సాక్షి, హైదరాబాద్: కరోనా మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు కొనసాగించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు మూడు నెలల తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్‌ల హడావుడి మొదలైంది. ప్రభుత్వం సూచించిన కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ నటీనటులు, సిబ్బంది షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో సారథి స్టూడియోలో ‘నంబర్ వన్ కోడలు’ సీరియల్ షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభానికి ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్, మెడికల్ చెకప్‌లు చేశారు. కాగా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన తొలి సీరియల్‌గా ‘నంబర్ వన్ కోడలు’ నిలవడం విశేషం. దీంతో సీరియల్ బృందం సంతోషం వ్యక్తం చేసింది. తొలుత భయంగానే షూటింగ్ ప్రారంభించామని అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుండటంతో ఆ భయం పోయిందని నటీనటులు పేర్కొంటున్నారు. ఇక లాక్‌డౌన్ సమయంలో ‘జీ తెలుగు’ ప్రేక్షకులను చాలా మిస్సయ్యానని బుల్లితెర హీరో ధనుష్ అన్నాడు. షూటింగ్ ప్రారంభమైందని ప్రేక్షకులను కనువిందు చేయడానికి త్వరలోనే బుల్లితెరపైకి వస్తామన్నాడు. త్వరలోనే ‘జీ తెలుగు’ ఛానల్‌లో రాత్రి 8 గంటలకు ‘నంబర్ వన్ కోడలు’ సీరియల్ ప్రసారం అవుతుందని ధనుష్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment