Sarathi Studios
-
నగరంలో మొదలైన షూటింగ్స్ హడావుడి
-
సారథిలో ‘నంబర్ వన్ కోడలు’ షూటింగ్
సాక్షి, హైదరాబాద్: కరోనా మార్గదర్శకాలు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు కొనసాగించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు మూడు నెలల తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్‌ల హడావుడి మొదలైంది. ప్రభుత్వం సూచించిన కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ నటీనటులు, సిబ్బంది షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సారథి స్టూడియోలో ‘నంబర్ వన్ కోడలు’ సీరియల్ షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభానికి ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్, మెడికల్ చెకప్‌లు చేశారు. కాగా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన తొలి సీరియల్‌గా ‘నంబర్ వన్ కోడలు’ నిలవడం విశేషం. దీంతో సీరియల్ బృందం సంతోషం వ్యక్తం చేసింది. తొలుత భయంగానే షూటింగ్ ప్రారంభించామని అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుండటంతో ఆ భయం పోయిందని నటీనటులు పేర్కొంటున్నారు. ఇక లాక్డౌన్ సమయంలో ‘జీ తెలుగు’ ప్రేక్షకులను చాలా మిస్సయ్యానని బుల్లితెర హీరో ధనుష్ అన్నాడు. షూటింగ్ ప్రారంభమైందని ప్రేక్షకులను కనువిందు చేయడానికి త్వరలోనే బుల్లితెరపైకి వస్తామన్నాడు. త్వరలోనే ‘జీ తెలుగు’ ఛానల్లో రాత్రి 8 గంటలకు ‘నంబర్ వన్ కోడలు’ సీరియల్ ప్రసారం అవుతుందని ధనుష్ తెలిపాడు. -
‘బంగ్లా’ సినిమా చూద్దాం రండి
సాక్షి, శ్రీనగర్‌కాలనీ: సినిమా..సినిమా...ఈ మాధ్యమం ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని, విలువలను, వాస్తవాలను తెలుసుకోవచ్చు. ఒక్కో భాషకు, ఒక్కో ప్రాంతానికి భిన్నమైన సంస్కృతి–సంప్రదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని సినిమాలను చూసి పలు భిన్న కోణాలను తెలుసుకోవాలనే తపన కొందరికి ఉంటుంది. అయితే తీరిక దొరకదు.. దొరికినపుడు సినిమాలు దొరకవు. అందుకే సినిమాలను చూపిస్తూ, సినిమా అభిమానుల మనోగతాన్ని తెలుసుకొని ఆ దిశగా హైదరాబాద్ ఫిలిం క్లబ్ తన ఆశయాలను కొనసాగిస్తోంది. విభిన్న సంస్కృతి– సంప్రదాయాలు, జీవనవిధానంతో కూడిన బంగ్లాదేశ్ ఫిలిం ఫెస్టివల్‌ను నగరవాసులకు అందిస్తున్నారు. 1999లో యునెస్కో ప్రాంతీయ భాషా చిత్రాలను పోత్సహించేందుకు ఫిబ్రవరి 21వ తేదీని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌కు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. భావోద్వేగాలు మనుషుల మధ్య బంధాలు, సమాజంలోని ప్రధానాంశాలు, సుఖాలు, దుఃఖాలు, కళాత్మక జీవనాన్ని, సృజనాత్మకతను ప్రస్తావిస్తూ వైవిధ్యమెన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 21వ తేదీనుంచి నాలుగు రోజులపాటు 4 బంగ్లాదేశీ చిత్రాలను ప్రదర్శించనున్నారు. రోజూ సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన ఉంటుంది. ఇన్ స్ప్రింగ్ బ్రీజ్, కోమల రాకెట్, స్క్రీన్ ప్లే యువర్స్ ఢాకా, ఆల్ఫా సినిమాలను ప్రదర్శిస్తారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తాం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సందర్భంగా బంగ్లాదేశ్ ఫిలిం ఫెస్టివల్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నాం. అకాడమీ అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. æహైదరాబాద్ ఫిలిం క్లబ్ మొదలై 46 సంవత్సరాలు అయింది. భవిష్యత్‌లో తెలుగు ఫిలిం ఫెస్టివల్స్‌ను ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నిర్వహిస్తాం. – ప్రకాష్‌రెడ్డి, హైదరాబాద్ ఫిలిం క్లబ్ సెక్రటరీ -
రెడీ... స్టార్ట్!
‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో చిన్న ఎన్టీఆర్ క్లాస్ లుక్‌లో అభిమానులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’లో మాస్‌గా రెచ్చిపోనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. ఇందులో సమంత, నిత్యామీనన్ కథానాయికలు. మలయాళ నటుడు మోహన్‌లాల్ చాలాకాలం తర్వాత నటిస్తున్న తెలుగు చిత్రమిదే. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘నేటి నుంచి ఆర్ఎఫ్సీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. తదుపరి సారథి స్టూడియోస్‌లో నిర్మించిన మూడు కోట్ల విలువైన సెట్లో జరుపుతాం. ఆ తర్వాత చెన్నై, ముంబై, కేరళలలో చిత్రీకరించి, ఆగస్టు 12న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి.