
సాక్షి, సూర్యాపేట జిల్లా : మునగాల మండలం ఆకుపాముల సమీపంలో జరిగిన కారు ప్రమాదం నుంచి ఐఏఎస్ అధికారిణి, ఏపీ కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ సురక్షితంగా భయటపడ్డారు.
ఆకు పాముల సమీపంలో ఐఏఎస్ వాణీ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్.. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు ఐఏఎస్ వాణి ప్రసాద్‌ను సురక్షితంగా తరలించారు. మరోవైపు కారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు.
