చికెన్‌ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు: వీడియో వైరల్‌ | New York Police Arrested Man Set Fire Bangladeshi Restaurant | Sakshi
Sakshi News home page

Viral Video: చికెన్‌ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు

Published Wed, Oct 19 2022 11:38 AM | Last Updated on Thu, Oct 20 2022 12:20 PM

New York Police Arrested Man Set Fire Bangladeshi Restaurant - Sakshi

రెస్టారెంట్‌లో ఒక్కోసారి మనం ఏదైనా ఆర్డర్‌ చేస్తే సాంకేతిక సమస్య వల్లో లేక సిబ్బంది కన్ఫ్యూజ్‌ అవ్వడం వల్లో ఆర్డర్‌ క్యాన్సిల్‌ అవ్వడం లేదా సకాలంలో అందచేయలేకపోవడం జరుగుతుంది. ఇది సర్వసాధారణం. ఐతే ఇక్కడోక వ్యక్తి తన ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ రాలేదని చిర్రెత్తుకొచ్చి ఏకంగా రెస్టారెంట్‌కి నిప్పుపెట్టేశాడు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...బంగ్లాదేశ్‌ రెస్టారెంట్‌కి 49 ఏళ్ల చోఫెల్‌ నోర్బు అనే వ్యక్తి  వచ్చి చికెన్‌ బిర్యాని ఆర్డర్‌ చేశాడు. ఎందువల్లనో సిబ్బంది అతనికి సమయానికి తన ఆర్డర్‌ ఇవ్వలేదు. దీంతో కోపేద్రేకంతో రెస్టారెంట్ నుంచి బయటకొచ్చేశాడు. ఆ తర్వాత రోజు సదరు రెస్టారెంట్‌ వద్దకు వచ్చి మండించే ఒక విధమైన ద్రవాన్ని తీసుకువచ్చి ఆ రెస్టారెంట్‌ పార్క్‌ గార్డెన్‌పై వేసి నిప్పు పెట్టాడు.

ఐతే ఈ నిప్పు పెట్టే క్రమంలో అతనిపైకి కూడా మంటలు ఎగిసిపడ్డాయి. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు కావడంతో న్యూయార్క్‌ పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని న్యూయార్క్‌ అగ్నిమాపక సిబ్బంది సోషల్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 
 

(చదవండి: హిజాబ్‌ తొలగించి మరీ పోటీల్లో.. అరెస్ట్‌ కాదు ఆమెకు ఘన స్వాగతం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement