రెడీ... స్టార్ట్! | Samantha, Nithya team up with NTR in 'Janatha Garage' | Sakshi
Sakshi News home page

రెడీ... స్టార్ట్!

Published Sun, Feb 21 2016 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

రెడీ... స్టార్ట్!

రెడీ... స్టార్ట్!

‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో చిన్న ఎన్టీఆర్ క్లాస్ లుక్‌లో అభిమానులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’లో మాస్‌గా రెచ్చిపోనున్నారు.  కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. ఇందులో సమంత, నిత్యామీనన్ కథానాయికలు. మలయాళ నటుడు మోహన్‌లాల్ చాలాకాలం తర్వాత నటిస్తున్న తెలుగు చిత్రమిదే. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘నేటి నుంచి ఆర్‌ఎఫ్‌సీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.

తదుపరి సారథి స్టూడియోస్‌లో నిర్మించిన మూడు కోట్ల విలువైన సెట్‌లో జరుపుతాం. ఆ తర్వాత చెన్నై, ముంబై, కేరళలలో చిత్రీకరించి, ఆగస్టు 12న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement