
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఫ్లెక్సీల్లో కనిపించని చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు బొమ్మను పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇష్టపడలేదు. టీడీపీ ముఖ్య నేతలు ప్రాధేయపడ్డా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరస్కరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఫొటోను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని జూనియర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తిరుపతి నగరంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిమ్మినాయుడుపాళెం వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు.
చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి
అయితే వీటిలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విగ్రహావిష్కరణకు వచ్చిన ముఖ్య నేతలు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాగా, ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు లేవని కొందరు దౌర్జన్యంగా వాటిని తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment