సాక్షి, చెన్నై : దక్షిణ భారత్‌లో బిర్యానీ ప్రియులు అధికంగా ఉంటారు. చికెన్, మటన్ బిర్యానీ అంటే లొట్టలేసుకొని తినేవారు చాలా మంది ఉంటారు. బిర్యానీకి ఉన్న ఈ క్రేజ్‌తో చాలామంది వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు, యాభై రూపాయలు, పదిరూపాలయకే బిర్యానీ అంటూ ఇప్పటివరకు రకరకాల ఆఫర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా 10 పైసలకు బిర్యానీ దొరుకుతుంది.
ఈ రోజు(అక్టోబర్ 11) బిర్యానీ డే. ఈ సందర్భంగా తమిళనాడు బిర్యానీ వ్యాపారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. తిరుచ్చి, మధురై, దింగిగల్, చెన్నైలలో 10 పైసలకే బిర్యానీ అమ్మకాలు నిర్వహించారు. దీంతో భారీగా జనం ఎగబడ్డారు. కిలో మీటర్ల మేర బారులు తీశారు. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా బిర్యానీ కోసం స్థానికులు క్యూకట్టారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే బెంగళూరులో ఓ ప్రముఖ రెస్టారెంట్ భారీ ఆఫర్ ప్రటించింది. దీంతో ఉదయం 4 గంటల నుంచే బిర్యానీ కోసం జనం క్యూ కట్టారు. దాదాపు 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారుతీరుతారు. అక్కడ ప్రతి ఆదివారం ఇదే సీన్ కనిపిస్తుంది.కనీసం కరోనా నిబంధనలను కూడా వారు పాటించలేదని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment