
సాక్షి, హైదరాబాద్: వంటల్లో రకారకాల కాంబినేషన్‌లు, ప్రయోగాలు చాలామందికి తెలుసు. దాదాపు చాలావరకు ఇలాంటి మిక్స్‌డ్ రెసిపీస్, వినూత్నమైన వంటకాలు బాగానే క్లిక్‌అవుతాయి. కానీ ఒక్కోసారి మాత్రం దారుణంగా బెడిసి కొడతాయి. తాజాగా గులాబ్ జామూన్ సమోసా వంటకం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. కమెంట్లు, లైక్‌లతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. (Salman Khan Birthday: జెనీలియా, సల్మాన్ డ్యాన్సింగ్ వీడియో వైరల్)
అభిషేక్ అనే ఫుడ్ బ్లాగర్ వెరైటీగా సమోసా విత్‌గులాబ్ జామూన్ ట్రైస్ చేశాడు. ఢిల్లీలోని రోడ్డు పక్కన తినుబండారాలు అమ్మే ఒక దుకాణం వద్ద గులాబ్ జామూన్ సమోసాను తయారు చేయించాడు. అయితే గులాబ్ జామూన్ సమోసా టేస్ట్ చేసిన అభిషేక్ ఫీలింగ్స్ చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుతున్నారు.‘‘కనీసం ట్రై కూడా చేయొద్దు.. అతని కోతి మొఖం చూస్తే అర్థం కావడం లేదా. దాని టేస్ట్ ఎలా ఉందో’’ అని ఒకరు, నీ కరేజ్‌కి హేట్సాఫ్ భయ్యా అని మరొకరు ‘‘చండాలంగా ఉంది’’ అని ఇంకో యూజర్ కమెంట్ చేశారు. గత వారం అప్‌లోడ్ చేసిన వీడియోకు వ్యూస్ ఇప్పటికే 2 మిలియన్లు దాటేసాయి.
Comments
Please login to add a commentAdd a comment