జనతా గ్యారేజ్ టీజర్ వచ్చేసింది | Janata garage official teaser released | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్ టీజర్ వచ్చేసింది

Published Wed, Jul 6 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

జనతా గ్యారేజ్ టీజర్ వచ్చేసింది

జనతా గ్యారేజ్ టీజర్ వచ్చేసింది

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. ఈ యంగ్ టైగర్ నటిస్తున్న జనతా గ్యారేజ్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అని టైటిల్‌కి క్యాప్షన్‌గా పెట్టారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్ లో ఈ టీజర్ వీడియో హల్ చల్ చేస్తోంది.

జనతా గ్యారేజ్ టీజర్ అంటూ హీరో ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. లేటెస్ట్ టీజర్ గమనిస్తే.. 'బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ సమ్ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఓ బలవంతుడు ఉంటాడు. జనతా గ్యారేజ్ ఇచట అన్నీ రిపేర్ చేయబడును' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ టీజర్ చూసినట్లయితే ఎన్టీఆర్ మరో మాస్ యాక్షన్ మూవీతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement