off dozen films
-
బాధేస్తే గులాబ్‌జామ్ తింటా!
ప్రస్తుతం అరడజను చిత్రాలు ఉన్నాయని అంటోంది సమంత. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సి వస్తోంది. ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతుంది. అలా బాధ వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను. వెంటనే ఆ బాధ తొలగిపోతుంది. గులాబ్‌జామ్ తింటే బాధ ఎలా పోతుందని మాత్రం అడగకండి అని అంటోంది చెన్నై చిన్నది. మానవుడు ఆశాజీవి. అభిరుచి జీవి కూడా. ఈ రెండూ జీవితంలో బాధల్ని మరపించేస్తాయి. నటి సమంతపైన చెప్పిన వాటిలో రెండవ దీనితో ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఏమిటీ అర్థం కాలేదా’సమంత చెబితే ఈజీగా అర్థం అవుతుందిలే. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల సరసన చేరిన లక్కీ నటి ఈ చెన్నై చిన్నది. ఏమాయ చే శావే అన్న ఒకే ఒక్క చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని గుల్ల చేసేసిన సమంత ఈ తరువాత కత్తి చిత్రంతో తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని దోచేసుకున్నారు. ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ క్రేజీ హీరోయిన్గా విరాజిల్లుతున్నారు. ప్రస్తుత తన స్థాయి గురించి ఈ చిరునవ్వుల ధరహాసిని ఏమంటున్నారో చూదాదం. ప్రస్తుతం నా చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. వీటిలో రెండు తమిళ చిత్రాలు, రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సివస్తోంది. ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులతో కలిసి గడపలేక పోతున్నాను. ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతోంది. నాకు ఇంటి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను. వెంటనే ఆ బాధ తొలగిపోతుంది.అయితే గులాబ్‌జామ్ తింటే ఇంటి జ్ఞాపకం ఎలా మరుగవుతుందన్నది మాత్రం అడగకండి. ఆ ప్రశ్నకు నా వద్ద బదులు లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో విజయ్‌కు జంటగా తెరి, సూర్య సరసన నటించిన 24 చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులోనూ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వీటన్నిటిలోనూ తన పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఇలా నటనకు అవకాశం ఉన్న విభిన్న పాత్రలు అమరడం నా అదృష్టం. త్వరలో నటుడు ధనుష్‌తో వడచెన్నై చిత్రంలో నటించనున్నాను. ఎక్కువ చిత్రాల్లో నటించడం వల్ల ఈ ఏడాది నాకు ప్రత్యేకమైందనే చెప్పాలి. నాకు దైవ కృప చాలా ఉంది. విరామం అన్నది లేకుండా నటిస్తూనే ఉండాలన్నది నా ఆశ. -
రెండు నెలల్లో సందడే సందడి!
ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా బెంగగా ఉంటుంది. ఇప్పుడు సమంత పరిస్థితి అదే. మొత్తం అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీటిలో తెలుగులో మూడు, తమిళంలో మూడు. ఆరు చిత్రాలకు తేదీలివ్వడం అంటే ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్‌కి దూరమైనట్లే. కానీ, పనిని ప్రేమించే సమంత అదేం పట్టించుకోకుండా హ్యాపీగా షూటింగ్‌లు చేస్తున్నారు. కానీ, ఇంటి మీద కాస్తంత బెంగగా ఉందట. ఆ బెంగ కొంచెం తగ్గాలంటే గులాబ్ జామ్ తింటానంటున్నారామె. బెంగకీ, గులాబ్ జామ్కీ లింకేంటి అనుకుంటున్నారా? ఏమో.. అవి తింటే సమంతకు బెంగ పోతుందట. ఆ సంగతలా ఉంచితే... ఏప్రిల్, మేలో సమంత బాగా సందడి చేయనున్నారు. ఎందుకంటే, ఆమె నటించిన నాలుగు సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదలవుతాయి. మహేశ్‌బాబు సరసన నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’, నితిన్ పక్కన చేస్తున్న ‘అ..ఆ’ వేసవికి విడుదలవుతాయి. అలాగే, తమిళంలో సూర్య సరసన నటిస్తున్న ‘24’, విజయ్‌కి జోడీగా యాక్ట్ చేస్తున్న ‘తెరి’ కూడా సమ్మర్‌కే రానున్నాయి. ఇలా రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలు విడుదల కావడం అంటే చిన్న విషయం కాదు. పైగా అన్నీ పెద్ద సినిమాలే. నాలుగు చిత్రాల్లోనూ సమంతవి ఒకదానికి ఒకటి పోలిక లేని విభిన్న తరహా పాత్రలు కావడం విశేషం. ఇవి కాకుండా సమంత చేతిలో ఉన్న ఇతర చిత్రాల విషయానికొస్తే... ఎన్టీఆర్ సరసన ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రుద్రాక్ష’ కమిట్ అయ్యారు. తమిళంలో ధనుష్‌తో ‘వడ చెన్నై’ చేస్తున్నారు. మొత్తానికి సమంత కెరీర్ ఫుల్ జోష్‌గా ఉందని చెప్పొచ్చు.