కౌలు రైతు ప్రాణం తీసిన అప్పులు | farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ప్రాణం తీసిన అప్పులు

Published Sun, Jun 7 2015 8:52 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

farmer commits suicide

శాంతినగర్(మహబూబ్‌నగర్): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని ఓరైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం చింతలక్యాంపులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... అయిజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న (52) అత్తగారి ఊరైన చింతలక్యాంపులో స్థిరపడ్డాడు. తనకున్న మూడెకరాలతో పాటు మరో 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రెండేళ్లుగా సాగు చేస్తున్నాడు.

 

గతేడాది వాతావరణం అనుకూలించక పోవడంతో మిరప, పత్తి పంటల్లో నష్టం వచ్చింది. ఈ ఏడాది కూడా కౌలు భూమిలో పంటలు సాగుచేశాడు. అయితే, కుటుంబసభ్యులు కౌలు సాగును వ్యతిరేకిస్తున్నారు. అప్పులు కావటానికి లక్ష్మన్నే కారణమంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మన్న ఆదివారం ఉదయం పొలంలోకి వెళ్లి పురుగు మందు తాగి చనిపోయాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement