బోరులో నీరు అడుగంటి నారు వేయ లేని స్థి తి ఎదురుకావడంతో మ నస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బంధనపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
నాట్లు వేయలేక.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య
Aug 2 2016 12:07 AM | Updated on Nov 6 2018 7:56 PM
బందనపల్లి(రాయపర్తి): బోరులో నీరు అడుగంటి నారు వేయ లేని స్థి తి ఎదురుకావడంతో మ నస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బంధనపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్సై వెంకటమల్లు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిమ్మ కుమారస్వామి(28) తనకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక్క బోరు సహాయంతో రెండు ఎకరాల్లో పత్తి, మిర్చి, ఒక్క ఎకరంలో వరి సాగు చేసేందు కు నారు పోశాడు. అయితే, నారు ముదురుతున్నా బోరు ఎండిపోయి నీరు రాకపోగా.. చుట్టుపక్కల అంద రూ నాట్లు వేశారం టూ మనస్తాపం చేశాడు. ఈ మేరకు ఆది వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నానంటూ భార్య అనితకు చెప్పి పొలం నుంచి వచ్చాడు. అయితే, సాయంత్రం ఆయన భార్య ఇంటికి వచ్చే సరికి కుమారస్వామి అపస్మారక స్థితిలో కొట్టుమిట్లాడుతుండగా పురుగులు మందు తాగినట్లు గుర్తించిన ఆమె చుట్టుపక్కల వారి సాయంతో వర్ధన్నపేట ఆస్పత్రికి బయలుదేరారు. ఈ మేరకు మార్గమధ్యలోనే ఆయన మృతి చెందగా ఇం టికి తీసుకువచ్చారు. కాగా, భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీ సులు శవపంచనామా నిర్వహించి కేసునమోదు చేయగా..సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
Advertisement