జలపాతం దగ్గర జోరుగా.. | jr.ntr movie janatha garage movie shooting in kerala water fall | Sakshi
Sakshi News home page

జలపాతం దగ్గర జోరుగా..

Published Thu, Aug 4 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

జలపాతం దగ్గర జోరుగా..

జలపాతం దగ్గర జోరుగా..

పచ్చదనం పరచినట్లుండే కేరళ అది. అక్కడి చాలకుడి జలపాతం మరింత సుంద రమైన ప్రదేశం. కలర్‌ఫుల్‌గా ఉండే ఆ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న ఎన్టీఆర్, సమంత ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం కోసమే ఈ ఆటా పాటా అని గ్రహించే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ఒక పాటను ఎన్టీఆర్, సమంతలపై కేరళలోని చాలకుడి జలపాతం దగ్గర చిత్రీకరిస్తున్నారు.

ఆ పాట పూర్తి కాగానే హైదరాబాద్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, కాజల్‌పై ప్రత్యేక గీతం చిత్రీకరించనున్నారు. ఇందులో నిత్యామీనన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 12న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. సినిమాను తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించినా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో సెప్టెంబరులో విడుదల చేయాలని నిర్ణయించు కున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement