భార్యాబాధితులను రక్షించే ఆప్
కోల్కతా: భారత్లో ప్రతి ఎనిమిది నిమిషాలకో వివాహితుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అధికారిక సమాచారం. కుటుంబ కలహాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే ఇలాంటి మగవాళ్లకు వెంటనే సాయంచేసి రక్షించేందుకు ఓ మొబైల్ ఆప్ వచ్చేసింది. 'ఎస్ఐఎఫ్ ఓఎన్ఈ(సిఫ్ వన్)' అనే ఆండ్రాయిడ్ అఫ్లికేషన్ను రూపొందించారు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
భార్యాబాధితుల కోసం సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎస్ఐఎఫ్ఎఫ్) ఈ ఆప్ను ఆరంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో 50 నగరాల్లో 50 మంది పురుషులు, కుటుంబ హక్కుల సంస్థలు పనిచేస్తున్నాయి. ఒత్తిడి, గృహ హింస, కుటుంబ వివాదాలు, కేసుల ద్వారా వేధింపులు తదితర సమస్యలకు ఈ ఆప్ను ఆశ్రయించవచ్చు. బటన్ నొక్కగానే బాధితులకు అవసరమైన సాయం చేస్తామని ఎస్ఐఎఫ్ఎఫ్ కన్వీనర్ అమిత్ కుమార్ గుప్తా తెలిపారు.