
రాజమౌళి
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ల కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను రాజమౌళి రెడీ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను రాజమౌళి ఖండించకపోవటంతో ఇదే రాజమౌళి నెక్ట్స్‌ప్రాజెక్ట్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా రాశీఖన్నా ఫైనల్ అయ్యిందన్న ప్రచారం జరుగుతుండగా.. తాజాగా మరో హీరోయిన్‌గా సమంతను ఖరారు చేయాలని భావిస్తున్నారట. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాతో నటిగా మంచి మార్కులు సాధించిన సమంత మరోసారి జక్కన్న సినిమాలో నటించే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రంగస్థలం షూటింగ్ పూర్తి చేసి.. ప్రస్తుతం స్వీయ నిర్మాణంలో యు టర్న్ రీమేక్ లో నటిస్తోంది సమంత. తరువాత నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు కూడా ఓకె చెప్పిందట.
Comments
Please login to add a commentAdd a comment