించుకున్నాయట. ఇక పిజ్జా, బర్గర్, చికెన్, కేక్, మోమోస్‌కు కూడా ఆర్డర్లు పెరుగుతున్నాయట. 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 9 మధ్య ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థకు అందిన ఆర్డర్లపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థ ప్రధానంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో తమ సంస్థకు అందుతున్న ఫుడ్ ఆర్డర్లపై ఈ సర్వేను నిర్వహించింది. ఈ వంటకాలకు భలే గిరాకీ.. ముంబై: చికెన్ బిర్యానీకే ముంబై నగరవాసులు మొగ్గు చూపుతుండటం విశేషం. ఆ తర్వాత పావ్‌భాజీని ఇష్టపడుతున్నారు. రోస్టెడ్ చికెన్ సబ్, చికెన్ మోమోస్‌కు గిరాకీ బాగుంది. ప్రధానంగా బాంద్రా వెస్ట్, పోవాయ్, అంధేరీ వెస్ట్ నుంచి ఫుడ్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ, గుర్గావ్: ధాల్ మకానీ, నాన్, బటర్ చికెన్లకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఆ తర్వాత పాస్తాకు గిరాకీ బాగుంది. జనక్‌పురి, గ్రేటర్ కైలాశ్, ద్వారక, పాలమ్ విహార్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్: బిర్యానీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రధానంగా 20 రకాల బిర్యానీ రుచులను గ్రేటర్ నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత చికెన్ 65ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జూన్, అక్టోబర్ నెలల్లో స్విగ్గీకి ఫుడ్ ఆర్డర్ల సంఖ్య పెరిగింది. మాదాపూర్, బంజారాహిల్స్, కొండాపూర్ నుంచి అధికంగా ఆర్డర్లు వస్తున్నాయి. బెంగళూరు: చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపప్స్, మంచోసూప్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. కోల్‌కతా: బిర్యానీ, ఫ్రైడ్‌రైస్, కచోరిలకు ఆర్డర్లు బాగున్నాయి. చెన్నై: పొంగల్, బిర్యానీ, చికెన్ లాలీపప్స్కు గిరాకీ బాగుంది. పుణే: దాల్ కిచిడి, బిర్యానీ, మ్యాంగో, స్ట్రాబెర్రీ, చాక్లెట్ షేక్స్‌కు గిరాకీ ఎక్కువ. ఏ సమయంలో ఏ వంటకం తింటున్నారంటే.. బ్రేక్‌ఫాస్ట్: మసాలా దోశ, ఇడ్లీ, వడ అగ్రస్థానంలో ఉన్నాయి. ఉదయం 9.30 గంటలకు ఆర్డర్లు బాగున్నాయి. లంచ్, డిన్నర్: చికెన్ బిర్యానీ, ఆ తర్వాత మటన్, వెజ్ బిర్యానీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటలకు.. రాత్రి 8.58 గంటలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. స్నాక్స్: పావ్‌భాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, చికెన్ రోల్, చికెన్ బర్గర్, భేల్పూరికి ఆర్డర్లు బాగున్నాయి. సాయంత్రం 5.03 గంటలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. లేట్ నైట్: చికెన్ బిర్యానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, బటర్ చికెన్, న్యూటెల్లా బ్రౌనీ ముందున్నాయి. లేట్ నైట్ ఆర్డర్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి. మెట్రో సిటిజన్లు ఇష్టపడుతున్న స్వీట్లివే.. గులాబ్ జామూన్, డబుల్ కా మీటా, రస్మలాయ్, టెండర్ కోకోనట్ ఐస్‌క్రీమ్‌లు. -
సార్లకు చికెన్ బిర్యానీ.. పిల్లలకు నీళ్లచారు
సాక్షి, నర్సాపూర్ : ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తప్పుదారి పడుతున్నారు. ఇందుకు తాము పని చేస్తున్న పాఠశాలనే అడ్డాగా చేసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు నీళ్ల చారు వడ్డిస్తూ.. తాము మాత్రం చికెన్ బిర్యానీ వండుకు తింటున్న విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో, అదే పథకానికి చెందిన బియ్యంతో వారానికి రెండు సార్లు చికెన్ బిర్యానీ వండించుకుంటున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడు మద్యం సేవిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం విద్యా కమిటీ చైర్మన్ పద్మారావు పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులకు నీళ్ల చారు వడ్డించిన విషయం బయటపడింది. ఉపాధ్యాయుల కోసం బిర్యానీ తయారు చేసేందుకు మసాలా కలిపి సిద్ధం చేసిన చికెన్ ముక్కలు, బియ్యం ఉడికించేందుకు పెట్టిన ఎసరు కూడా కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పాఠశాలలోని ఒక గదిలో ఖాళీ బీరు సీసాలు లభించడంతో వారు మద్యం కూడా తాగుతున్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. పాఠశాలకు ప్రహరీ లేనందున రాత్రి పూట మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడవేసిన బీరు సీసాలను మధ్యాహ్న భోజనం వండి పెట్టె మహిళ తెచ్చుకుని ఒక గదిలో దాచి పెట్టిందని ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ చెబుతున్నారు. బిర్యానీ వండించిన సంగతి తనకు తెలియదని అంటున్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. చర్యలకు డిమాండ్ పాఠశాలలో పర్యవేక్షణ సరిగా లేనందునే పలువురు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ పద్మారావు ఆరోపించారు. వారు మధ్యాహ్న భోజన బియ్యంతో బిర్యానీ వండించుకోవడంతోపాటు, తరగతి గదులలో మద్యం సేవిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అధికారులను కోరారు. -
చికెన్‌కు సిటీజనులు ఫిదా
చికెన్‌కు సిటీజనులు ఫిదా టేస్టీ చికెన్ సిటీజనులను మైమరిపిస్తోంది. వెరైటీ రుచులు ఆహా అనిపిస్తున్నాయి. సిటీ ఫుడ్ లవర్స్ చికెన్‌కు ఫిదా అయిపోయారు. ఎంతగా అంటే... దేశంలోనే చికెన్ ఆర్డర్లలో నగరం నంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేశారు. ఆన్లైన్ చికెన్ ఆర్డర్లలో సిటీ ప్రథమ స్థానంలో ఉన్నట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ సర్వేలో వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో బెంగళూర్, ఢిల్లీ, కోల్‌కతా, పుణె నిలిచాయి. పోషక విలువలు, ప్రొటీన్స్ అధికంగా ఉండడం... అన్ని వర్గాల వారికీ ధరలు అందుబాటులో ఉండడంతోనే చికెన్ వంటకాలకు గిరాకీ పెరుగుతోందని ఈ సర్వేలో తేలింది. ఏనీటైమ్ బిర్యానీ.. సాధారణంగా లంచ్, డిన్నర్ టైమ్‌లోనే చాలామంది బిర్యానీకి ఆర్డర్ చేయడం పరిపాటి. కానీ సిటీజనులు మాత్రం ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ టైమ్‌లోనూ చికెన్ బిర్యానీని లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోందని సర్వేలో వెల్లడైంది. వీకెండ్లో చికెన్ జోష్.. ఇక వారంరోజులపాటు వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపకాలు, వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సిటీజన్లు వారాంతాల్లో చికెన్ వంటకాలతో పసందు చేసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఆదివారం రాత్రి డిన్నర్ టైమ్‌లో మూడు బిర్యానీలు..ఆరు కబాబ్స్ అన్న చందంగా స్విగ్గీ సంస్థకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడించింది. మ్యాచ్‌లతో కొక్కొరోకో... ఇక ఐపీఎల్, ఐసీసీ టెస్ట్, వన్డే మ్యాచ్‌లున్న రోజుల్లోనూ చికెన్ వంటకాల ఆర్డర్లు బంపర్‌గా వచ్చిపడుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో ఈ అర్డర్లుంటున్నాయట. ఇక సాధారణ రోజుల్లోనూ ఆర్డర్లున్నా.. మ్యాచ్‌ల సందర్భంగా ఫుల్ గిరాకీ రావడంపై ఈ సంస్థ హర్షం ప్రకటించడం విశేషం. పూటకో వెరైటీ.. చికెన్ ఉషోదయం: సిటీజనులు బ్రేక్‌ఫాస్ట్‌లోనూ చికెన్ వెరైటీలనే ఇష్టపడుతున్నారట. ప్రధానంగా చికెన్ శాండ్విచ్, చికెన్ బర్గర్, చికెన్ బిర్యానీలకే బ్రేక్ఫాస్ట్టైమ్లో ఆరగించేందుకు మక్కువ చూపుతుండడం విశేషం. లంచ్: ► లంచ్‌లో ఇష్టపడుతున్న చికెన్ వంటకాల్లో చికెన్ బిర్యానీ, ఫ్రైడ్‌రైస్, తందూరీ చికెన్, చికెన్ లాలీపప్, చికెన్ సబ్, చికెన్ 65 ఆరగిస్తున్నారు. స్నాక్స్: ► బిర్యానీ, బర్గర్స్తో పాటు చికెన్‌రోల్, చికెన్మోమో, చికెన్షావర్మ. డిన్నర్: ► చిల్లీ చికెన్, చికెన్‌టిక్కా,గ్రిల్డ్ చికెన్, చికెన్‌రోల్, చికెన్ బిర్యానీ. ఇక డిన్నర్ సమయంలో 8:47 గంటలకే స్విగ్గీకి చికెన్ బిర్యానీల ఆర్డర్లు అధికంగా ఉంటున్నాయట. పోషక విలువలున్న చికెన్ వెరైటీలివే: మానవ జీవక్రియలకు అవసరమైన ఆవశ్యక పోషకవిలువలు, ప్రొటీన్స్ అధికంగా ఉన్న చికెన్ వంటకాల్లో రోస్టెడ్చికెన్ సలాడ్, చికెన్ టిక్కా సలాడ్, తందూరీ చికెన్ శాండ్విచ్ (మల్టీగ్రెయిన్)లున్నాయట. గ్రేటర్లో నాన్‌వెజ్ అమ్మకాలు ♦ గ్రేటర్ జనాభా: కోటి ♦ రోజువారీ మాంసం అమ్మకాలు: 8.66 లక్షల కిలోలు ♦ ఇందులో చికెన్ విక్రయాలు: 6.66 లక్షలు ♦ మటన్, బీఫ్ అమ్మకాలు: లక్ష కిలోలు ♦ చేపలు, సముద్ర ఉత్పత్తుల అమ్మకాలు: లక్ష కిలోలు -
జైళ్లలో చికెన్ బిర్యానీ!
అధునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జైలు పేరు చెబితే ఠక్కున గుర్తుకొచ్చేది చిప్పకూడు! కానీ ఇకపై చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్‌రైస్ సహా అన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ జైలు క్యాంటిన్లో ఖైదీలకు అందుబాటులోకి రాబోతున్నాయి. బయట హోటల్ మాదిరిగా డబ్బులు చెల్లిస్తే చాలు.. ఉదయం ఇడ్లీ, దోశ, పూరి, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఇష్టమైన చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్.. వగైరా లాగించేయొచ్చు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల డీజీ వీకే సింగ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఎందుకంటే... మంచి భోజనం కోసం ఖైదీలు, రిమాండ్ ఖైదీలు అల్లాడిపోతున్నారు. జైలు కూడు తినలేక పస్తులుంటూ ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే నచ్చిన తిండి కోసం జైలు సిబ్బందికి వేలకు వేలు లంచాలిచ్చి బయట్నుంచి చాటుమాటుగా తెప్పించుకుని తింటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు జైళ్ల శాఖ డీజీ జైళ్లలో అదునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఖైదీలు ఇష్టమైన తిండి కోసం జైలు సిబ్బందికి లంచాలిచ్చే పద్ధతికి స్వస్తి పలకొచ్చని ఆయన భావిస్తున్నారు. దీనికితోడు క్యాంటీన్ల ద్వారా వచ్చే ఆదాయంతో జైళ్లను ఆర్థికంగా బలోపేతం చేయొచ్చని భావిస్తున్నారు. ఒక్కో ఐటమ్కు ఒక్కో రేటు! క్యాంటీన్లో ఆహార పదార్థాలకు ఒక్కో ఐటమ్కు ఒక్కో ధర నిర్ణయిస్తారు. ఆహార పదార్థాలకయ్యే ఖర్చు, క్యాంటీన్ నిర్వహణ ఖర్చులపై 20 శాతం లాభం వేసుకొని ఈ ధరలు నిర్ణయించాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చిన ఆదాయాన్ని జైళ్ల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. జైలు క్యాంటీన్లో ఇష్టమైన ఆహారం తినే సదుపాయం విదేశాల్లో ఎప్పట్నుంచో అమలవుతోంది. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగరం జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఖైదీల నుంచి అనూహ్య స్పందన రావడంతో త్వరలో పూర్తిస్థాయిలో అధునాతన క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు జైలు సూపరింటెండెంట్ శివకుమార్ సిద్ధమవుతున్నారు. ఖైదీల సంక్షేమం కోసమే: శివకుమార్, జైలు సూపరింటెండెంట్, కరీంనగర్ జైళ్లశాఖ డీజీ ఆదేశాల మేరకు జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా చికెన్, ఎగ్‌తో చేసిన ఆహార పదార్థాలను ఖైదీలకు అందించాం. ఎగ్‌ఫ్రైడ్ రైస్, ఎగ్కర్రీల ధర రూ.40. ఖైదీల నుంచి మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయిలో మెనూలోని ఆహార పదార్థాలన్నీ అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. క్యాంటీన్ నిర్వహణను ఐదుగురు ఖైదీలకు కేటాయించాం. ఇదీ జైలు క్యాంటీన్ మెనూ ఉదయం: ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఉప్మా సాయంత్రం: చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్‌రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్‌బోండా, చపాతీ. -
కృతుంగ...తెలుగింటి వంట
హైదరాబాదీల దిల్ పసంద్ పాయా చూడగానే జుర్రేయాలనిపిస్తుంది. మారుమిల్లి వెదురు బొంగు చికెన్... మాటల్లేవ్! టేస్ట్ చేయాల్సిందేనని తొందరపెడుతుంది. రాగి సంకటి ముద్ద, దాని మీద ఓ నేతి చుక్క... నంజుకోవడానికి నాటు కోడి కూర సీమ వాసులని నోరూరిస్తోంది. పల్నాడు, నైజాం కోడి బిర్యానీ, చెన్నూరు మాంసం పలావ్... ఇలా అచ్చంగా మనవైన వంటలు.. సజ్జరొట్టె, జొన్న రొట్టె, కొర్రన్నం... అన్నీ మన ఊరి వంటలు. ఇవన్నీ ఒకే చోట లాగించేయాలంటే... నగరంలోని కృతుంగ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే... జంక్ ఫుడ్స్మయం అయిన మహానగరంలో అచ్చమైన తెలుగు రుచులు కనుమరుగయ్యే పరిస్థితిని గమనించి... 2002లో సీటీఓ లింగారెడ్డి ఓ చిన్న ప్రయత్నం చేశారు. అదే ‘కృతుంగ’ రెస్టారెంట్. ఆ తర్వాత నరేందర్‌రెడ్డి... ఆ చిన్న ప్రయత్నానికి సంకల్పాన్ని, దిశను నిర్దేశిస్తూ ఎన్నో రెస్టారెంట్లుగా విస్తరింపచేశారు. నగరవాసులకు తెలుగింటి రుచులను అందిస్తూ... వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది ఇప్పుడు కృతుంగ. చిన్న అవుట్‌లెట్‌గా ప్రారంభమై నేడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 13 బ్రాంచీలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీలకు కేరాఫ్... జూనియర్ ఎన్టీఆర్, రోజా, అలీ, సుమా, ఎస్వీ కృష్ణారెడ్డి, అనూప్ రూబెన్స్, అక్కినేని, కృష్ణంరాజు ఫ్యామిలీస్, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు... ఇలా అనేక మంది ప్రముఖులు, సామాన్యులు ఇష్టపడే ఫుడ్ పాయింట్ ఇది. 2002లో పంజాగుట్టలో ప్రారంభమైన కృతుంగా... తన బ్రాంచీలు విస్తరిస్తూ జూబ్లీహిల్స్, ఎర్రమంజిల్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మణికొండ, కూకట్పల్లి, కొండాపూర్, జూబ్లీహిల్స్... ఇలా సిటీలోని అన్ని ప్రధాన సెంటర్లకూ విస్తరించింది. రుచికరమైన ఆహారానికి నాణ్యమైన దినుసులు ఎంతో ముఖ్యం. వంట సరుకులన్నీ సొంతంగా పండించిన వాటి నుంచి తెప్పించి ఇక్కడ వండి వారుస్తున్నారు. ఎండు మాంసం కర్రీస్ జూబ్లిహిల్స్ బ్రాంచ్ స్పెషల్. ఇది నగరంలో మరెక్కడా దొరకదు. ఆహారంతో ఆరోగ్యాన్ని బలి చేస్తున్న ఈ రోజుల్లో... జంక్ ఫుడ్ బదులు కాల్షియంతో కూడిన ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలనేదే మా ఉద్దేశం. రాగి, జొన్న, నూనె తక్కువగా ఉండే వెరైటీలు, మట్టి కుండలో వంటలు... ఇలా అన్నీ మన ప్రాంతాల్లో చేసుకునే వంటలే. 1000కు పైగా ఉద్యోగులు మా రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. వీళ్లందరినీ వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి, ఇక్కడి పనుల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. పసుపు నుంచి రాగుల వరకూ స్వయంగా పండించినవే ఇక్కడ వాడతాం. ఇలా పదిమందికి ఉపాధి, మంచి ఆహారం అందించడమే మా లక్ష్యం’ అంటారు కృతుంగా రెస్టారెంట్స్ ఎండీ టి.నరేందర్‌రెడ్డి. ఇటీవలే బెంగళూరులోని జయ్ నగర్లో 3వ బ్రాంచి ప్రారంభించారు. మున్ముందు బెంగళూరులో 6, పుణే, చెన్నయ్ సహా సౌత్ ఇండియాలో మరో 20 బ్రాంచీలు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. వీటితో పాటు అమెరికాలోనూ ప్రారంభిస్తామన్నారు. ఫుట్‌బాల్ వంటి అనేక ఆటల పోటీలు, ఈవెంట్లు, సెలబ్రిటీల ఫంక్షన్లకు ఇక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్స్ వెళ్తుంటాయి. 2009లో కింగ్‌ఫిషర్ నిర్వహించిన వంటల పోటీలో బెస్ట్ ఫుడ్ అవార్డు, 2008లో ఫోర్బ్ జాబితాలో రాష్ట్రంలో టాప్ బెస్ట్ రెస్టారెంట్‌గా గుర్తింపు సంపాదించుకుని ప్రత్యేకతను చాటుకుంది ‘కృతుంగ’. kritunga@gmail.com ph: 9000633918 - ఓ మధు