Vani Prasad
-
ఏపీ కార్మికశాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ కు కారు ప్రమాదం...
-
ఓవర్ టేక్ చేయబోయి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఐఏఎస్ వాణి ప్రసాద్ కారు
సాక్షి, సూర్యాపేట జిల్లా : మునగాల మండలం ఆకుపాముల సమీపంలో జరిగిన కారు ప్రమాదం నుంచి ఐఏఎస్ అధికారిణి, ఏపీ కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ సురక్షితంగా భయటపడ్డారు. ఆకు పాముల సమీపంలో ఐఏఎస్ వాణీ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్.. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు ఐఏఎస్ వాణి ప్రసాద్‌ను సురక్షితంగా తరలించారు. మరోవైపు కారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు. -
23న దేశవ్యాప్తంగా ‘ఎర్త్ అవర్’
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎర్త్ అవర్‌లో భాగంగా...ఈ నెల 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంట పాటు విద్యుత్ దీపాలు ఆర్పేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ కోరారు. సచివాలయంలో మంగళవారం ఆమె ‘ఎర్త్ అవర్’పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎర్త్ అవర్ అనేది భూగోళం ఎదుర్కొంటున్న మూడు రకాల సంక్షోభాలను గుర్తించడానికని తెలి పారు. వాతావరణ మార్పులు, జీవ–వైవిధ్య నష్టం, పర్యా వరణ రక్షణకు... దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ సంస్థలతో పాటు ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 8.30–9.30 సమయంలో హైదరా బాద్‌లోని సెక్రటేరియట్, దుర్గం చెరువు, బీఆర్ అంబేడ్కర్, బుద్ధ విగ్రçహాలు, గోల్కొండ కోట, చార్మినార్, రాష్ట్ర గ్రంథాలయం, రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో లైట్లు ఆర్పాలని చెప్పారు. -
సివిల్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిళ్లలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందేందుకు ఈ నెల 16న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ. వాణీప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. అర్హత పొందిన అభ్యర్థులకు వచ్చే నెల ఒకటి నుంచి శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 100 మందికి విశాఖలో, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 60 మందికి రాజమండ్రిలో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 100 మందికి విజయవాడలో, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన 60 మందికి అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణా తరగతులను ఆయా జిల్లాల కలెక్టర్లు డిసెంబర్ 1 నుంచి 3లోగా ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. వీరిలోనే 33 శాతం మంది మహిళలు, 3 శాతం మంది వికలాంగులకు రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను apbcstudycircles.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చని వాణీప్రసాద్ తెలిపారు.