butter chicken
-
మన బిర్యానీకి ప్రపంచమే ఫిదా
న్యూఢిల్లీ : భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో తయారు చేసుకోనో లేదా ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్ చేసుకొనో లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆన్లైన్ బుకింగ్‌లో చికెన్ బిర్యానీది ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసే.ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు.. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్‌మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది. పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్లు సర్వే తెలిపింది.ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయులు ఉండడం వల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది. -
సింగిల్స్‌కోసం కోహ్లీ ఏం చేశాడంటే..?
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో ఒక్క జుట్టు, గడ్డం విషయంలో తప్ప ఫిట్‌నెస్‌లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించదు. అతడు ఎప్పుడూ చాలా యాక్టీవ్‌గా ఉంటూ ఫుల్ ఎనర్జిటిక్‌గా అదే పర్సనాలిటీతో దర్శనమిస్తుంటాడు. ఇందుకు ప్రధాన కారణం ఈ పరుగుల వీరుడు తాను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడంట. ఆట ఆడే సమయంలో సింగిల్స్ ఎక్కువగా తీయాలనే ఉద్దేశంతో అందుకు అడ్డుగా ఉన్న బటర్ చికెన్, మటన్ రోల్స్ మొత్తానికి వదిలేశాడంట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ క్రికెట్ నెక్స్ట్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం టీమిండియాలో ఉన్నత శిఖరం అధిరోహించడానికి ప్రతి విషయంలో విరాట్ నిబద్ధతే కారణం అని తెలిపారు. సాధారణంగా కోహ్లీ ఏవైనా సరే తాజాగా ఉండేవి మాత్రమే ఉపయోగిస్తాడని, ఇంటికొచ్చినప్పుడు ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలను ఇస్తే వాటికి నో అని చెప్పి ఇంట్లో పండ్లు ఉంటే వాటిని జ్యూస్‌గా తీసి ఇవ్వండని కోరతాడని చెప్పారు. అలాగే, కోహ్లీ అరటిపండ్లు బాగా తింటాడట. ప్రతి మ్యాచ్ ప్రారంభం సమయంలో కనీసం రెండు మూడు అరటిపండ్లు తింటాడని ఆయన చెప్పుకొచ్చారు. -
బిర్లా... బటర్ చికెన్ చిక్కు!
న్యూఢిల్లీ: రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగా ఉండాలని సామెత. ఇది వ్యాపారానికీ బాగా వర్తిస్తుంది. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న భారత కంపెనీలు ఆయా దేశాల పరిస్థితులకు తగ్గట్లుగా మారక తప్పడం లేదు. 36 దేశాల్లో 4,000 కోట్ల డాలర్ల బిర్లా గ్రూప్‌ను నడిపిస్తున్న కుమార మంగళం బిర్లా ఉదంతమే దీనికి నిదర్శనం. ఆయన మార్వాడీ కమ్యూనిటీకి చెందినవారు. మార్వాడీల జీవితాల్లో శాకాహారం ప్రధానమైన అంశం. అందుకే ఈ కంపెనీ క్యాంటీన్లలో, కంపెనీ కార్యక్రమాల్లో ఎక్కడా మాంసాహారం, వైన్, విస్కీల సరఫరా ఉండదు. ఇదంతా అంతర్జాతీయ విస్తరణకు ముందు మాత్రమే. ఈ గ్రూప్ 2003లో ఆస్ట్రేలియా లో చిన్న రాగి గనుల కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా కార్మికుల రోజువారీ జీవితాల్లో ఫోస్టర్ బీర్, బటర్ చికెన్ తప్పనిసరి. దీంతో ఆక్కడి బిర్లా క్యాంటీన్లలో ఈ రెండింటినీ సరఫరా చేయక తప్పలేదని బిర్లా పేర్కొన్నారు. రీ ఇమాజినింగ్ ఇండియా, అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏషియాస్ నెక్స్ట్ సూపర్ పవర్ అన్న పుస్తకంలో రాసిన వ్యాసంలో ఆయన ఈ ఉదంతం వెల్లడించారు.