
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని చారిత్రక ప్రదేశాలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని ఎప్పుడైనా చూశారా?. రాత్రివేళ ఎప్పుడూ కాంతులీనే ఈ ప్రాంతాల్లో అంథకారం అలముకుంటే ఎలా ఉంటుంది? ఇటువంటి దృశ్యం శనివారం కనిపించింది. డబ్ల్యూడబ్యూఎఫ్ ఇండియా ఎర్త్ అవర్ సెలబ్రేషన్ 2025 కింద ఈ విధంగా చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
శనివారం సాయంత్రం ఇండియా గేట్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, విక్టోరియా మెమోరియల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పలు చారిత్రక ప్రదేశాలలో లైట్లు ఆపివేశారు. ఈ ఏడాది 19వ ఎర్త్ అవర్(Earth Hour) ప్రపంచ జల దినోత్సవంతో పాటు జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీతకారుడు, డబ్ల్యూడబ్యూఎఫ్ ఇండియా హోప్ అండ్ హార్మొనీ రాయబారి శంతను మొయిత్రా తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం ద్వారా ఢిల్లీలో దాదాపు 269 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేశారు.
ఎర్త్ అవర్ అనేది విద్యుత్తును ఆదా చేసే ప్రచార కార్యక్రమం. ప్రజలు తమ దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రపంచంపై పడే భారాన్ని తగ్గించవచ్చని ఎర్త్‌డే చెబుతుంది. నీటిని ఆదా చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-use plastic) వాడకాన్ని తగ్గించడం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూమిని కాపాడవచ్చని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఎర్త్ అవర్ సందర్భంగా 206 మెగావాట్ల విద్యుత్ ఆదా అయిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: అమర వీరులకు ప్రముఖుల నివాళులు
Comments
Please login to add a commentAdd a comment