ఉప్పునూతల (మహబూబ్‌నగర్ జిల్లా) : అప్పుల బాధతో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం సదగోడు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లారెడ్డి(38) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది తన మూడు ఎకరాల పొలంతో పాటు, మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సేద్యం చేశాడు. ఈ పొలంలో పత్తి, వేరుశనగ పంటలను వేశాడు.
అయితే పంటలు పండక పెట్టుబడులు కూడా రాకపోవడంతో రూ.3లక్షల అప్పు పెరిగిపోయింది. అంతేకాకుండా వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన రైతు తన పొలం దగ్గర శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సువర్ణ, ముగ్గరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published Sat, Jul 4 2015 6:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement