distress
-
కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఊరట
CMDRF Scam Pinarayi Vijayan: ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్ఎఫ్) దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ లోకాయుక్త సోమవారం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పినరయి విజయన్‌తో పాటు 18 మంది మాజీ కేబినెట్ మంత్రులపై వేసిన పిటిషన్‌ను లోకాయుక్త తిరస్కరించింది. బంధుప్రీతి లేదా అవినీతి జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని లోకాయుక్త జస్టిస్ సిరియాక్ జోసెఫ్, అప్ లోకాయుక్తలు జస్టిస్ హరూన్ అల్ రషీద్, జస్టిస్ బాబు మాథ్యూ పి జోసెఫ్‌లతో కూడిన లోకాయుక్త బెంచ్ పేర్కొంది. సీఎండీఆర్‌ఎఫ్‌లోని నిధులను దుర్వినియోగం చేశారంటూ 2018లో సీఎంతో పాలు పలువురు మంత్రులపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్సీపీ మాజీ చీఫ్ ఉజ్వూర్ విజయన్ కుటుంబానికి రూ.25 లక్షలు, దివంగత ఎమ్మెల్యే రామచంద్రన్ నాయర్ కుటుంబానికి రూ.9 లక్షలు, ప్రమాదంలో మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆరోపిస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు ఆర్ఎస్ శశికుమార్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సిరియాక్ జోసెఫ్, జస్టిస్ హరున్ ఉల్ రషీద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాజ్యాన్ని విచారించింది. అయితే సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో మార్చి 2023లో, ఈ కేసును పెద్ద బెంచ్‌కు రిఫర్ చేసింది. ఇది ఊహించిందే, హైకోర్టుకెళతా ఇది ఇలా ఉంటే తాజా నిర్ణయాన్ని కేరళ హైకోర్టులో సవాల్ చేస్తానని పిటిషన్ ఆర్ఎస్ శశికుమార్ తెలిపారు. తీర్పు ఊహించినదేనని, దీనికి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తానని చెప్పారు. లోకాయుక్తలో గతంలో రెండు వేలుండే కేసులు ఇపుడు 200కి తగ్గాయని పేర్కొన్నారు. ఈ సంస్థపై ప్రజలకు నమ్మకం పోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఆరోపించారు -
విమానంలో చిన్నారికి గుండెపోటు.. ప్రాణం పోసిన ఎయిమ్స్ డాక్టర్లు
న్యూఢిల్లీ: ప్రాణం పోయడంలో దేవుడి తర్వాత దేవుడిగా డాక్టర్లనే కొలుస్తూ ఉంటారు. ఈ మాటను నిజం చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోశారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడంతో అదే విమానంలో ఉన్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ నిర్వహించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ పయనమైన విస్తార విమానం UK -814లో రెండేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపటిలోనే పల్స్ ఆగిపోయింది. బిడ్డ చర్మం నీలిరంగులోకి మారిపోయి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లిస్తున్నట్లు సిబ్బంది అత్యవసర ప్రకటన చేసింది. విషయం తెలుసుకున్న అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై బాలికకు సీపీఆర్ నిర్వహించారు. విమానం నాగ్‌పూర్‌కు చేరేవరకు బిడ్డ ప్రాణాలను అదిమి పట్టుకున్నారు. ఎలాగోలా ఐవీ క్యానులాను అమర్చగలిగారు. బిడ్డ యధాతథంగా ఊపిరి తీసుకునేంతవరకు ఎయిమ్స్ డాక్టర్లు చాలా శ్రమించారు. చిన్నారిని నాగ్‌పూర్‌కు తరలించిన తర్వాత సర్జరీ నిర్వహించగా ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దమన్‌దీప్, డా.రిషబ్ జైన్, డా.ఒయిషికా, డా.అవిచల తక్షక్లను అభినందిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో వారికి అభినందనలు తెలుపుతూ చిన్నారితో సహా డాక్టర్ల ఫోటోలను షేర్ చేసింది. #Always available #AIIMSParivar While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM — AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023 ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య! -
కదల్లేని స్థితిలో మహిళ.. డోర్ పగలగొట్టి వెళ్లిన పోలీసులు షాక్..!
లండన్: ఓ మహిళ కుర్చీలో కూర్చొని టేబుల్‌పై తలెపెట్టి రెండు గంటలుగా అపస్మారక స్థితిలో ఉంది. రోడ్డుపై వెళ్లే ఓ వ్యక్తి ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమచారం అందించాడు. దీంతో హుటాహుటిన అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ మహిళను కాపాడేందుకు డోర్లు పగలగొట్టారు. దగ్గరకు వెళ్లి ఆమెను చూశాక షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె మహిళ కాదు.. ఓ కళాకారుడు చెక్కిన శిల్పం. అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఆ బొమ్మ అచ్చం నిజమైన మహిళ లాగానే ఉండటం చూసి నమ్మలేకపోయారు. పసుపు రంగు స్వెటర్, నల్ల రంగు ప్యాంటు వేసుకున్న ఈ బొమ్మను చూస్తే ఎవరైనా నిజంగా మహిళే అనుకుంటారు. లండన్ సోహోలోని లాజ్ ఎంపోరియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచిన ఈ శిల్పాన్ని అమెరికాకు చెందిన ఓ శిల్పి చెక్కాడు. ప్యాకింగ్ టేప్, ఫోమ్‌ను ఉపయోగించి ఈ బొమ్మను తీర్చిదిద్దాడు. గ్యాలరీ ఓనర్ స్టీవ్ లాజారైడ్స్ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ బొమ్మకు క్రిస్టినా అనే పేరు కూడా పెట్టారు. అయితే నవంబర్ 25న ఎంపోరియంలో పనిచేసే మహిళ గ్యాలరీకి తాళం వేసి టీ పెట్టుకునేందుకు పైకి వెళ్లింది. ఈ సమయంలోనే ఓ వ్యక్తి బొమ్మను చూసి అమ్మాయి అనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వాళ్లు వచ్చి డోర్‌ను పగలగొట్టారు. టీ కోసం పైకి వెళ్లిన మహిళ.. శబ్దాలు విని కిందకు వచ్చింది. పోలీసులను చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక షాక్ అయింది. గతంలోనూ ఓసారి ఈ బొమ్మను చూసి నిజమైన మహిళ అనుకుని వైద్య విద్యార్థులు సాయం చేసేందుకు ప్రయత్నించారు. తీరా అది శిల్పం అని తెలిసి నవ్వుకున్నారు. చదవండి: 165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే -
కరోనా కష్టకాలంలో వృద్ధులపై పెరిగిన వేధింపులు
-
స్త్రీల కోసం చిందిన సిరా చుక్క
చాలా పాత మొహల్లా అది.టాంగాలు నడుస్తున్నాయి. తాగుబోతులు తిరుగాడుతున్నారు. స్త్రీలను వేటాడేవారు జుబ్బాల జేబుల్లో చిల్లర పడేసుకొని కొనడానికి తిరుగుతున్నారు. ‘సార్.. అమ్మాయి కావాలా సార్’ అడిగాడతను ఒక పెద్దమనిషిని. ‘రండి సార్.. పైనే ఉంది’ తీసుకెళ్లాడు. మురికిగా ఉన్న మహల్ అది. చిన్న చిన్న గదులు. మురికి పనుల కోసంగా ఉన్న గదులు. మురికి సమయాలలో రద్దీగా ఉండే గదులు. మెట్ల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళుతున్నాడు. ‘ఇటు... ఇటు..’గడప దగ్గర నిలబెట్టి లోపలికెళ్లాడు. కొద్దిగా తెరిచిన తలుపు నుంచి లోపల ఏముందో కనిపిస్తూ ఉంది.కుక్కి మంచం. దాని మీద ఒక ప్రాణం లాంటి ప్రాణం. స్త్రీ ప్రాణం.‘లెయ్వే... లెయ్... గిరాకీ వచ్చింది లెయ్’ లేవలేదు. నిద్రపోతూ ఉంది. మొద్దుగా నిద్ర పోతూ ఉంది. శవంలా నిద్రపోతూ ఉంది. ‘లెయ్మంటున్నానా’ నీళ్లు మొహాన కొట్టి బలవంతంగా లేపాడు. ‘వద్దు.. ఓపిక లేదు... పంపించెయ్’ ‘ఇదే ఆఖరు... ఆ తర్వాత నిద్ర పోదూగానీ’ ‘అయ్యో.. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా. నేను నిద్రపోయి ఎంత కాలం అయ్యింది. నాకు నిద్ర వస్తోంది.దండం పెడతాను. పంపించేయ్’ ‘ఇదొక్కటే అన్నానా. ఏం తమాషాగా ఉందా’ జుట్టు పట్టుకున్నాడు. స్త్రీ. నలిగి నలిగిపోయి ఉన్న స్త్రీ. నలిపి వేయబడిన స్త్రీ. శవంలా జీవచ్ఛవంలా మారిన స్త్రీ. ఏమడుగుతోంది. మణులా మాణిక్యాలా. నిద్ర. గుక్కెడు నిద్ర. బాధల్ని క్షోభల్ని కాసేపైనా మర్చిపోయేలా చేయగలిగే నిద్ర. ఇవ్వట్లేదే రాక్షసుడు. ‘చెప్పినమాట వింటావా లేదా’ ఛెళ్లున కొట్టాడు.‘ఒరేయ్ రాక్షసుడా’ కాళి అయ్యింది. అపరకాళిలా తిరగబడింది. రక్కింది. ముఖాన పీకింది. తల మంచానికేసి బాదింది. కింద పడ్డాడు. పోయాడు. ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేనట్టుగా పోయాడు. శవం. కాని అదంతా ఆమెకు ఎందుకు. ఆమెకు కావలసింది నిద్ర. హాయిగా పట్టే నిద్ర. అప్పుడిక ఆమె ఆ కుక్కిమంచం మీద, మగాళ్లు నిద్రపోనివ్వని మంచం మీద, దారుణ ఆక్రమణల మంచం మీద తన కోసం తాను తన కోసంగా తాను నిద్ర పోయింది.మంటో రాసిన కథ ఇది. ఇప్పుడు కాదు 60 ఏళ్ల క్రితం. దేశ విభజన జరిగింది. ఇరు ప్రాంతాల వాళ్లు కత్తులు ఝళిపిస్తున్నారు. నెత్తురు చిందిస్తున్నారు. శవానికి శవంతో జవాబు చెబుతున్నారు. ద్వేషాన్ని ద్వేషంతో నూరుతున్నారు. తలల్లో స్పృహ లేదు. చేతుల్లో కత్తులు మాత్రమే ఉన్న కాలం అది. పురుషుడు దొరికితే సంహరించు. స్త్రీ దొరికితే చెరిచెయ్.అలాంటి సమయంలో సరిహద్దు మీద ఒక తండ్రి వెతుకులాడుతున్నాడు. కూతురుని. కన్నకూతురిని. ‘నా కూతురుని చూశావా బాబూ’‘నీ కూతురు ఎలా ఉంటుంది ముసలాయనా?’‘ఎర్రగా తామరపువ్వులా ఉంటుంది. కురులు విప్పితే అప్సరసలా ఉంటుంది. బుగ్గన పెద్ద పుట్టుమచ్చ. అందమైన కూతురు. అమాయకమైన కూతురు. పదహారేళ్ల కూతురు...నాకూతురుని చూశారా బాబూ’...బిడారుల్లో ఏడుపులు... శిబిరాల్లో శోకాలు... వలస పోయేవాళ్ల ఏడ్పులు... వలస వస్తున్నవాళ్ల ఆర్తనాదాలు... కూతురు కనిపించడం లేదే...ఎక్కడో ఒక మూలన ఆ అమ్మాయి కనిపించిందని ఎవరో చెప్పారు.తండ్రి పరిగెత్తాడు. పరిగెత్తి కూతురిని చూశాడు. గుండెలకు హత్తుకుంటూ చూశాడు. కన్నీళ్లను ఆ అమ్మాయి గొంతులోకి ఒంపుతూ ప్రాణాలు దక్కించుకోవడానికి చూశాడు. భుజాల మీద వేసుకొని హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. హాస్పిటల్ బెడ్ మీద కూతురు పడి ఉంది. కొనఊపిరితో ఉంది. ‘డాక్టర్ సాబ్... నా కూతురిని బతికించండి డాక్టర్ సాబ్’ పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్‌ను తీసుకొచ్చాడు.డాక్టర్ వచ్చి నాడీ పట్టుకుని చూశాడు. పేరు పెట్టి పిలిచాడు. కదలిక లేదు. కేసు అర్థం కావడం లేదు. పరికించి చూద్దామంటే గది చీకటిగా ఉంది. గాలాడక చిరాగ్గా ఉంది. పక్కనే ఉన్న కిటికీ రెక్కను చూపిస్తూ ‘విప్పు’ అన్నాడు. తండ్రికి సరిగ్గా వినపడలేదు. ‘దానిని విప్పు’ అన్నాడు.అప్పుడు అనూహ్యంగా ఒకటి జరిగింది.ఆ మాటకు ఆ అమ్మాయిలో కదలిక వచ్చింది. మెల్లగా చేతులు రెంటిలోనూ సత్తువ తెచ్చుకుని వణుకుతూ భయం భయంగా తన పైజామా బొందును ‘విప్పడం’ మొదలుపెట్టింది.కథ ముగిసింది.ఇది కూడా మంటో రాసిన కథే. మంటోగా పిలువబడే ప్రపంచాన ప్రసిద్ధమైన ‘సాదత్ హసన్ మంటో’ స్త్రీల కోసం రాశాడు. స్త్రీ దుఃఖాన్ని లోకానికి చెప్పడానికి రాశాడు. స్త్రీ నిజమైన వేదనను చూస్తే షాక్ అవుతారని చెప్తూ షాకయ్యే పద్ధతిలో రాసి నేల కదిలిపోయేలా చేశాడు. స్వాతంత్య్రం వచ్చే సమయాన బాంబే (ముంబై)లో ఉన్న మంటో అక్కడి వేశ్యల జీవితాల్ని పరిశీలించాడు. అప్పటి వరకూ ఉర్దూ కథా సాహిత్యంలో మర్యాదకరమైన కథలు వస్తున్న సమయంలో వారి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకుని లోకాన్ని హడలెత్తించాడు. అందుకు కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగాడు. అయినా భయపడలేదు. ‘వేశ్యల దగ్గరకు వెళ్లడానికి మనకు పర్మిషన్ ఉందిగానీ వారి జీవితాన్ని రాయడానికి పర్మిషన్ లేదా’ అని మంటో ప్రశ్నించాడు. ‘దేశభక్తి కథలు, కార్మికుల కథలు రాయమని అందరూ నన్ను అడుగుతుంటారు. కాని వేశ్యావాటికలో మూసిన తలుపుల వెనుక ఉన్న హింసకు మించిన వస్తువు నా వద్ద లేదు. వాళ్లు మన సమాజంలో భాగం. వారి గురించి రాయాలి’ అన్నాడు మంటో. ఆ రోజులలోనే ఆయన బాంబే శ్రీమంతులు తమ లైంగిక విశృంఖలత్వం కోసం నిరుపేద పసిపిల్లలను ఎలా ఉపయోగించుకునేవారో రాసి సమాజపు పైపై పూతల పరదాలను చీలికలు పీలికలు చేశాడు. అమృత్‌సర్‌లో పుట్టిన సాదత్ హసన్ మంటో భారతదేశాన్ని అందునా బాంబేని విపరీతంగా ప్రేమించాడు. ఆరాధించాడు. బాంబేలో హీరో అశోక్ కుమార్ కీలకపాత్ర పోషించిన ‘బాంబే టాకిస్’ స్టుడియోలో స్క్రిప్ట్ రైటర్‌గా ఉండేవాడు. కాని దేశ విభజన సమయంలో ‘ముస్లిం ఉద్యోగులు’ ఎక్కువ మంది బాంబే టాకిస్లో పని చేస్తున్నారు కనుక ఆ స్టుడియోను తగులబెడతాం అని ఆ రోజులలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. అవి విని మంటో కలత చెందాడు. అంతేకాదు ‘హృదయంలో ఉండవలసిన మతం తలకెక్కి’ విషం చిమ్ముతున్న సమయాలను చూసి విషాదపడ్డాడు. ‘నా దేశం పాకిస్తానా?’ అనే ప్రశ్నతో అతడు లాహోర్ చేరుకున్నాడు. కాని అక్కడకు వెళ్లినా అతడు అనుక్షణం బాంబేను కలవరిస్తూ బతికాడు. 1948లో మంటో పాకిస్తాన్ వెళితే ఆ దేశంలో అతను కేవలం ఏడేళ్లే జీవించగలిగాడు. ‘నా తల్లిదండ్రులు ఖననమైన మట్టి భారతదేశంలో ఉంది. నన్ను ముక్కలు చేసి ఇచ్చిన ఈ స్వాతంత్య్రం శోకమే మిగిల్చింది’ అన్న మంటో 1955లో మరణించాడు. ∙∙ మంటో రాసిన కథల్లో ‘ఠండా గోష్’ (చల్లటి మాంసం) అతడికి విశేషమైన పేరును, కీర్తిని, పీడకలలను మిగిల్చిన కోర్టు కేసులను ఇచ్చింది. ఆ కథలో అతడు వాడిన భాష, తీసుకున్న కథాంశం ఇప్పటికీ యథాతథంగా ప్రచురించడం కష్టం– మెయిన్‌స్ట్రీమ్ పత్రికలలో. మానవ ప్రవర్తనలోని పశుత్వాన్ని, కర్కశత్వాన్ని, స్వార్థాన్ని, పర్వెర్షన్ను మంటో చెప్తూ వెళ్లాడు. నగ్నంగా చూపుతూ వెళ్లాడు. ‘ఇలా రాయడం తప్పు కాదా... రచయితకు బాధ్యత ఉండక్కర్లేదా’ అనంటే ‘వేపాకులు చేదుగానే ఉంటాయి. కాని అవి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి’ అని జవాబు చెప్పాడు. అతడి ఒక కథలో ఒక ముసలి దంపతుల ఇంట్లో ఒక వేరే మతస్తుడు శరణుజొచ్చుతాడు. ఆ ముసలి దంపతులు చాలా మంచివాళ్లు. చీమకు కూడా అపకారం తలపెట్టరు. కాని తమ ఇంట్లో శరణుజొచ్చింది అన్య మతస్తుడు. అప్పుడు వాళ్లు బాగా ఆలోచించి తాము మంచివారం గనక ఒక నిర్ణయం తీసుకుంటారు. ‘మనకెందుకు ఆ పక్కింటి వాళ్లకు ఇతణ్ణి అప్పజెబుదాం. వాళ్లయితే రోజుకొరిని చంపుతున్నారు. ఇతడి సంగతి వాళ్లే చూసుకుంటారు’.ఇలా చెంపకు పట్టి కొట్టినట్టు అతడు కథలు రాశారు.అతడి కథల్లో ఇవాళ్టి మనుషులు కనిపిస్తారు. రేపటి మనుషులు కనిపిస్తారు. నైచ్యం వదులుకోని మనిషి ఉన్నంత కాలం మంటో కథ ఉంటుంది. ‘మంటో’ మీద అనేక నాటకాలు, వ్యాసాలు వచ్చాయి. భారతదేశంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. సుప్రసిద్ధ నటి, దర్శకురాలు నందితా దాస్ ‘మంటో’ జీవితకథను తెరకెక్కించింది. మంటో మీద ఉన్న గౌరవంతో నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కేవలం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్‌తో ఈ సినిమాలో నటించాడు. ఒక రచయిత జీవితం, సత్యం పలకాలనుకున్న ఒక రచయిత జీవితం, సత్యానికి నిలబడి సమాజపు నిర్దాక్షిణ్యతను చవి చూసిన ఒక రచయిత జీవితం, తన నేలకు దూరమయ్యి అస్థిమితత్వం పొందిన రచయిత జీవితం ఈ జీవితాన్ని మాత్రమే కాదు... దేశ విభజన ఈ దేశ ప్రజల మీద ఎటువంటి గాయాన్ని కలిగించిందో కూడా ఈ సినిమా చూపుతుంది.మనిషి కోసం మాట్లాడే రచయితలకు బెదిరింపులు, మరణ సందేశాలు వస్తున్న ఇవాళ్టి రోజులలో, ఏ ఉన్మాదాన్నైనా ఖండించాల్సిందే అని కలం పట్టుకునేవారి నోళ్లు మూయించాలనుకుంటున్న ఈ రోజులలో, ప్రజల మధ్య ద్వేషాన్ని కడిగిపారేయడానికి సిరాను నింపుకునేవాళ్ల కలాల ములుకు విరగ్గొడుతున్న ఈ రోజులలో మంటో అవసరం ఉంది.వంద మంటోల అవసరం ఉంది. వేయి మంటోలు ప్రభవించాల్సిన అవసరం ఉంది.సినిమా థియేటర్స్‌లో ఉంది. వెళ్లి మంటోతో పాటు ఒక కథకు కన్నీరు కార్చండి. ఒక కథకు దగ్ధమవ్వండి. నందితా దాస్ ఇచ్చిన మరో కానుక స్త్రీల కోసం రాసిన రచయిత జీవితాన్ని ఒక మహిళా డైరెక్టర్ తెర మీదకు అనువదించడం విశేషమైన అంశం. మంటో జీవిత కథను తెరకెక్కించడానికి నటి, దర్శకురాలు నందితా దాస్ దాదాపు నాలుగు సంవత్సరాలు వెచ్చించారు. రీసెర్చ్ చేశారు. పాకిస్తాన్ వెళ్లి మంటో ముగ్గురు కుమార్తెలను, స్నేహితులను కలిసి మంటో జీవితాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మంటో జీవితం గురించి చూపుతూనే ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన కథలకు ఈ సినిమాలో చోటిచ్చారు. ‘ఖోల్దో’, ‘టొబా టేక్సింగ్’, ‘ఠండా గోష్’ కథలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది పిరియడ్ ఫిల్మ్. ఆ కాలం వాతావరణం కల్పించడానికి 1950ల నాటి బాంబే, లాహోర్ల వాతావరణం సృష్టించడానికి నందితా అథెంటిక్ బ్యాక్‌గ్రౌండ్‌ను సృష్టించడంలో ప్రతిభ చూపారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల మంటోతో పాటు నందితాకు కూడా ఆలింగనం ఇస్తారు. – ఖదీర్ -
నాకీ జన్మ బాగానే ఉంది
ఒకసారి దుస్తులు మాసిపోయాక ఇక ఎక్కడ కూర్చోడానికైనా మనిషి సిద్ధపడతాడు కాబట్టి, దుస్తులు మాసిపోకుండా ముందే జాగ్రత్తపడడం మంచిది. అనగనగా ఓ రాజు. ఆ రాజు మంచివాడే కానీ, మాటలను అదుపు చేసుకోవడం చేతకానివాడు. అలా ఓ రోజున ఒక మునిని ఇష్టం వచ్చినట్లు మాట్లాటంతో ఆ ముని ఆగ్రహావేశాలకు గురయ్యాడు. రాజుని ఓ పందిలా అవుతావని శపించాడు. తాను పందిలా మారడమన్న ఊహనే రాజు భరించలేకపోయాడు. వెంటనే ముని కాళ్లమీద పడి, ‘‘మహాత్మా! దయచేసి నాకు శాపాంతం తెలియజెప్పండి’’ అని ప్రార్థించాడు. ‘‘నువ్వు పంది జన్మలో ఉండగానే ఎవరైనా సరే, నిన్ను కనిపెట్టి నిన్ను సంహరిస్తే, నీకు సద్గతి కలుగుతుంది’’ అని చెప్పాడు. వెంటనే రాజు, యువరాజుని పిలిచి ‘‘కుమారా, ఒక ముని నన్ను పంది జన్మ ఎత్తమంటూ ఘోరంగా శపించాడు. నేను ఇంతకాలమూ రాజుగా గడిపిన వాడిని. పందిలాగా బతకాల్సిన దుస్థితి రాకూడదు. కనుక నేను పందినైన తర్వాత నన్ను ఎలాగైనా సరే వెతికి అక్కడికక్కడే చంపివేస్తే నాకు వెంటనే విముక్తి కలుగుతుంది’’ అని చెప్పాడు.కొంతకాలం గడిచింది. యువరాజు బయలుదేరాడు. ఎక్కడెక్కడో వెతికాడు. చివరికి ఓ చోట తన తండ్రిని పంది రూపంలో కనిపెట్టగలిగాడు. ఓ మురికి కాలువలో ఆ పంది మరొక ఆడ పందితోనూ, ఓ నాలుగైదు పంది పిల్లలతోనూ ఉండగా చూశాడు. యువరాజు పంది రూపంలో ఉన్న తండ్రిని నరకడానికి కత్తి తీశాడు.అప్పుడు ఆ పంది మాటలాడింది.‘కుమారా, తొందరపడకు. కాస్తంత ఆగు. ఇప్పుడు ఈ బతుకు బాగానే ఉంది. ఏ మాత్రం అసహ్యంగా లేదు. ఇదిగో నా పక్కనున్న ఈమె నీకు పిన్ని. మిగిలిన పంది పిల్లలు నీకు తమ్ముళ్లు’’ అంది.ఆ మాటలు విన్న యువరాజు మనసు వికలమై పోయింది. దేన్నయితే ముందు అసహ్యించుకుంటామో తర్వాత దాన్నే ఇష్టపడతాం. దేన్నయితే కోరుకుంటామో అది దొరికిన తర్వాత వద్దనుకుంటాం. ఒకసారి కావాలనుకున్నది మరోసారి వద్దనుకోవడమే మనిషి స్వభావం. ఒకసారి దుస్తులు మాసిపోయాక ఇక ఎక్కడ కూర్చోడానికైనా మనిషి సిద్ధపడతాడు కాబట్టి, దుస్తులు మాసిపోకుండా ముందే జాగ్రత్తపడటం మంచిది. – యామిజాల జగదీశ్ -
నాట్లు వేయలేక.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య
బందనపల్లి(రాయపర్తి): బోరులో నీరు అడుగంటి నారు వేయ లేని స్థి తి ఎదురుకావడంతో మ నస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బంధనపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్సై వెంకటమల్లు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిమ్మ కుమారస్వామి(28) తనకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక్క బోరు సహాయంతో రెండు ఎకరాల్లో పత్తి, మిర్చి, ఒక్క ఎకరంలో వరి సాగు చేసేందు కు నారు పోశాడు. అయితే, నారు ముదురుతున్నా బోరు ఎండిపోయి నీరు రాకపోగా.. చుట్టుపక్కల అంద రూ నాట్లు వేశారం టూ మనస్తాపం చేశాడు. ఈ మేరకు ఆది వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నానంటూ భార్య అనితకు చెప్పి పొలం నుంచి వచ్చాడు. అయితే, సాయంత్రం ఆయన భార్య ఇంటికి వచ్చే సరికి కుమారస్వామి అపస్మారక స్థితిలో కొట్టుమిట్లాడుతుండగా పురుగులు మందు తాగినట్లు గుర్తించిన ఆమె చుట్టుపక్కల వారి సాయంతో వర్ధన్నపేట ఆస్పత్రికి బయలుదేరారు. ఈ మేరకు మార్గమధ్యలోనే ఆయన మృతి చెందగా ఇం టికి తీసుకువచ్చారు. కాగా, భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీ సులు శవపంచనామా నిర్వహించి కేసునమోదు చేయగా..సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
శోభనాద్రిపురం (రామన్నపేట) : అప్పులబాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శోభనాద్రిపురంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాసుల భిక్షం (55) తనకున్న రెండెకరాల పొలంతో పాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని కొంతకాలంగా వరిని సాగుచేస్తున్నాడు. పెట్టుబడులు, కౌలు చెల్లించేందుకుగాను సీసీ బ్యాంకుతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేశాడు. ఆ అప్పులను ఎలా తీర్చలని కొద్ది రోజులుగా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. తీవ్ర మనోవేధనతో ఉన్న భిక్షం ఎప్పటిలాగే ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్ద వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటి ఆయన నోటి నుంచి నురుగులు రావడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌లో రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు కాసుల ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్యారసాని శీనయ్య తెలిపారు. కాగా, మృతుడికి భార్య సావిత్రమ్మతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి... అప్పులబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కాసుల భిక్షం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య కోరారు. ఏరియా ఆస్పత్రిలో ఉన్న భిక్షం మృతదేహాన్ని వారు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు. వారి వెంట పబ్బతి లింగయ్య, కాసుల సైదులు, గోగు లింగస్వామి, ముక్కాముల మల్లేశం ఉన్నారు. -
బాధేస్తే గులాబ్‌జామ్ తింటా!
ప్రస్తుతం అరడజను చిత్రాలు ఉన్నాయని అంటోంది సమంత. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సి వస్తోంది. ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతుంది. అలా బాధ వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను. వెంటనే ఆ బాధ తొలగిపోతుంది. గులాబ్‌జామ్ తింటే బాధ ఎలా పోతుందని మాత్రం అడగకండి అని అంటోంది చెన్నై చిన్నది. మానవుడు ఆశాజీవి. అభిరుచి జీవి కూడా. ఈ రెండూ జీవితంలో బాధల్ని మరపించేస్తాయి. నటి సమంతపైన చెప్పిన వాటిలో రెండవ దీనితో ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఏమిటీ అర్థం కాలేదా’సమంత చెబితే ఈజీగా అర్థం అవుతుందిలే. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల సరసన చేరిన లక్కీ నటి ఈ చెన్నై చిన్నది. ఏమాయ చే శావే అన్న ఒకే ఒక్క చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని గుల్ల చేసేసిన సమంత ఈ తరువాత కత్తి చిత్రంతో తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని దోచేసుకున్నారు. ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ క్రేజీ హీరోయిన్గా విరాజిల్లుతున్నారు. ప్రస్తుత తన స్థాయి గురించి ఈ చిరునవ్వుల ధరహాసిని ఏమంటున్నారో చూదాదం. ప్రస్తుతం నా చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. వీటిలో రెండు తమిళ చిత్రాలు, రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సివస్తోంది. ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులతో కలిసి గడపలేక పోతున్నాను. ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతోంది. నాకు ఇంటి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను. వెంటనే ఆ బాధ తొలగిపోతుంది.అయితే గులాబ్‌జామ్ తింటే ఇంటి జ్ఞాపకం ఎలా మరుగవుతుందన్నది మాత్రం అడగకండి. ఆ ప్రశ్నకు నా వద్ద బదులు లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో విజయ్‌కు జంటగా తెరి, సూర్య సరసన నటించిన 24 చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులోనూ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వీటన్నిటిలోనూ తన పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఇలా నటనకు అవకాశం ఉన్న విభిన్న పాత్రలు అమరడం నా అదృష్టం. త్వరలో నటుడు ధనుష్‌తో వడచెన్నై చిత్రంలో నటించనున్నాను. ఎక్కువ చిత్రాల్లో నటించడం వల్ల ఈ ఏడాది నాకు ప్రత్యేకమైందనే చెప్పాలి. నాకు దైవ కృప చాలా ఉంది. విరామం అన్నది లేకుండా నటిస్తూనే ఉండాలన్నది నా ఆశ. -
దేశమే లేని దీనులు..!
భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతవాసుల దుస్థితి ‘నో మేన్స్ ల్యాండ్’లో 70 వేల మంది పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం జీరో పాయింట్ (బంగ్లా సరిహద్దు): బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డప్పుడు అది భారత్‌తో కుదుర్చుకున్న ‘భూ సరిహద్దు ఒప్పందం’ (ఎల్బీఏ) పరిధిలోకి రాకపోవడంతో అక్కడున్న 260 గ్రామాలకు చెందిన 70 వేల మంది అనాథలుగా మారిపోయారు. ఈ పల్లెటూళ్లు ‘నో మేన్స్ ల్యాండ్’ (ఎవరికీ చెందని ప్రాంతం) పరిధిలోకి వెళ్లడంతో ఈ ప్రజలంతా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. తరచూ నేరాల బారినపడుతున్నారు. సరిహద్దు మీదుగా అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ చెలామణి అడ్డుకోవడానికి గస్తీ నిర్వహించే భద్రతా దళాలకు వీరిపై ఎలాంటి వైఖరి అనుసరించాలో తెలియని వింత పరిస్థితి ఎదురవుతోంది. ఎల్బీఏ అమలైన తరువాత సరిహద్దులోని పలు వివాదాస్పద ప్రాంతాలను భారత్, బంగ్లాదేశ్ నియమాల ప్రకారం బదలాయించుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలోని ఈ గ్రామాలపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ‘ఈ గ్రామాలను అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందని మేం ప్రభుత్వానికి విన్నవించాం. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన రాలేదు. ఈ గ్రామాలు తరచూ చట్టవ్యతిరేక కార్యకలాపాల బారినపడుతున్నాయి. కొన్నిసార్లు చొరబాటు యత్నాలు జరుగుతున్నాయి’ అని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ సందీప్ సాలుంకే అన్నారు. పానితర్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న ఇళ్లలో ఒకటి భారత్, మరొకటి బంగ్లాదేశ్ పరిధిలోకి వస్తాయి. పది మీటర్ల వెడల్పున్న మార్గం రెండు దేశాలను విడదీస్తుందని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా చొరబాట్లుదారులు, నేరగాళ్లపై నిఘా ఉంచడం కష్టసాధ్యంగా మారిందని చెప్పాయి. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు 4,096 కిలోమీటర్లు కాగా, దక్షిణ బెంగాల్ మార్గంలోని ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నాదియా, ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల పరిధిలోనే ఇలాంటివి 54 గ్రామాలు ఉన్నాయి. వీటిలోని 4,749 కుటుంబాల్లో దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ నేరాల రేటు ఎక్కువగా ఉందని బీఎస్ఎఫ్ తెలిపింది. ఎవరికీ చెందని ప్రాంతాలపై నిఘా కోసం జవాన్లు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. అక్కడి ప్రజలను సులువుగా గుర్తుపట్టడానికి ఫొటోలతో కూడిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎవరు వచ్చినా వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ శాతం చిన్నవే కాబట్టి అన్నింటినీ అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని బీఎస్ఎఫ్ కమాండింగ్ అధికారి రత్నేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ గ్రామాల మహిళలు, చిన్నారుల సాయంతో దళారులు సిగరెట్లు, ఆహార పదార్థాలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని వెల్లడించారు. భారత్ నుంచి కూడా బంగ్లాదేశ్‌లోకి ఆభరణాలు, దగ్గుమందు (మత్తుకోసం), వాహన విడిభాగాలు దొంగతనంగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి ఘటనలపై వందలాది కేసులు నమోదైనట్టు కుమార్ చెప్పారు. -
పండగ పూట పస్తే
010 పద్దున జీతాలు అందజేయాలి.. ఎయిడెడ్ సిబ్బంది జీతాలపై నియంత్రణ ఎత్తివేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగనే 010 పద్దు ప్రకారం ప్రతి నెలా జీతాలు వచ్చేలా చూడాలి. హెల్త్‌కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత నివ్వాలి. జీతాలు సరిగా రాక ఎయిడెడ్ సిబ్బంది కుటుంబాలు కష్టాలకు గురవుతున్నారు. పండగ వేళల్లో సైతం జీతాలు రాకపోవడం బాధాకరం. - కె.శ్రీనివాసరావు, ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ గిల్డ్ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు(విద్య) : జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. నాలుగు నెలలుగా జీతాల్లేక పండగ పూట పస్తు పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నెలనెలా జీతాలు వస్తేనే అంతంత మాత్రంగా సాగే జీవితాలు జీతాలు లేక అల్లాడిపోతున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితులు ఆశించిన స్థాయిలో మెరుగుపడడం లేదు. జిల్లాలో 84 ఎయిడెడ్ ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఐదు ఓరియంటల్ స్కూల్స్, ఒక హిందీ విద్యాలయం ఉన్నాయి. సుమారు 500 మందికిపైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలిమెంటరీ పాఠశాలలు, ఓరియంటల్ స్కూల్స్, హిందీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి జీతాలు అందలేదు. ఉన్నత పాఠశాలలకు డిసెంబర్ నుంచి జీతాలు రాలేదు. ప్రభుత్వం అనాలోచితంగా బడ్జెట్‌ను విడుదల చేయడతోనే ఈ పరిస్థితి దాపురించింది. ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలకు నాలుగు క్వార్టర్లకు కలిపి రూ.5,59,58,500 విడుదల చేశారు. ఈ మొత్తం అక్టోబర్ నెలవరకే ఎలిమెంటరీ స్కూల్ సిబ్బంది జీతాలకు సరిపోయింది. ఒక నిర్ధిష్టమైన మొత్తాన్ని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. జనవరి వరకు జీతాలు, డీఏ అరియర్స్ ఇచ్చేందుకు *6కోట్ల 2లక్షలు విడుదల చేయాల్సి ఉంది. హైస్కూల్లో డిసెంబర్ నుంచి జీతాలు, డీఏ అరియర్స్ ఇచ్చేందుకు *2,49,80,231లు విడుదల చేయాలి. ఓరియంటల్ సిబ్బందికి జీతాలు *65,90,662లు, దర్గామిట్టలోని బ్లెయిండ్ స్కూల్‌కు *1,86,500లు మంజూరుచే యాల్సి ఉంది. ఈ విషయమై విద్యాశాఖ కార్యాలయ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిడెడ్ పాఠశాలలకు జీతాలు ఇచ్చేందుకు నిర్ధిష్టమైన విధానాన్ని పాటించకపోవడం విమర్శలకు కారణమౌతోంది. సరైన పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు బిల్లులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎయిడెడ్ టీచర్లకు, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు రూ.100 కోట్లు మంజూరుకావాల్సి ఉందని అంచనా. బాబు ‘సంక్రాంతి చంద్రన్న కానుక’ పై చూపే శ్రద్ధ తమపై చూపడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సవతి ప్రేమ... ఎయిడెడ్పాఠశాలల పట్ల ప్రభుత్వం చూపుతున్న సవతి ప్రేమ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వ, జెడ్పీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించే లబ్ధి వీరికి చేరదు. జీతాలపై నియంత్రణ ఉండడంతో వీరికి నెలనెలా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు, హెల్త్‌కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ అందజేస్తూ జీవోలు విడుదలయ్యాయి. అయితే ఎయిడెడ్ సిబ్బందికి ఇంతవరకు వరకు జీఓలు అందలేదు. రిటైర్డ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేదు. ఉపాధ్యాయ సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకంగా, ఎయిడెడ్ ఉద్యోగులకు ఒక రకం గా లబ్ధి అందడంపై చాలాకాలంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నాసమస్యలు తీరే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 57 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ జూన్‌లో టీడీపీ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. కానీ ఎయిడెడ్ సిబ్బందికి ఆ జీఓ విడుదల కాలేదు. దీంతో జూన్‌లో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు అటు పింఛన్, ఇటు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఉద్యోగాల్లో కొనసాగాలనే ఉత్తర్వులు కూడా అందకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. -
భార్యాబాధితులను రక్షించే ఆప్
కోల్‌కతా: భారత్‌లో ప్రతి ఎనిమిది నిమిషాలకో వివాహితుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అధికారిక సమాచారం. కుటుంబ కలహాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే ఇలాంటి మగవాళ్లకు వెంటనే సాయంచేసి రక్షించేందుకు ఓ మొబైల్ ఆప్ వచ్చేసింది. 'ఎస్ఐఎఫ్ ఓఎన్ఈ(సిఫ్ వన్)' అనే ఆండ్రాయిడ్ అఫ్లికేషన్‌ను రూపొందించారు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భార్యాబాధితుల కోసం సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎస్ఐఎఫ్ఎఫ్) ఈ ఆప్‌ను ఆరంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో 50 నగరాల్లో 50 మంది పురుషులు, కుటుంబ హక్కుల సంస్థలు పనిచేస్తున్నాయి. ఒత్తిడి, గృహ హింస, కుటుంబ వివాదాలు, కేసుల ద్వారా వేధింపులు తదితర సమస్యలకు ఈ ఆప్‌ను ఆశ్రయించవచ్చు. బటన్ నొక్కగానే బాధితులకు అవసరమైన సాయం చేస్తామని ఎస్ఐఎఫ్ఎఫ్ కన్వీనర్ అమిత్ కుమార్ గుప్తా తెలిపారు.