Illicit Encounters Survey Says Men With Big Legs Have Many Affairs Than Small Leg Men - Sakshi
Sakshi News home page

పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే..

Published Thu, Nov 11 2021 4:38 PM | Last Updated on Fri, Nov 12 2021 10:11 AM

Illicit Encounters Survey says Men With Big Legs Have Many Affairs Than Small Leg Men - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కాళ్ల వేళ్లను బట్టి, చేతి రేఖలను బట్టి ఎటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారో కొంతమంది అంచనా వేస్తారు. ఒక్కోసారి అంచనాలు బోల్తాకొట్టి, అటుఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐతే తాజాగా ఓ డేటింగ్‌ సైట్‌ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ పాదాలు ఉన్న పురుషులకు వివాహేతర సంబంధాలు అధికంగా ఉంటాయని చెప్పింది. 

‘మిర్రర్‌’ ఆన్‌లైన్‌ సైట్‌ ప్రచురించిన కథనాల ప్రకారం.. ‘ఇల్లిసిట్‌ ఎన్‌కౌంటర్స్‌’అనే డేటింగ్‌ సైట్‌ పురుషులపై నిర్వహించిన సర్వే ప్రకారం మగవారి కాలి పరిమాణాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. దాదాపుగా రెండువేల మంది పురుషులపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మగవారి కాలి సైజును బట్టి జీవిత భాగస్వామిపట్ల వారు ఎంత నమ్మకంగా ఉంటారో వివరించింది. పెద్ద పాదాలు ఉన్న పురుషులు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఎక్కువని ఈ సర్వే తెల్పింది.  

చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!

ముఖ్యంగా 11 అంగుళాల పాదాలు ఉన్న పురుషులు 29 శాతం చీటింగ్‌ చేసే అవకాశం ఉందని, 10 అంగుళాల వారు 25 శాతం, 12 అంగుళాలుంటే 22 శాతం, 13 అంగుళాలుంటే మోసం చేసే అవకాశాలు 21 శాతం ఉంటుందని ఈ డేటింగ్ సైట్ సర్వేలో తేలింది. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వందలాది మంది పురుషులు స్వయంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని సర్వేలో అంగీకరించారట కూడా.

చదవండి: గుడ్‌న్యూస్‌.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!

‘ఇల్లిసిట్‌ ఎన్‌కౌంటర్స్‌’ సీఈవో జెస్సికా లియోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వేపై ప్రజలు విభిన్న ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మా లెక్కలు అబద్ధాలు చెప్పలేదని అన్నారు. కొంతమంది పురుషులు దీనిని కొట్టిపారేశారు కూడా. తమకు పెద్ద పాదాలు ఉన్నప్పటికీ తమ భాగస్వామిని ఎప్పుడూ మోసం చేయలేదని, నిజాయితీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ చేతి రేఖలనుబట్టి, కాలి పరిమాణాలను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే ఏ కొద్దిమందినో ప్రామాణికంగా తీసుకుని మొత్తం పురుషులు ఇలాగే ఉంటారని సైన్స్‌ కూడా చెప్పలేదు. ఏమంటారు?

చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement