జనతా గ్యారేజ్ ఫస్ట్లుక్తో నందమూరి అందగాడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకొచ్చేశాడు. ఒకరోజు ముందుగానే తన అభిమానులకు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశాడు. తన తాజా చిత్రం ఫస్ట్లుక్ను 'జనతా గ్యారేజ్' ఫస్ట్లుక్ అంటూ ఎన్టీఆర్ గురువారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ నెల 20న (శుక్రవారం) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్కు జనతా గ్యారేజ్ కి సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేశాడు. గడ్డంతో బైక్పై మాస్ లుక్తో కనిపించిన ఎన్టీఆర్ పోస్టర్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
(చదవండి....స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..!) నాన్నకు ప్రేమతో చిత్రం సక్సెస్తో మంచి జోరులో ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. అంతేకాదు ఈ నెల 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి ఆగస్టులో సినిమా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు యూనిట్.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదలను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ గత చిత్రాలు ఓవర్సీస్లో మంచి వసూళ్లు సాధించటంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జనతా గ్యారేజ్ ఆడియోలో అమెరికాలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Here it is. #JanathaGarage1stLook pic.twitter.com/lv9y5Ig99k
— tarakaram n (@tarak9999) 19 May 2016