స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..! | Jr NTR's Upcoming Movie 'Janatha Garage' First Look Release Date? | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..!

Published Mon, May 16 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..!

స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..!

అభిమాన కథానాయకుడి పుట్టినరోజు అంటే అభిమానులు ఆ హీరో నుంచి కొత్త సినిమా ప్రకటనో, చేస్తున్న సినిమా తాలూకు ఫస్ట్ లుక్కో, టీజరో - ఏదో ఒకటి ఎదురు చూస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే హీరోలు కూడా బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. చిన్న ఎన్టీఆర్ అలానే అనుకున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. మామూలుగా ఫస్ట్ లుక్ అంటే.. సినిమాలో అదిరిపోయే ఫొటో ఏదైనా విడుదల చేస్తారు.

ఈ లుక్ కూడా అలానే ఉంటుంది. కానీ, ప్రత్యేకంగా ఫొటోసెషన్ చేసి, విడుదల చేయడం విశేషం. బాలీవుడ్‌లోని ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ ఇటీవల ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి, ఈ ఫొటోసెషన్ చేశారు. అచ్చంగా అభిమానులు పండగ చేసుకునే రేంజ్‌లో ఆ ఫొటోలు ఉన్నాయట. ఈ నెల 19న సాయంత్రం ఆరు గంటలకు ఈ లుక్‌ని విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సి.వి. మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని చిలుకూరులో జరుగుతోంది.

సమంత, నిత్యామీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్, మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement