
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు సోమవారం ఉదయం చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్య ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇచ్చిన ఇచ్చిన డబ్బులు డ్రా చేసుకుని పోగొట్టుకున్నాడు. దీనికి మనస్తాపానికి గురైన రైతు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మల్లయ్య కుటుంబం కన్నీరుమున్నీరైంది.