బుడ్డోడికి భారీ టార్గెట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమా జోరు మీద ఉన్నాడు. తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా వరుస సక్సెస్లు సాధించిన జూనియర్, ప్రస్తుతం ఓ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల సక్సెస్లతో సూపర్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు దక్షిణాది టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో జనతా గ్యారేజ్ మాలీవుడ్లో కూడా మంచి బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమాకు రిలీజ్కు ముందే 65 కోట్ల వరకు బిజినెస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ దాదాపు 70 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా హిట్ లిస్ట్లోకి చేరుతోంది.
నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో కూడా భారీ బడ్జెట్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డ జూనియర్ ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి అనుకున్నట్టుగా జనతా గ్యారేజ్తో 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్లో స్థానం సంపాదిస్తాడేమో చూడాలి.