సగం మంది పురుషుల్లో సంతానలేమి సమస్యలు | Male Fertility Crisis 50 percent of the men suffereing | Sakshi
Sakshi News home page

సగం మంది పురుషుల్లో సంతానలేమి సమస్యలు

Apr 4 2025 11:34 AM | Updated on Apr 8 2025 12:46 PM

Male Fertility Crisis 50 percent of the men suffereing

50 శాతం మంది పురుషుల్లో సంతాన సమస్యలు!

మారుతున్న జీవన శైలి,  ఒత్తిడి, పర్యావరణమూ కారణమే

హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, మంబై, చెన్నై నగరాల్లో అధిక ప్రభావం

 గ్రామీణ ప్రాంతాల్లో మెరుగు..

సర్వే వివరాల ప్రకారం.
సర్వే చేసిన కుటుంబాలు: 6,36,699
పాల్గొన మహిళలు: 7,24,115
వయసు: 15 ఏళ్ల నుంచి 49 ఏళ్లు
పురుషులు: 1,01,839
వయసు: 15 ఏళ్ల నుంచి 54 ఏళ్లు

సాక్షి, సిటీబ్యూరో: మెట్రోపాలిటిన్‌ నగరాల్లో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందనే నివేదికలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఒక్కటైన నూతన జంట తల్లిదండ్రులు కావాలని ఎన్నో కలలు కంటారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తీరా చూసే‍్త పిల్లల కోసం చేసిన ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు సంతానం ఆలస్యమవుతోందనగానే స్త్రీల సమస్యగానే పరిగణిస్తున్నారు. దేశంలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం మంది మగవారిని ఇన్‌ఫెర్టిలిటీ సమస్య వేధిస్తోంది. మునుపటితో పోల్చితే 20 ఏళ్ల నుచి 40 ఏళ్ల వయసుగల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాతంల్లో సమస్య అధికంగా ఉందనే విషయం ఆందోళన కలిగిస్తోంది.

ప్రభావం చూపే అంశాలు..
నగర యువతలో మారుతున్న జీవన శైలి, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, వాతావరణ కాలుష్యం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, రేడియేషన్‌, భారీ స్థాయిలో లోహాలు, టాక్సిన్స్‌, బిస్ఫెనాల్‌-ఎ (బీపీఏ), థాలేట్స్‌, రసాయినాలు, ప్లాస్టిక్‌, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వస్తువులు, తదితరాలు హార్మోన్ల స్థాయిలను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే పునరుత్పత్తిలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సైంటిఫిక్‌ చికిత్సలతో లోపాలను సులభంగా గుర్తించవచ్చు. హార్మోన్లను సమతుల్యం చేయడం, పురుషుల్లో పునరుత్పత్తి సామర్థా‍్యన్ని పెంచడానికి ఐవీఎఫ్‌, ఐసీఎస్‌ఐ వంటి అత్యాధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.

చదవండి: మొన్ననే ఎంగేజ్‌మెంట్‌, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం

నగరాల్లో అధిక సమస్యలు..
దేశంలో ప్రధానమైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రోపాలిటిన్‌ నగరాల్లో పురుషుల్లో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిలో స్త్రీ, పురుషులిద్దరూ సమాన పాత్ర ఉంటుంది. స్త్రీలతో పోల్చితే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే గనర యువతలోనే ఈ సమస్య అధికంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ హ్యూమన్‌ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ కాన్ఫరెన్స్‌ పరిశోధనలో 1970 తర్వాత జన్మించిన పురుషులలో మునుపటి తరాలతో పోలిస్తే, ముఖ్యంగా 25-40 సంవత్సరాల వయస్సులో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉందని తేలింది.

మానసికంగా కుంగిపోతున్నారు.
పెళ్లైన తరువాత ఏడాది, ఎండేళ్లయినా పిల్లలు కలగకపోయే సరికి పురుషులు మానసికంగా కుండిపోతున్నారు. ఒంటరితనం, విచారంగా ఉండటం, ఎవరికి చెప్పుకోవాలో తెలీక, ఎదుటి వ‍్యక్తుల మాటలకు లోలోన బాధపడుతున్నారు. ఈ భావోద్వేగ సమస్యలని పరిష్కరించడానికి సహచరులతో చర్చించుకోవడం, నిపుణల సూచనలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

గాంధీ ఆసుపత్రికి నెలకు సుమారు 500 మంది ఫెర్టిలిటీ సమస్యలతో వస్తున్నారు. ఒత్తిడి, లైఫ్‌ స్టైల్‌, స్మోకింగ్‌, రక్తప్రసరణ తగ్గడం వంటివి ఫెర్టిలిటీ సమస్యలకు దారితీస్తాయి. మిల్లీలీటరు స్పెర్మ్‌లో 15 నుంచి 16 లక్షల కౌంట్‌ ఉండాలి. కొంత మందిలో కనీసం లక్ష కూడా ఉండటంలేదు. ఇక్సీ వంటి చాలా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అవగాహనతో తొలుత పరీక్షలు నిర్వహించుకుంటే సమస్యలను అధిగమించొచ్చు.    -వి.జానకి, గాంధీ ఆసుపత్రి ఇన్ఫెర్టిలిటీ విభాగం ఇన్‌చార్జి.

వివాహం అయి ఏడాది దాటినా పిల్లలు పుట్టడంలేదంటే భర్య, భర్తలిద్దరూ సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించడం మంచిది. కారణాలు త్వరితగతిన గుర్తిస్తే, మెరుగైన చికిత్సా విధానాలను అందించే అవకాశం ఉంటుంది. మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలపై ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ వంటి నివేదికలు హెచ‍్చరిస్తున్నాయి. ధూమపానం, మధ్యంకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం, వయస్సు, జీవన శైలి, పర్యావరణం, వంటి అంశాలు మగవారిలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.

 

- డా.కె.రఘువీర్‌, ఆండ్రాలజిస్టు, ఒయాసిస్‌ ఫెర్టిలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement