![Hyderabadi Biryani Lover Asks KTR Where His Extra Masala is - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/29/ktr.jpg.webp?itok=PKWZltxW)
సాక్షి, హైదరాబాద్: ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు రోజూ ఎంతో మంది తమ సమస్యలపై విజ్ఞప్తులు చేస్తుంటారు. వీటిపై ఎప్పటికప్పుడు స్పందించే కేటీఆర్.. తన కార్యాలయ సిబ్బంది ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు శుక్రవారం ఓ చిత్రమైన విజ్ఞప్తి వచ్చింది.
తోటకూరి రఘుపతి అనే నెటిజన్ ‘‘జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీసులో ఎక్స్‌ట్రా మసాలా, లెగ్ పీస్‌తో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. కానీ నాకు ఏదీ రాలేదు. జొమాటో ప్రజలకు సేవ చేసేది ఇలాగేనా?’’అంటూ బిర్యానీ ఫోటో తీసి పెట్టిన పోస్టును కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘నన్ను ఎందుకు ట్యాగ్ చేశావు. నా నుంచి ఏం కోరుకుంటున్నావు’’అంటూ రిప్లై ఇచ్చారు. ఇది వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు వ్యంగ్యంగా, హాస్యభరితంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment