Earth Hour
-
23న దేశవ్యాప్తంగా ‘ఎర్త్ అవర్’
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎర్త్ అవర్‌లో భాగంగా...ఈ నెల 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంట పాటు విద్యుత్ దీపాలు ఆర్పేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ కోరారు. సచివాలయంలో మంగళవారం ఆమె ‘ఎర్త్ అవర్’పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎర్త్ అవర్ అనేది భూగోళం ఎదుర్కొంటున్న మూడు రకాల సంక్షోభాలను గుర్తించడానికని తెలి పారు. వాతావరణ మార్పులు, జీవ–వైవిధ్య నష్టం, పర్యా వరణ రక్షణకు... దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ సంస్థలతో పాటు ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 8.30–9.30 సమయంలో హైదరా బాద్‌లోని సెక్రటేరియట్, దుర్గం చెరువు, బీఆర్ అంబేడ్కర్, బుద్ధ విగ్రçహాలు, గోల్కొండ కోట, చార్మినార్, రాష్ట్ర గ్రంథాలయం, రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో లైట్లు ఆర్పాలని చెప్పారు. -
'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్‌గా పీవీ సింధు..
గత 18 ఏళ్లగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగహన కల్పించేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్ధ 'ఎర్త్ అవర్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2024కు గాను'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపికైంది. మార్చి7న అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టిన సింధు.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అవగహన కల్పించే పనిలో పడింది. తాజాగా సింధుతో పాటు ప్రముఖ మోడల్ దియా మీర్జా, హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ సింగర్ రఘు దీక్షిత్ 'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్లగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘు దీక్షిత్ మాట్లాడుతూ.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా అంబాసిడర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. పర్యవరాణాన్ని రక్షించేందుకు మనమందరం ఏకం కావల్సిన సమయం అసన్నమైంది. ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అవహగహన కల్పించేందుకు నా వంతు కృషి చేస్తాను. సహజ వనరులు, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరది. కాబట్టి అందరూ గంట సమయం పాటు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగమవుతరాని ఆశిస్తున్నానని" పేర్కొన్నాడు. చాలా సంతోషంగా ఉంది.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది .ఈ ప్రాతిష్టత్మక ఈవెంట్లో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు ధన్యవాదాలు. ప్రతీ ఏడాది కూడా నేను ఈ ఎర్త్‌అవర్ కార్యక్రమంలో పాల్గోంటున్నాను. గతం కంటే ఈసారి ఎక్కువమంది ఈ కార్యక్రమంలో భాగమవుతారని ఆశిస్తున్నాను. నా వరకు అయితే ఈ ఏడాది అన్ని లైట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఒక గంట పాటు ఆపివేసి, నా కుటుంబంతో కలిసి క్యాండిల్‌లైట్ డిన్నర్ చేస్తాను. పర్యావరణాన్ని, ఈ భూమిని కాపాడే బాధ్యత మనందరది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను వాడడం మానేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో మేలు చేస్తోంది. ప్రతీ ఏడాది ఒక గంట మాత్రమే కాకుండా ప్రతీ రోజు కూడా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని" దీయా మీర్జా పేర్కొంది. దుల్కర్ సల్మాన్ సైతం ఎర్త్ అవర్ గుడ్‌విల్ అంబాసిండర్‌గా ఎంపికకావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తనతో పాటు అందరూ గంట సేపు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగం కావాలని అభిమానులను దుల్కర్ కోరాడు. అస్సలు ఏంటి ఈ ఎర్త్ అవర్? కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు సుమారు 187 దేశాల్లోని ఏడువేల నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గంట పాటు లైట్లను ఆర్పివేసి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. కాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 25వ తేదీ నాడు ఎర్త్ అవర్ ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల ముందే ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నిర్వహించనుంది. అంటే మార్చి 23న సాయంత్రం 8:30 గంటల నుంచి 9: 30 గంటల వరకు ఈ ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది. -
‘ఎర్త్ అవర్’తో పర్యావరణానికి మేలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: రాత్రిపూట ఓ గంటపాటు కరెంటు నిలిపేస్తే.. పర్యావరణానికి, భూమికి మేలు జరుగుతుందంటున్నారు పర్యావరణ నిపుణులు. కర్బన ఉద్గారాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం తగ్గించకుంటే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఏటా మార్చి 26న రాత్రి గంటపాటు విద్యుత్ సహా ఇతర రకాల ఇంధనాల వినియోగం నిలిపేసి భూమికి కొంతైనా ఉపశమనం కలిగించేందుకు ‘ఎర్త్ అవర్’ను ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు. కాలనీలు, రెసిడెన్షియల్ అసోసియేషన్ల సహకారంతో ఎర్త్ అవర్’పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలగజేసే అంశాలను తెలియజేసి భూతాపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజ్భవన్లలోనూ ‘ఎర్త్ అవర్’ సందర్భంగా గంటపాటు విద్యుత్ దీపాలు, ఉపకరణాలను ఆపేయాలని గవర్నర్లను కోరినట్టు తెలిపారు. శనివారం రాత్రి 8.30 నుంచి గంట పాటు ఎర్త్‌అవర్‌ను పాటిస్తున్నట్టు ఫరీదా తంపాల్ ‘సాక్షి’తో చెప్పారు. ఎర్త్ అవర్ ప్రచారంలో పాల్గొనండి: గవర్నర్ ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేనిచోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో పాల్గొనాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ విజయవాడ రాజ్‌భవన్ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. -
ఇండియా పాక్ మ్యాచ్‌కు ఎర్త్ అవర్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఎలా ఉన్నా భారత్, పాకిస్థాన్‌లో భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్‌ల మధ్య శనివారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ గంటపాటు అంటే 8.30 నుంచి 9.30 వరకు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఈ మ్యాచ్ కోసం చూస్తున్న వారిపై పడే అవకాశం ఉంది. ఆ సమయంలో చాలామంది ఇళ్లలో ఎన్ని టీవీలు ఉంటే అన్ని టీవీలు కచ్చితంగా ఆన్ చేసే ఉంటాయి. ఒక వేళ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని గౌరవిస్తూ ఎర్త్ అవర్ పాటించాల్సి వస్తే చాలామంది తమ ఇళ్లలో టీవీలు కట్టేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోలార్ పవర్ ఉపయోగించేవారి ఇళ్లలో ఉండే టీవీలను షేర్ చేసుకుంటూ మ్యాచ్ చూడాల్సిందిగా ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేశారు. పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏడాది పాటిస్తున్నారు. -
రాత్రి 8.30-9.30.. స్విచ్ఆఫ్
- పర్యావరణ పరిరక్షణకు నేడు ‘ఎర్త్ అవర్’ - ఈపీటీఆర్ఐ డెరైక్టర్ జనరల్ కల్యాణ చక్రవర్తి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటిస్తున్నారని... ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలంతా విజయవంతం చేయాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డెరైక్టర్ జనరల్ బి.కల్యాణ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. ఎర్త్ అవర్‌పై శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నామన్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏడాది పాటిస్తున్నారని తెలిపారు. మన దేశంలో 150 పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కంపెనీలు, ఇండియాగేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, హౌరా బ్రిడ్జి వద్ద లైట్లను ఆర్పివేసి మద్దతు అందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పవన, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ పరిరక్షణకు కృషి చేస్తోందని చక్రవర్తి తెలిపారు. భూతాపంతో వివిధ జీవ జాతులు అంతరించిపోకుండా ఎర్త్ అవర్ కార్యక్రమానికి ‘వరల్డ్ వైడ్ ఫండ్’ సహకారం అందిస్తుందని... విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర ైడె రెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు. -
శనివారం 'ఎర్త్ అవర్' పాటించండి
-రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లను ఆఫ్ చేయాలి -ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ కళ్యాణ చక్రవర్తి విజ్ఞప్తి హైదరాబాద్: సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటించాలని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలంతా విజయవంతం చేయాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ బి.కళ్యాణ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. ఎర్త్ అవర్‌పై శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నామన్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను పాటిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 150 పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు కంపెనీల్లో, ఇండియాగేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, హౌరా బ్రిడ్జిల వద్ద లైట్లను ఆర్పివేసి మద్దతు అందిస్తున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ఇదో భాగమన్నారు. శనివారం రాత్రి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉందని... అయినా లైట్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పవన, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఉష్ణోగ్రతలు పెంచే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ల విడుదలను నియంత్రించి భవిష్యత్ తరాలు సుఖంగా జీవించేలా భూమిని తయారుచేయాలన్నారు. ప్రతీ శాఖ పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ పరిరక్షణకు కషి చేస్తుందని... ఈ కార్యక్రమాలను దేశంలో పలువురు కొనియాడారని తెలిపారు. భూతాపంతో వివిధ జాతులు అంతరించిపోకుండా ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని 'వరల్డ్ వైడ్ ఫండ్' సహకారం అందిస్తుందని... విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు.