Janata Garage
-
APSRTC: ఆర్టీసీ జనతా గ్యారేజ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం డిపోలు త్వరలో ‘జనతా గ్యారేజ్’లుగా మారి.. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలందించనున్నాయి. ఆదాయ వనరులను పెంపొందించుకునే ప్రణాళికలో భాగంగా జనతా గ్యారేజ్ విధానానికి ఆర్టీసీ రూపకల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలుండగా.. వాటిలో సుమారు 17 లక్షల వరకు ప్రైవేటు వాణిజ్య వాహనాలే ఉన్నాయి. వాటి యజమానులు ప్రస్తుతం ప్రైవేటు సెంటర్లలో తమ వాహనాలకు సర్వీసింగ్ చేయిస్తున్నారు. ఈ భారీ ‘సర్వీసింగ్’ మార్కెట్లోకి ఇప్పుడు ఆర్టీసీ కూడా జనతా గ్యారేజ్‌ల ద్వారా ప్రవేశించబోతోంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు కార్యాచరణ చేపట్టింది. మూడు దశల్లో 12 డిపోల్లో.. జనతా గ్యారేజ్ విధానాన్ని మూడు దశల్లో 12 డిపోల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప డిపోల్లో ప్రైవేటు వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. ఈ డిపోల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సు టైర్ల రీట్రేడింగ్ యూనిట్లున్నాయి. వీటి ద్వారా ప్రైవేటు వాహనాల టైర్లను కూడా రీట్రేడింగ్ చేసే సేవలను ప్రవేశపెడతారు. వాహనాల సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర సేవలను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం అవసరమైన అదనపు యంత్ర పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్‌కు శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఇతర సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తొలి దశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాలకు సర్వీసింగ్ సేవలందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఐటీఐ, ఆటోమొబైల్ డిప్లొమా విద్యార్థులకు అప్రెంటీస్ విధానాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డిపోలు ఉపయోగపడతాయి. రెండో దశలో విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి డిపోల్లో, మూడో దశలో శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు డిపోల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని ప్రవేశపెడతారు. మూడు నెలల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ‘జనతా గ్యారేజ్’ బ్యానర్లు
ఉండి ఎమ్మెల్యే శివరామరాజు వైఖరిపై నిరసన పాలకోడేరు : మహాప్రభో.. మా ఊరి కన్నీటి గాథలు వినరా?.. అక్రమార్కులకు అండగా నిలుస్తారా?.. ఇచ్చిన హామీలు నెలబెట్టుకోరా? ఇదేనా సంక్షేమ పాలన? అంటూ వేండ్ర గ్రామస్తులు జనతా గ్యారేజీ పేరుతో నిరసన బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు వ్యతిరేకంగా కొంతమంది గ్రామస్తులు ఈ విధంగా నిరసన ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే శివరామరాజు శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి నిరసనగా కొంతమంది వ్యక్తులు జనతా గ్యారేజ్ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. గ్రామ ప్రజల ఆరాధ్యదైవమైన గుబ్బల మంగమ్మ ఆలయానికి ఎదురుగా మద్యం షాపును ఏర్పాటు చేసి తమ ఖ్యాతేంటో నిరూపించుకున్నారు.. గతంలో పది బస్తాల బియ్యం అక్రమంగా తరలిస్తుండగా రేషన్ డీలర్‌ను పట్టుకుని అధికారులకు అప్పగిస్తే సదరు డీలర్‌పై ఏ విధమైన చర్యలు లేకుండా తిరిగి విధులు అప్పగించారంటూ ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీ అనుమతి లేనిదే అర్హులైన వారికి కార్పొరేషన్ రుణాలు ఇప్పించరా? మీ మనుషులకే ముట్టచెప్పుకుంటారా? అంటూ ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల పదవులపై, పరిశ్రమల కాలుష్యం, శ్మశానవాటిక ఆక్రమణలు, మంచినీటి సరఫరా తదితర సమస్యలను బ్యానర్లలో ప్రస్తావించారు. బ్యానర్లను చూసి టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి వెనక్కు తగ్గారు. -
ఐటమ్ అంటే ఆలోచిస్తా!
బిర్యానీ తినగానే వేసుకునే కిళ్లీ ఎంత కిక్ ఇస్తుందో... ప్రేక్షకుల్లో కొందరికి మాంచి మాస్ మసాలా సిన్మాలో ఐటమ్ సాంగులు అంతే కిక్ ఇస్తాయి. అందుకనే వాటికంత క్రేజ్! ఈ క్రేజ్‌ను కొంతమంది కథానాయికలు క్యాష్ చేసుకుంటున్నారు. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం క్రేజ్ అండ్ క్యాష్ రెండిటినీ కోరుకోవడం లేదు. ఆల్రెడీ ‘జనతా గ్యారేజ్’లో ‘పక్కా లోకల్... నేను పక్కా లోకల్’ ఐటమ్ సాంగ్ చేశారు కాజల్. ఆ తర్వాత అటువంటి అవకాశాలు చాలా వస్తే తిరస్కరించారట! కెరీర్‌పై ఐటమ్ సాంగులు ప్రభావం చూపిస్తాయని భయమా? అంటే, అదేం లేదన్నారు. ‘పక్కా లోకల్’ సాంగ్ చేయడానికి కారణం చెబుతూ... ‘‘తారక్ (ఎన్టీఆర్)తో నాకున్న ఫ్రెండ్షిప్ వల్ల చేశా. భవిష్యత్తులోనూ ఛాలెంజింగ్ ఐటమ్ సాంగులొస్తే చేస్తా. కానీ, ఒకటికి రెండుసార్లు ఐటమ్ అంటే ఆలోచిస్తా. ట్యూన్ ఎలా ఉంది? పిక్చరైజేషన్ ఎలా చేయబోతున్నారు? అనేవాటిపై నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది’’ అన్నారు. మామూలుగా బిర్యానీ తయారీకి వాడే మసాలా సరుకుల రేటు కంటే కిళ్లీ రేటు తక్కువే. కానీ, ఒక్కోసారి కిళ్లీని బట్టి రేటు పెరుగుతుంది. ఇండస్ట్రీలోనూ అంతే. సిన్మాలో హీరోయిన్ కంటే ఒక్కోసారి ఐటమ్ సాంగు చేసిన స్టార్ హీరోయిన్‌కు ఎక్కువ డబ్బులు ఇస్తుంటారు. కానీ, కాజల్ మాత్రం ‘‘నాకు ఇప్పుడు డబ్బుల కంటే మంచి పాత్రలు చేయడమే ముఖ్యం’’ అంటున్నారట!! -
స్క్రీన్ టెస్ట్
‘జనతా గ్యారేజ్’లోని ‘నేను పక్కా లోకల్...’ పాటలో మొదటి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది? ఎ) ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పుడూ... బి) వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే... సి) హలో హలో మైకు టెస్టింగ్... డి) నే ఉన్నూరు గీతదాటనే... తెలుగులో స్టీరియోఫోనిక్ సౌండ్ ఉపయోగించిన తొలి సినిమా? ఎ) సింహబలుడు బి) సింహాసనం సి) సీతారామ కల్యాణం డి) సిరివెన్నెల సుకుమార్ కథ అందించి, నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ఏ హాలీవుడ్ సినిమాకు కాపీ? ఎ) లైలా సేస్ బి) షెర్లాక్ హోమ్స్ సి) ప్రెట్టి విమెన్ డి) వాలంటైన్స్ డే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితే... ఆయన రాసిన మాటలే గుర్తొస్తాయి. కానీ, రవితేజ హీరోగా నటించిన ఓ సినిమాలోని పాటలన్నిటినీ త్రివిక్రమ్ రాశారు. చక్రి సంగీతం అందించిన ఆ సినిమా పేరు? ఎ) ఔను–వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! బి) భగీరథ సి) ఒక రాజు ఒక రాణి డి) ఇడియట్ ‘మగధీర’లోని ‘ఒక్కొక్కర్ని కాదు షేర్‌ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపు’ అనే డైలాగ్‌కి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేసిన ఫైట్ మాస్టర్ ఎవరు? ఎ) రామ్–లక్ష్మణ్ బి) అణల్ అరసు సి) పీటర్ హెయిన్స్ డి) కణల్ కన్నన్ సీనియర్ ఎన్టీఆర్ టార్జాన్‌గా నటించిన సినిమా? ఎ) రాజపుత్ర రహస్యం బి) సింహబలుడు సి) గులేబకావళి కథ డి) గండికోట రహస్యం రవితేజకు ఓ సెంటిమెంట్ ఉంది. అతని ప్రతి సినిమాలోనూ (దాదాపుగా) ఓ వ్యక్తి కనీసం ఒక్క సీన్లోనైనా, ఒక్క ఫ్రేమ్‌లోనైనా కనిపిస్తారు. అతడెవరు? ఎ) నటుడు బ్రహ్మాజీ బి) రవితేజ సై్టలిస్ట్ సి) నటుడు ‘ఫిష్’ వెంకట్ డి) రవితేజ పర్సనల్ అసిస్టెంట్ శీను యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పలు నవలలు సినిమాలుగా రూపొందాయి. అయితే... ఓ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కథ రాశారు. ఆ సినిమా పేరేంటి? ఎ) దొంగ మొగుడు బి) కాష్మోరా సి) థ్రిల్లర్ డి) విక్కీ దాదా హీరో నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్’ దర్శకుడు? ఎ) వి. మధుసూదన రావు బి) వీబీ రాజేంద్రప్రసాద్ సి) క్రాంతికుమార్ డి) దాసరి నారాయణరావు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన చివరి సినిమాలో హీరో? ఎ) మాధవన్ బి) ప్రకాశ్‌రాజ్ సి) ఉదయ్‌కిరణ్ డి) ప్రభు జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్? ఎ) కాజల్ అగర్వాల్ బి) జెనీలియా సి) సమంత డి) సమీరారెడ్డి సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ దర్శకునిగా పరిచయమైన సినిమా? ఎ) ఒకరికి ఒకరు బి) భగీరథ సి) సంగమం డి) గులాబీ ప్రకాశ్‌రాజ్‌కు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన కృష్ణవంశీ సినిమా? ఎ) అంతఃపురం బి) ఖడ్గం సి) శ్రీ ఆంజనేయం డి) చక్రం ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఏ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఓ పాట కంపోజ్ చేశారు? ఎ) చిత్రం బి) ఫ్యామిలీ సర్కస్ సి) నీ కోసం డి) నువ్వు నేను నాగచైతన్యకు పేరు తీసుకొచ్చిన ‘ఏమాయ చేసావె’ తమిళ వెర్షన్లో హీరో? ఎ) శింబు బి) ఆర్య సి) కార్తీ డి) భరత్ పవన్‌కల్యాణ్ మొదటి భార్య పేరు? ఎ) రేణూ దేశాయ్ బి) నళిని సి) నందిని డి) నీలవేణి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎక్కువ సినిమాలు తీసింది హీరో రవితేజతోనే. ఇద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలొచ్చాయి? ఎ) నాలుగు బి) ఐదు సి) ఆరు డి) ఏడు హీరోయిన్ స్నేహ అసలు పేరేంటి? ఎ) రాధిక బి) సుహాసిని సి) రాధ డి) సుజాత ‘కళ్ల కింద క్యారీ బ్యాగులు...’ అనే డైలాగ్ ఏ కమెడియన్ని ఉద్దేశించి చెప్పినది? ఎ) బ్రహ్మానందం బి) కొండవలస సి) సుత్తివేలు డి) ఎమ్మెస్ నారాయణ హీరోయిన్ కాకముందు అనుష్క యోగా టీచర్ అనే సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె స్కూల్లో పిల్లలకు పాఠాలు కూడా చెప్పారు. అనుష్క ఏ తరగతి టీచర్‌గా పని చేశారు? ఎ) రెండో తరగతి బి) మూడో తరగతి సి) నాలుగో తరగతి డి) ఐదో తరగతి -
ఆ కథకే గ్రీన్ సిగ్నల్?
ఎన్టీఆర్ కొత్త సినిమా కబురు ఎప్పుడు చెబుతారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులు అరవై రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అరవై ఏంటనుకుంటున్నారా? ఎన్టీఆర్ ఇటీవల నటించిన ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబర్ 1న విడుదలైంది. అంటే.. అప్పుడే అరవై రోజులు దాటింది. దాంతో ఈ హీరోగారు చేయబోయే తదుపరి సినిమా ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అగ్ర దర్శకులు పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల నుంచి యువ దర్శకులు ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి, ‘ప్రేమమ్’తో హిట్ అందుకున్న చందూ మొండేటిల వరకూ పలువురి పేర్లు ఎన్టీఆర్‌తో సినిమా చేయబోయే దర్శకుల జాబితాలో వినిపించాయి. మొత్తానికి ప్రచారంలో చాలా కాంబినేషన్లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఈ కాంబినేషన్లలో సెట్స్‌పై వెళ్లేది ఏది? సైడ్ రూట్లోకి వెళ్లేది ఏది? ప్రశ్నలు ఎన్నో... ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ రెండు నెలల్లో ఈ యంగ్ హీరో పలు కథలు విన్నారు. అందులో ఎన్టీఆర్‌కి నచ్చినవి కొన్ని ఉన్నాయట. కానీ, ప్రస్తుతం సెట్స్‌పైకి వెళ్లేది మాత్రం అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌కు ‘పటాస్’ వంటి కమర్షియల్ హిట్ అందించిన అనిల్ రావిపూడి కథేనట. ఓ వారం రోజులుగా ఈ కథపైనే ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడిలు డిస్కషన్స్ చేస్తున్నారట. ‘దిల్’ రాజు ఈ సినిమా నిర్మిస్తారని టాక్. ఇందులో అంధుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. కమర్షియల్ హంగులతో కూడిన వైవిధ్యమైన సినిమాగా తెరకెక్కించనున్నారట. ఇదిలా ఉంటే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అదుర్స్-2’ చేయనున్నారనీ... ఎన్టీఆర్ ఖాళీగా ఉన్న ప్రతిసారీ ఈ రెండు వార్తలూ వినిపిస్తుంటాయి. ఇవి పక్కన పెడితే.. దర్శకుడు చందూ మొండేటి చెప్పిన లైన్ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి.. వినాయక్, త్రివిక్రమ్‌లతో ఎప్పుడు? చందూ సినిమా ఎప్పుడు? అనేది వేచి చూడాలి. -
అలాంటి పాత్రలు రావడం కష్టమే
దక్షిణాదిలో హీరోయిన్లకు అర్ధవంతమైన పాత్రలు చేసే అవకాశం రావడం చాలా కష్టమేనని చెన్నై చంద్రం సమంత వ్యాఖ్యానించారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా చేయకుండా చాలా రిలాక్స్‌గా ఉన్నారు. ఈ మధ్య సమంత తెలుగు, తమిళ భాషల్లో నటించిన చిత్రాలన్నీ విశేష ప్రేక్షకాదరణను పొందాయన్నది గమనార్హం. ఇటీవల తన జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన జనతాగ్యారేజ్ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. పలు అవకాశాలు వస్తున్నా అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమంతపై పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ఈ అమ్మడి వీర ప్రేమగాథ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇక పీపీపీ..డుండుండుంమే తరువాయి అన్న ప్రసారం జోరుగా సాగుతోంది. అందుకే కొత్త చిత్రాలను సమంత అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే సమంత వివరణ వేరేలా ఉంది. తాను క్షణం తీరిక లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నానని, అందుకే కాస్త విశ్రాంతి అవసరం అనిపించి చిత్రాలను అంగీకరించడం లేదనీ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. తాజాగా దక్షిణాదిలో హీరోయిన్లకు అర్థవంతమైన పాత్రలు లభించడం కష్టమనే విషయం అర్థమైందన్నారు. అలాంటి పాత్రలు రాకపోవడంతోనే అంగీకరించడం లేదని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సమంతతో వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని శనివారం చెన్నైకి వచ్చిన నాగచైతన్య మీడియాతో వెల్లడించారు. ఇక సమంత విషయానికి వస్తే తమిళంలో శివకార్తికేయన్ సరసన ఒక చిత్రం చేయడానికి అంగీకరించారు. పొన్రామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. -
నో ఐటమ్ సాంగ్స్
ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయనంటున్నారు నటి కాజల్ఆగర్వాల్. టాప్ హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌లో నటించడం అన్న సంస్కృతి తొలుత బాలీవుడ్లో మొదలై ఆ తరువాత దక్షిణాదికి పాకింది. ఇప్పుడిక్కడ అది సర్వసాధారణంగా మారింది. రెండు మూడు కాల్షీట్స్తో పాటను పూర్తి చేయడం, అందుకు సుమారు అర కోటికిపైగా పారితోషకం ముడుతుండడంతో టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సై అంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్రేజీ భామలు శ్రుతిహసన్, తమన్నా, అనుష్క లాంటి వారు ఐటమ్‌సాంగ్స్‌కు ఆడేశారు. తాజాగా నటి కాజల్‌అగర్వాల్ కూడా తానేమీ తక్కువాఅన్నట్టు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు అంగాంగ ప్రదర్శన చేసేశారు. కాజల్‌అగర్వాల్ ఐటమ్‌సాంగ్‌ను యువత బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ చేయడాన్ని ఎగతాళి చేస్తున్నారట. ఈ విషయం ఆమె చెవిన పడింది. దీంతో కాస్త హర్ట్ అయిన కాజల్ తాను నటించిన సాంగ్ ను ఐటమ్ సాంగ్ అనడం సబబు కాదని, అది ప్రత్యేక గీతం అని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆ పాటలో నటించడంలో మరిన్ని అలాంటి అవకాశాలు వస్తున్నాయన్నారు. తాను జనతాగ్యారేజ్ చిత్రంలో స్నేహం కోసమే ప్రత్యేక పాటలో నటించానని తెలిపారు. ఇకపై అలాంటి సింగిల్ సాంగ్స్‌లో నటించన ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు జీవాకు జంటగా కవైలైవేండామ్ చిత్రంతో పాటు, అజిత్ తాజా చిత్రంలోనూ, అదే విధంగా తెలుగులో మెగాస్టార్‌తో ఖైదీ నంబర్ 150 చిత్రంతో పాటు దర్శకుడు తేజా దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇక విక్రమ్‌కు జంటగా నటించే అవకాశం కాజల్‌ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. -
‘గ్యారేజ్’పై రాజకీయం!
- గతంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకూ ఇలానే అడ్డంకులు - బాలకృష్ణ, లోకేశ్ తీరుపై జూనియర్ అభిమానుల ఫైర్ - కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరికలు - సీఎం వద్ద పంచాయితీ.. ఎట్టకేలకు అనుమతి సాక్షి, అమరావతి: జూనియర్ ఎన్టీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమాకు థియేటర్ల కోసం జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి ఆటంకాలు కల్పించడం అప్పట్లో దుమారానికి దారితీసింది. తాజాగా సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోకు అడ్డంకులు కల్పించేలా తెరవెనుక రాజకీయం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హెచ్చరికలతో ఆ వ్యూహం ఫలించలేదు. నందమూరి తారక రామారావు సొంత జిల్లాలోనే జూ.ఎన్టీఆర్ సినిమాకు బ్రేకులు వేయాలని చూడటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తే మచిలీపట్నం కలెక్టరేట్, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాల వద్ద ధర్నాకు దిగుతామంటూ జూనియర్ అభిమానులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులను కలిసి హెచ్చరించారు. ఇది మరో వివాదంగా టీడీపీ మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఎట్టకేలకు మంగళవారం రాత్రి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల 31 అర్ధరాత్రి దాటిన తరువాత జిల్లా వ్యాప్తంగా జనతా గ్యారేజ్ సినిమా 34 బెనిఫిట్ షోలు ప్రదర్శనకు అనుమతించాలని మూడు రోజుల క్రితమే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను డిస్ట్రిబ్యూటర్లు రాతపూర్వకంగా కోరారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతిలేదంటూ కృష్ణా జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూటర్లకు మంగళవారం ఉదయం మౌఖికంగా చెప్పడంతో వివాదానికి దారితీసింది. సొంత సామాజికవర్గానికి చెందిన కొందరు ఈ వ్యవహారాన్ని మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి వద్దకు తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. సినిమా బెనిఫిట్ షో అనుమతి నిరాకరణ వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉండటంతో మంత్రులు సైతం మౌనముద్ర దాల్చినట్టు సమాచారం. చివరకు చంద్రబాబు వద్దకే ఈ పంచాయితీ వెళ్లింది. జూనియర్ సినిమాను అడ్డుకుంటే బాలకృష్ణ, లోకేశ్ ఇలా చేశారని ప్రజలు విశ్వసిస్తారని, ఇది మంచిది కాదని సొంత సామాజికవర్గానికి చెందిన పలువురు చెప్పినట్లు సమాచారం. -
జలపాతం దగ్గర జోరుగా..
పచ్చదనం పరచినట్లుండే కేరళ అది. అక్కడి చాలకుడి జలపాతం మరింత సుంద రమైన ప్రదేశం. కలర్ఫుల్గా ఉండే ఆ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న ఎన్టీఆర్, సమంత ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం కోసమే ఈ ఆటా పాటా అని గ్రహించే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ఒక పాటను ఎన్టీఆర్, సమంతలపై కేరళలోని చాలకుడి జలపాతం దగ్గర చిత్రీకరిస్తున్నారు. ఆ పాట పూర్తి కాగానే హైదరాబాద్ షెడ్యూల్లో ఎన్టీఆర్, కాజల్‌పై ప్రత్యేక గీతం చిత్రీకరించనున్నారు. ఇందులో నిత్యామీనన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 12న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. సినిమాను తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించినా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో సెప్టెంబరులో విడుదల చేయాలని నిర్ణయించు కున్నారు. -
జనతా గ్యారేజ్‌కు మరింత గ్లామర్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్నలేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్. సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాను తీసుకున్నారు. ఇప్పటికే ఊసరవెళ్లి సినిమాలో బుడ్డోడితో కలిసి చిందేసిన ఈ బ్యూటి మరోసారి స్పెషల్ సాంగ్ కోసం ఎన్టీఆర్‌తో కలిసి ఆడి పాడేందుకు రెడీ అవుతోంది. అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌తో అలరించిన ఈ బ్యూటి ఇప్పుడు జనతా గ్యారేజ్‌కు మరింత గ్లామర్ యాడ్ చేయనుంది. -
అభిమానులకు సారీ...!
ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు దర్శక- నిర్మాతలు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత, నిత్యామీనన్ కథానాయికలు. మోహన్‌లాల్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదలను వాయిదా వేసిన విషయం గురించి చెప్పడానికి శుక్రవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. కొరటాల శివ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్ సినిమా విడుదల వాయిదా పడిందంటే అభిమానులు బాధపడతారు. వాళ్లకు సారీ చెబుతున్నాం. మంచి కథ, ఎమోషన్స్‌తో సినిమా అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్ ఫర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. వర్షం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 12నే విడుదల చేయాలంటే హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో లేకుంటే కంటెంట్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే సినిమాను కంప్లీట్ క్వాలిటీతో తీసుకు రావాలని వాయిదా వేస్తున్నాం. సెప్టెంబర్ 2న ‘జనతా గ్యారేజ్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మరో పదిరోజులు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుంది. ఫస్ట్ లుక్, టీజర్‌తో ‘జనతా గ్యారేజ్’ పై అంచనాలు బాగా పెరిగాయి. వాటిని అందుకోవాలంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరం. సాంకేతికంగా మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తాం’’ అన్నారు. ఇదిలా ఉంటే.. కొరటాల శివ గత చిత్రాలు ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ కూడా వాయిదాలు పడి సూపర్ హిట్ అవడం గమనార్హం. -
జనతా గ్యారేజ్ టీజర్ వచ్చేసింది
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. ఈ యంగ్ టైగర్ నటిస్తున్న జనతా గ్యారేజ్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అని టైటిల్‌కి క్యాప్షన్‌గా పెట్టారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్ లో ఈ టీజర్ వీడియో హల్ చల్ చేస్తోంది. జనతా గ్యారేజ్ టీజర్ అంటూ హీరో ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. లేటెస్ట్ టీజర్ గమనిస్తే.. 'బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ సమ్ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఓ బలవంతుడు ఉంటాడు. జనతా గ్యారేజ్ ఇచట అన్నీ రిపేర్ చేయబడును' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ టీజర్ చూసినట్లయితే ఎన్టీఆర్ మరో మాస్ యాక్షన్ మూవీతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. A glimpse of our GARAGE #JanathaGarageTeaser https://t.co/lTJKP0Uh0Q — tarakaram n (@tarak9999) 6 July 2016 -
పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో చైతూ
యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మళయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్‌పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటీ మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. దీంతో ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
సెప్టెంబర్‌లో ప్రేమమ్
యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేమమ్. మళయాలంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటి మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. అందుకే ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
తమిళ తంబీలు ఖుష్!
అది ఎగ్మోర్. చెన్నైలో ఉన్న ఫేమస్ ఏరియాల్లో అదొకటి. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. గత వారం రోజుల్లో ఆ సందడి రెట్టింపయింది. దానికి కారణం మన చిన్న ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం షూటింగ్ ఎగ్మోర్‌లోని మెమోరియల్‌లో జరిగింది. అక్కడ షూటింగ్ జరుగుతోందని తెలిసి, చుట్టుపక్కల జనాలు గుమిగూడిపోయారట. అదేం పెద్ద విశేషం కాదు. షూటింగ్ అంటే ఆ హడావిడి ఉంటుంది. కానీ, ఎన్టీఆర్‌ని చూడ్డానికి ఏకంగా క్యూలో నిలబడటం విశేషం. గంటలు గంటలు క్యూలో నిలబడి, ఎన్టీఆర్‌ని కలిసిన తర్వాతే వెళ్లారట. ఒక తెలుగు హీరోకి పొరుగు రాష్ట్రంలో ఆ స్థాయి ఆదరణ అంటే మామూలు విషయం కాదు. గత నెల 27న చెన్నైలో షూటింగ్ మొదలైంది. దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ వారం రోజులూ భారీగా జనాలు వచ్చేవారని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రహ్మాజీ అన్నారు. వీలు చేసుకుని ఎన్టీఆర్ ఆటోగ్రాఫులూ, ఫొటోగ్రాఫులూ ఇచ్చి, తమిళ తంబీలను ఖుష్ చేశారట. అఫ్కోర్స్ తంగచ్చీ (చెల్లెళ్లు)లు, అక్కలకు కూడా ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్‌లిచ్చి, ఫొటోలు దిగారనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
నాలుగు కథలు.... ఒకటే ప్రపంచం
మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ‘మనమంతా’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సాహసం’ చిత్రాల ఫేమ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాయిశివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి దీన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటి గౌతమి కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘‘‘నాలుగు కథలు ఒకటే ప్రపంచం’ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహేశ్ శంకర్, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్. -
ఇచట అన్ని పాత్రలూ చేయబడును!
కొన్ని సినిమాలకు ఊహించనంత హైప్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలైతే కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ గుమ్మడికాయ కొట్టేవరకూ రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతుంటాయ్. ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఇచట అన్నీ రిపేర్లు చేయబడును’ అని టైటిల్‌కి క్యాప్షన్‌గా పెట్టారు. దీన్నే ఎన్టీఆర్లోని నటుడికి అన్వయిస్తే.. ‘ఇచట అన్ని పాత్రలూ చేయబడును’ అనొచ్చు. యస్.. ఏ తరహా పాత్రను అయినా ఎన్టీఆర్ చేయగలరు. ‘‘నువ్వు పెద్దయ్యాక పెద్ద హీరో అవుతావు’’ అని ఆనాడు పెద్ద ఎన్టీఆర్ తన మనవడు చిన్న ఎన్టీఆర్ నుదుట తిలకం దిద్దినప్పుడు దేవతలు ‘తథాస్త్తు’ అని ఉంటారేమో. తాతకి తగ్గ మనవడు అని నిరూపించేసుకున్నారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో బాలనటుడిగా భేష్ అనిపించుకుని, చిన్న రాముడిగా ‘రామాయణం’లో శభాష్ అనిపించుకున్నారు. టీనేజ్‌లో ‘నిన్ను చూడాలని’ ద్వారా హీరోగా పరిచయమైనప్పుడు, అచ్చంగా పెద్ద ఎన్టీఆర్ రూపు రేఖలతోనే చిన్న ఎన్టీఆర్ ఉండటంతో నందమూరి అభిమానులు మురిసిపోయారు. ‘ఆది’తో తిరుగు లేని మాస్ హీరో అనిపించేసుకున్నారు. ‘సింహాద్రి’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేస్తూనే, ‘యమదొంగ’లో పౌరాణిక గెటప్లోనూ కనిపించి, అలరించారు. ‘బృందావనం’లో అప్పటివరకూ ఉన్న ఇమేజ్‌కి భిన్నంగా లవర్ బాయ్‌లా కనిపించి, ఆకట్టుకున్నారు. ఇక, ‘అదుర్స్’లో చేసిన రెండు పాత్రల్లో బ్రాహ్మణ యువకుడిగా ఎన్టీఆర్ నటన సుపర్బ్. ‘నాన్నకు ప్రేమతో’లో డిఫరెంట్ లుక్‌లో కనిపించి, తనలో క్లాస్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు. హీరోగా పదిహేనేళ్ల కెరీర్లో దాదాపు పాతిక సినిమాలకు పైగా చేశారు ఎన్టీఆర్. కెరీర్ ఆరంభించినప్పుడు ఎంత జోష్‌గా ఉన్నారో ఇప్పుడూ అంతే జోష్‌గా కొనసాగుతున్నారు. -
జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ తో వచ్చేశాడు..
జనతా గ్యారేజ్ ఫస్ట్‌లుక్‌తో నందమూరి అందగాడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకొచ్చేశాడు. ఒకరోజు ముందుగానే తన అభిమానులకు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశాడు. తన తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌ను 'జనతా గ్యారేజ్' ఫస్ట్‌లుక్ అంటూ ఎన్టీఆర్ గురువారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ నెల 20న (శుక్రవారం) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు జనతా గ్యారేజ్ కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. గడ్డంతో బైక్‌పై మాస్ లుక్‌తో కనిపించిన ఎన్టీఆర్ పోస్టర్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. (చదవండి....స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..!) నాన్నకు ప్రేమతో చిత్రం సక్సెస్‌తో మంచి జోరులో ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. అంతేకాదు ఈ నెల 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ టీజర్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి ఆగస్టులో సినిమా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు యూనిట్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదలను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ గత చిత్రాలు ఓవర్సీస్లో మంచి వసూళ్లు సాధించటంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జనతా గ్యారేజ్ ఆడియోలో అమెరికాలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. Here it is. #JanathaGarage1stLook pic.twitter.com/lv9y5Ig99k — tarakaram n (@tarak9999) 19 May 2016 -
స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..!
అభిమాన కథానాయకుడి పుట్టినరోజు అంటే అభిమానులు ఆ హీరో నుంచి కొత్త సినిమా ప్రకటనో, చేస్తున్న సినిమా తాలూకు ఫస్ట్ లుక్కో, టీజరో - ఏదో ఒకటి ఎదురు చూస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే హీరోలు కూడా బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. చిన్న ఎన్టీఆర్ అలానే అనుకున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. మామూలుగా ఫస్ట్ లుక్ అంటే.. సినిమాలో అదిరిపోయే ఫొటో ఏదైనా విడుదల చేస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉంటుంది. కానీ, ప్రత్యేకంగా ఫొటోసెషన్ చేసి, విడుదల చేయడం విశేషం. బాలీవుడ్‌లోని ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ ఇటీవల ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి, ఈ ఫొటోసెషన్ చేశారు. అచ్చంగా అభిమానులు పండగ చేసుకునే రేంజ్లో ఆ ఫొటోలు ఉన్నాయట. ఈ నెల 19న సాయంత్రం ఆరు గంటలకు ఈ లుక్‌ని విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సి.వి. మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని చిలుకూరులో జరుగుతోంది. సమంత, నిత్యామీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్, మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
బుడ్డోడికి భారీ టార్గెట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమా జోరు మీద ఉన్నాడు. తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా వరుస సక్సెస్‌లు సాధించిన జూనియర్, ప్రస్తుతం ఓ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు దక్షిణాది టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో జనతా గ్యారేజ్ మాలీవుడ్‌లో కూడా మంచి బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే 65 కోట్ల వరకు బిజినెస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ దాదాపు 70 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా హిట్ లిస్ట్‌లోకి చేరుతోంది. నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో కూడా భారీ బడ్జెట్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డ జూనియర్ ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి అనుకున్నట్టుగా జనతా గ్యారేజ్‌తో 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్‌లో స్థానం సంపాదిస్తాడేమో చూడాలి. -
ఎన్టీఆర్ కి మరోసారి!
ఓ స్టార్ హీరో సినిమాకు, మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది. అలా పవన్‌కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రాలకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. దర్శక-నిర్మాతలు, హీరోలతో ఉన్న అనుబంధం దృష్ట్యా మహేశ్ ఆ సినిమాలకు తన గొంతు వినిపించారు. ఇటీవలే తన తండ్రి కృష్ణ కథానాయకునిగా నటించిన ‘శ్రీశ్రీ’ చిత్రానికి కూడా మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి మహేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే వార్త ఫిలింనగర్లో జోరుగా షికార్లు చేస్తోంది. మహేశ్ హీరోగా ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేశ్‌తో కొరటాలకు మంచి అనుబంధం ఏర్పడింది. సో.. ‘జనతా గ్యారేజ్’కి నిజంగానే వాయిస్ ఓవర్ అవసరమైతే మహేశ్ కాదనరేమో! -
రోళ్లు పగిలే రోల్
రోహిణీ కార్తె ఇంకా రాలేదు.. కానీ, ఎన్టీఆర్ వచ్చేశాడు... వట్టి సన్ కాదు కదా! గ్రాండ్ సన్... మంచి వేడి మీద ఉన్నాడు.. కాక పుట్టించేస్తాడు... సమ్మర్ ధమాకా ‘‘సినిమా స్టార్స్కేంటి బావా.. ఏసీ గదుల్లో ఉంటారు. పడవలాంటి కారుల్లో తిరుగుతారు. గంట గంటకీ పండ్ల రసాలు తాగుతారు. అడుగులకు మడుగులొత్తే సేవకులు ఉంటారు. మొత్తం మీద సినిమావోళ్ల జీవితం యమా సుఖంగా ఉంటుందనుకో.. ఏదోటి చేసేసి సినిమా స్టార్ అయిపోతే వైభవంగా బతికేయచ్చనుకో.’’ ‘‘భలే చెప్పావ్ బామ్మర్దీ. అయితే నీకు వాళ్లు పడే కష్టం తెలియనట్లుంది. ఇప్పుడు మనిద్దరం ఇలా చెట్టు నీడన కూర్చుని మాట్లాడుకుంటున్నామా? సినిమా స్టార్స్ ఏం చేస్తున్నారో తెలుసా? ఎర్రటి ఎండలో షూటింగులు చేసేస్తున్నారు.’’ ‘‘గొప్పేలే... ఇట్టా ఓ సీన్ చేస్తారు.. అట్టా ఎల్లి హాయిగా ‘కార్వాన్’లో కూర్చుంటారు. సీన్ సీన్‌కి మధ్యలో గొడుగులు పట్టేవాళ్లూ ఉంటారు.. ముందది తెలుసుకో బావా.’’ ‘‘ఓరి నా ఎర్రి బామ్మర్దీ. నువ్వు ఓ యాంగిల్లోనే చూస్తున్నట్లున్నావ్. ఇంకో యాంగిల్లో వాళ్లు పడే కష్టం నీకు తెలియనట్లుంది. చెప్తా తెలుసుకో. ఎన్టీఆర్ ఉన్నాడే.. ‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం ఇప్పుడు ఎర్రటి ఎండలో ఎగాదిగా షూటింగ్ చేసేస్తున్నాడు. హైదరాబాద్ శివార్లలో ఓ పేద్ద క్వారీ ఉంది. చుట్టూ కొండలు, ఇసుక, దుమ్ము, ధూళీ తప్ప ఒక్క చెట్టు కూడా కనబడదు. చెట్టే లేనప్పుడు ఇంక నీడెక్కడ ఉంటుంది? గొడుగు కూడా ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేక తనకు కూడా ఎవరైనా గొడుగు పడితే బావుండుననుకుంటుంది. ఫ్యానూ ఏసీలూ కూడా కూలింగ్ ప్రొడ్యూస్ చేయలేక కకావికలమైపోతున్నాయి. దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎండ ఏ రేంజ్లో ఉందో. మామూలుగానే హీట్ ఎక్కువంటే, దానికి తోడు ఈ కొండల రిఫ్లెక్షన్ తోడై త్రిబుల్ హీట్ ఉంది. అలాంటి చోట ‘జనతా గ్యారేజ్’ షూటింగ్. సమ్మర్ మరీ ఇంతలా బరి తెగిస్తుందని తెలియక, మూడు నెలల ముందే ఇలా షెడ్యూల్ ప్లాన్ చేసేశారు. ఏ మాత్రం మార్చలేని పరిస్థితి. పోనీ నైట్ షూటింగ్ చేద్దామంటే, సెక్యూర్టీ ప్రాబ్లమ్స్. చచ్చినట్టు ఈ ఎండలో షూటింగ్ చేయాల్సిందే. పోనీ.. ఇలా సీన్ చేసేసి అలా కార్వాన్లోకి దూరిపోదామంటే.. అది కంటికి కనిపించనంత దూరంలో ఉంది. షూటింగ్ లొకేషన్ దగ్గరే దాన్ని పెడదామంటే కుదరదట. అందుకే చిన్న టెంటు ఏర్పాటు చేశారు. సూరీడు భగభగల ముందు ఆ టెంటు ఎంత? ఇంకో విషయం చెప్పనా? అసలా క్వారీకి వెళ్లే రోడ్డు ఉందే.. అది చాలా దారుణం. ఎంత పడవలాంటి కారుకి అయినా కుదుపులు తప్పవు. ఒళ్లు హూనం అయిపోవాల్సిందే. ఒక్కసారి వెళ్లినవాళ్లు ఇంకోసారి వెళ్లకూడదనుకుంటారు. అలాంటిది ఏకంగా ఐదు రోజులు ఆ క్వారీలోనే షూటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పు.. సినిమావోళ్లకి సుఖం, కష్టం సమానంగా ఉంటాయా? కాదా?’’ ‘‘కరెక్టే బావా.. పైకి సుఖాలే కనిపిస్తాయి కానీ, ఇలాంటి కష్టాలు మాలాంటోళ్లకి తెలీవు కదా. అది సరే.. ఇప్పుడు క్వారీలో ఏ సీన్స్ తీస్తున్నారో తెలిస్తే కొంచెం చెప్పరాదేంటి..?’’ ‘‘చెప్తా.. చెప్తా... ఓ గంట గంటన్నర సినిమా చూశాక మనం సమోసాలు తినడానికి వెళ్లే ముందు ఒక్కసారిగా ఏదో కుదుపులాంటి సీన్‌ని తెరపై వదులుతారే.. దాన్ని ఇంటర్వెల్ అంటారు కదా.. ఇప్పుడు దానికి సంబంధించిన సీన్లే తీస్తున్నారు. చూసే కొద్దీ చూడబుద్ధేసేలా ఉంది షూటింగ్. ఎన్టీఆర్ రెచ్చిపోయి యాక్ట్ చేసేస్తున్నాడు. ఎవరో మలయాళ నటుడంట. ఉన్ని ముకుందన్ అతను కూడా ఉన్నాడు. ఇంకా రెండు వందల మంది దాకా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలతో మనలాంటి మాస్గాళ్లకు విందు భోజనం పెట్టిన డెరైక్టర్ కొరటాల శివ ఈ సీన్లు భలే బ్రహ్మాండంగా తీస్తున్నాడు. కానీ, చాలా బాధగా ఉంది బామ్మర్దీ.’’ ‘‘బాధా... ఎందుకు బావా?.. అదే ఐదు రోజులూ ఈ షూటింగ్ చూడాలనుకున్నా. కానీ, ఒక్కరోజుకే ఎండలో నావల్ల కాలేదు. ఇక నాలుగు రోజులు అక్కడికెళ్లాలంటే కష్టమే. అవును బావా... ఎండలు మామూలుగా లేవు. అయినా చల్లబడ్డాక తీసుకోవచ్చు కదా. ఇంకో రెండు నెలలాగితే సూరీడు ఎలాగూ శాంతిస్తాడుగా..’’ ‘‘నా బుర్ర తక్కువ బామ్మర్దీ.. ఆగస్ట్ 12న సినిమాని రిలీజ్ చేసేస్తామని చెప్పేశారు కదా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే షూటింగ్ చేయాల్సిందే. సినిమావోళ్లకి ఎండా, వానా, చలి లెక్కుండదు. రాత్రీ పగలూ కూడా ఉండదు. చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేసేయాలి. అందుకే ఏవీ పట్టించుకోకుండా షూటింగ్‌లు చేసేస్తారు. అంత కష్టపడతారు కాబట్టే కోట్లు సంపాదిస్తారు.’’ ‘‘ఇన్ని విషయాలు చెప్పావు కదా బావా.. ఇంతకీ ఎన్టీఆర్ ఎన్ని కోట్లు తీసుకుంటాడంటావ్..’’ ‘‘ఆ సంగతి చెబ్తే నీడలో ఉన్న నువ్వు వడదెబ్బ తగిలినట్లు పడిపోతావ్... ఇక పోదాం పద...’’ -
పాత లుక్‌లో జూనియర్
గత కొద్ది రోజులుగా తన లుక్ విషయంలో ప్రయోగాలు చేస్తున్న ఎన్టీఆర్, ప్రస్తుతం చేస్తున్న జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రయోగం చేయటం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా ఉంగరాల జుట్టుతో, వత్తయిన గెడ్డంతో కనిపించిన జూనియర్, కొన్ని సినిమాల్లో మాత్రం డిఫరెంట్ లుక్‌ని ట్రై చేశాడు. ముఖ్యంగా ఇటీవల కాలం ప్రతి సినిమాకు భారీ వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. బాద్ షా సినిమాలో స్ట్రయిట్నింగ్ చేయించిన హెయిర్ స్టయిల్‌తో స్టైలిష్‌గా కనిపించిన జూనియర్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించాడు. ఆ తరువాత టెంపర్ సినిమా కోసం మరోసారి ప్రయోగం చేశాడు. ఈ సినిమాలో పోలీస్ హెయిర్ కట్‌తో రఫ్ లుక్‌లో కనిపించిన జూనియర్ భారీ సక్సెస్‌ను నమోదు చేశాడు. అదే జోరులో నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా కొత్త అవతారంలో కనిపించాడు. పూర్తి వెస్ట్రన్ లుక్‌లో కనిపించి మెప్పించాడు. అయితే ఇలా వరుసగా తన ప్రతీ సినిమాకు లుక్ మారుస్తూ వచ్చిన జూనియర్ నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం పాత లుక్‌లోనే కనిపిస్తున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలకు పోవటం లేదు. మాస్ కమర్షియల్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాత లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ దిగిన ఫోటోతో ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. -
'జనతా గ్యారేజ్'లో సుహాసిని
నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేస్తూ సినిమా కాస్టింగ్‌ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మరో సీనియర్ నటి జనతా గ్యారేజ్ టీంతో జాయిన్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రాఖీ, బాద్ షా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సుహాసిని, జనతా గ్యారేజ్‌లోనూ నటించనుంది. ఈ సినిమాలో మోహన్ లాల్‌కు జోడిగా సుహాసినిని ఎంపిక చేశారు. ముందుగా ఈ పాత్రకు తమిళ నటి దేవయానిని సంప్రదించినా, చివరి నిమిషంలో సుహాసినిని ఫైనల్ చేశారు. గతంలో ఎన్టీఆర్, సుహాసిని కలిసి నటించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో సెంటిమెంట్ పరంగా కూడా జనతా గ్యారేజ్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
రెండు నెలల్లో సందడే సందడి!
ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా బెంగగా ఉంటుంది. ఇప్పుడు సమంత పరిస్థితి అదే. మొత్తం అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీటిలో తెలుగులో మూడు, తమిళంలో మూడు. ఆరు చిత్రాలకు తేదీలివ్వడం అంటే ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్‌కి దూరమైనట్లే. కానీ, పనిని ప్రేమించే సమంత అదేం పట్టించుకోకుండా హ్యాపీగా షూటింగ్‌లు చేస్తున్నారు. కానీ, ఇంటి మీద కాస్తంత బెంగగా ఉందట. ఆ బెంగ కొంచెం తగ్గాలంటే గులాబ్ జామ్ తింటానంటున్నారామె. బెంగకీ, గులాబ్ జామ్కీ లింకేంటి అనుకుంటున్నారా? ఏమో.. అవి తింటే సమంతకు బెంగ పోతుందట. ఆ సంగతలా ఉంచితే... ఏప్రిల్, మేలో సమంత బాగా సందడి చేయనున్నారు. ఎందుకంటే, ఆమె నటించిన నాలుగు సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదలవుతాయి. మహేశ్‌బాబు సరసన నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’, నితిన్ పక్కన చేస్తున్న ‘అ..ఆ’ వేసవికి విడుదలవుతాయి. అలాగే, తమిళంలో సూర్య సరసన నటిస్తున్న ‘24’, విజయ్‌కి జోడీగా యాక్ట్ చేస్తున్న ‘తెరి’ కూడా సమ్మర్‌కే రానున్నాయి. ఇలా రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలు విడుదల కావడం అంటే చిన్న విషయం కాదు. పైగా అన్నీ పెద్ద సినిమాలే. నాలుగు చిత్రాల్లోనూ సమంతవి ఒకదానికి ఒకటి పోలిక లేని విభిన్న తరహా పాత్రలు కావడం విశేషం. ఇవి కాకుండా సమంత చేతిలో ఉన్న ఇతర చిత్రాల విషయానికొస్తే... ఎన్టీఆర్ సరసన ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రుద్రాక్ష’ కమిట్ అయ్యారు. తమిళంలో ధనుష్‌తో ‘వడ చెన్నై’ చేస్తున్నారు. మొత్తానికి సమంత కెరీర్ ఫుల్ జోష్‌గా ఉందని చెప్పొచ్చు.