Tasty Indian Special Foods Prepared For ISRO Gaganyaan Mission Astronauts - Sakshi
Sakshi News home page

అంతరిక్షానికి తీసుకెళ్లే వంటకాలు ఇవే!

Published Fri, Feb 5 2021 6:08 PM | Last Updated on Fri, Feb 5 2021 7:29 PM

Meals Ready To Eat Food for Gaganyaan - Sakshi

మైసూరు: మనలో చాలా మందికి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ ఏమి తింటారు అనే ప్రశ్నలు సాధారణంగా వస్తుంటాయి. అయితే వారికోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఆహార పదార్దాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా గగన్‌యాన్ వ్యోమగాముల కోసం ఇస్రో ప్రత్యేకంగా వంటకాలను తయారు చేస్తుంది. ఈ వంటకాలను మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎఫ్ఆర్ఎల్) మీల్స్ రెడీ టు ఈట్‌ ప్యాకింగ్ ఫుడ్‌ను సిద్ధం చేసింది.(చదవండి: లీకైన ఎంఐ11 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ ధరలు)

ఆవకాయ పచ్చడి, చికెన్ బిర్యానీ, మూంగ్‌దాల్ హల్వా, దాల్ మక్ని, షాహి పన్నీర్, చికెన్ కోర్మా వంటి 40 ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసినట్లు ఒక డిఎఫ్ఆర్ఎల్ అధికారి తెలిపారు. అధికారి మాట్లాడుతూ... వ్యోమగాముల రుచి లేదా ఆహార ప్రాధాన్యతలు గురుంచి మాకు తెలియదు. ఎందుకంటే వారి ఇష్టానికి అనుగుణంగా కాకుండా ఇస్రో తెలిపిన మేరకు వీటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గగన్‌యాన్ కోసం ఎంపికైన 6గురు ఇచ్చిన జాబితాలో నుంచి ఆహార పదార్థాలను ఎంచుకోనున్నట్లు తెలిపారు. తర్వాత వారి అభిప్రాయం ఆధారంగా ఆహారం సర్దుబాటు చేయబడుతుంది అని అతను పేర్కొన్నారు. 

డిఎఫ్‌ఆర్‌ఎల్ శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను సిద్ద చేసి ప్యాక్ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది. అలాగే ఈ వంటకాలు తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు పాడవ్వకుండా ఉంటాయి. వండాల్సిన అవసరం లేని పౌచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. రోజూ సుమారు 2,500 కిలోల కేలరీలు శరీరానికి అందేలా మొత్తం డైట్ ప్లాన్ చేశారు. అలాగే ఆహారాన్ని వేడి చేయడం కోసం అంతరిక్షంలో ఉపయోగించగల ప్రత్యేక హీటర్ సిద్ధం చేసారు. వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement