
ఎన్టీఆర్, రామ్‌చరణ్
... అని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు ఒకేసారి చెబుతున్నారు సినీ ప్రేమికులు. ఇద్దరూ వెళ్తుంది ఒకే చోటుకి కదా. అందుకే ఇద్దరికీ కలిపి ఒకేసారి చెబుతున్నారు. ‘బాహుబలి’ వంటి మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమా చేశాక రామ్‌చరణ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
బుధవారం చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ కలిసి అమెరికా వెళ్తున్నారని, అక్కడ జరిగే ఫొటోషూట్‌లో పాల్గొంటారని, సినిమాను అధికారికంగా ఎనౌన్స్ చేసినప్పుడు ఆ ఫొటోలను రిలీజ్ చేస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇందులో రామ్‌చరణ్ సరసన సమంత, ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా నటించనున్నారని కొందరు గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment