అలాంటి పాత్రలు రావడం కష్టమే | No meaningful roles for a heroine in south: Samantha | Sakshi
Sakshi News home page

అలాంటి పాత్రలు రావడం కష్టమే

Published Sun, Sep 18 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

అలాంటి పాత్రలు రావడం కష్టమే

అలాంటి పాత్రలు రావడం కష్టమే

 దక్షిణాదిలో హీరోయిన్లకు అర్ధవంతమైన పాత్రలు చేసే అవకాశం రావడం చాలా కష్టమేనని చెన్నై చంద్రం సమంత వ్యాఖ్యానించారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా చేయకుండా చాలా రిలాక్స్‌గా ఉన్నారు. ఈ మధ్య సమంత తెలుగు, తమిళ భాషల్లో నటించిన చిత్రాలన్నీ విశేష ప్రేక్షకాదరణను పొందాయన్నది గమనార్హం. ఇటీవల తన జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన జనతాగ్యారేజ్ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
 
 పలు అవకాశాలు వస్తున్నా అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమంతపై పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ఈ అమ్మడి వీర ప్రేమగాథ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇక పీపీపీ..డుండుండుంమే తరువాయి అన్న ప్రసారం జోరుగా సాగుతోంది. అందుకే కొత్త చిత్రాలను సమంత అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే సమంత వివరణ వేరేలా ఉంది. తాను క్షణం తీరిక లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నానని, అందుకే కాస్త విశ్రాంతి అవసరం అనిపించి చిత్రాలను అంగీకరించడం లేదనీ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు.
 
  తాజాగా దక్షిణాదిలో హీరోయిన్లకు అర్థవంతమైన పాత్రలు లభించడం కష్టమనే విషయం అర్థమైందన్నారు. అలాంటి పాత్రలు రాకపోవడంతోనే అంగీకరించడం లేదని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమంతతో వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని శనివారం చెన్నైకి వచ్చిన నాగచైతన్య మీడియాతో వెల్లడించారు. ఇక సమంత విషయానికి వస్తే తమిళంలో శివకార్తికేయన్ సరసన ఒక చిత్రం చేయడానికి అంగీకరించారు. పొన్‌రామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement