
న్యూఢిల్లీ : భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో తయారు చేసుకోనో లేదా ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్ చేసుకొనో లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆన్‌లైన్ బుకింగ్‌లో చికెన్ బిర్యానీది ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసే.ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు.. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది.
ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్‌మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది. పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్లు సర్వే తెలిపింది.ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయులు ఉండడం వల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment