
శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రాష్ట్రంలో విద్యుత్ దీపాలు ఆర్పేయాలి
అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎర్త్ అవర్‌లో భాగంగా...ఈ నెల 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంట పాటు విద్యుత్ దీపాలు ఆర్పేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ కోరారు. సచివాలయంలో మంగళవారం ఆమె ‘ఎర్త్ అవర్’పోస్టర్‌ను ఆవిష్క రించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎర్త్ అవర్ అనేది భూగోళం ఎదుర్కొంటున్న మూడు రకాల సంక్షోభాలను గుర్తించడానికని తెలి పారు. వాతావరణ మార్పులు, జీవ–వైవిధ్య నష్టం, పర్యా వరణ రక్షణకు... దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ సంస్థలతో పాటు ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
శనివారం రాత్రి 8.30–9.30 సమయంలో హైదరా బాద్‌లోని సెక్రటేరియట్, దుర్గం చెరువు, బీఆర్ అంబేడ్కర్, బుద్ధ విగ్రçహాలు, గోల్కొండ కోట, చార్మినార్, రాష్ట్ర గ్రంథాలయం, రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో లైట్లు ఆర్పాలని చెప్పారు.