ఫుడ్ అన్నింటిలోనూ బిర్యానీకి క్రేజే వేరు. స్నాక్స్, స్టాటర్స్ అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడి తినేది బిర్యానీనే.. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు చెప్పండి. వారానికి ఒకసారి అయినా బిర్యానీ నోట్లో పడాల్సిందే. అంతలా ఇష్టపడుతుంటారు. దేశంలో బిర్యానీ ప్రియుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచికి, ఆదరణకు తగినట్లుగా సరికొత్త పద్ధతి రుచుల్లో ఫుడ్ అందుబాటులోకి వస్తున్నాయి.
అయితే ఏ హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ ధర ఎంత కాదన్న 200 ఉంటుంది. రెస్టారెంట్, టేస్ట్‌ను బట్టి ఇంక ధర ఎక్కువ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైనా బిర్యానీని రూ.59 రూపాయలకే రుచి చూశారా?.. వినడానికి ఆశ్యర్యంగా ఉంది కదూ!.. కానీ ఓ హోటల్ వాళ్లు నిజంగానే 59 రూపాయలకు బిర్యానీని అందిస్తున్నారు. ఈ బిర్యానీ పాయింట్ ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే.
‘కాకా 55’ బిర్యానీ పాయింట్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ లభిస్తోంది. దమ్ బిర్యానీ 59 రూపాయలు ఉండగా.. ఇద్దరు తినాలనుకుంటే 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక ఫ్రై బిర్యానీ కూడా రూ. 70కే దొరుకుతుంది. వీరికి హైదరాబాద్‌లో 3 ఔట్‌లెట్స్ ఉన్నాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయం, కూకట్‌పల్లి సెకండ్ ఫేజ్, మూడో ఫేజ్ దగ్గర ఉన్నాయి. ఒక్కో హోటల్ వద్ద రోజూ 250 ప్లేట్స్ వరకూ సేల్స్ చేస్తున్నారు.
ఆర్డర్లపై కూడా బిర్యానీ తయారు చేసి అందిస్తారు. ఏ పార్టీ ఉన్నా ఒక రోజు ముందు చెప్తే నోరూరించే బిర్యానీ ఆర్డర్ మనముందు ఉంచుతారు. కాస్ట్ తక్కువ ఉన్నా.. రుచి సూపర్గా ఉంటుందని అక్కడ తిన్నవారు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకు బిర్యానీ లభించడం హైదరాబాద్లోనే ఫస్ట్ టైం. మరి మీరూ కూడ టేస్ట్ చేయాలనుకుంటే కాకా 55 బిర్యానీ వద్దకు వెళ్లాల్సిందే.. వీళ్లకు స్విగ్గీ జొమాటలో కూడా సదుపాయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment