ఐటమ్‌ అంటే ఆలోచిస్తా! | i am not interested item songs : Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

ఐటమ్‌ అంటే ఆలోచిస్తా!

Published Wed, Jun 28 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

ఐటమ్‌ అంటే ఆలోచిస్తా!

ఐటమ్‌ అంటే ఆలోచిస్తా!

బిర్యానీ తినగానే వేసుకునే కిళ్లీ ఎంత కిక్‌ ఇస్తుందో... ప్రేక్షకుల్లో కొందరికి మాంచి మాస్‌ మసాలా సిన్మాలో ఐటమ్‌ సాంగులు అంతే కిక్‌ ఇస్తాయి. అందుకనే వాటికంత క్రేజ్‌! ఈ క్రేజ్‌ను కొంతమంది కథానాయికలు క్యాష్‌ చేసుకుంటున్నారు. కానీ, కాజల్‌ అగర్వాల్‌ మాత్రం క్రేజ్‌ అండ్‌ క్యాష్‌ రెండిటినీ కోరుకోవడం లేదు. ఆల్రెడీ ‘జనతా గ్యారేజ్‌’లో ‘పక్కా లోకల్‌... నేను పక్కా లోకల్‌’ ఐటమ్‌ సాంగ్‌ చేశారు కాజల్‌.

ఆ తర్వాత అటువంటి అవకాశాలు చాలా వస్తే తిరస్కరించారట! కెరీర్‌పై ఐటమ్‌ సాంగులు ప్రభావం చూపిస్తాయని భయమా? అంటే, అదేం లేదన్నారు. ‘పక్కా లోకల్‌’ సాంగ్‌ చేయడానికి కారణం చెబుతూ... ‘‘తారక్‌ (ఎన్టీఆర్‌)తో నాకున్న ఫ్రెండ్‌షిప్‌ వల్ల చేశా. భవిష్యత్తులోనూ ఛాలెంజింగ్‌ ఐటమ్‌ సాంగులొస్తే చేస్తా. కానీ, ఒకటికి రెండుసార్లు ఐటమ్‌ అంటే ఆలోచిస్తా. ట్యూన్‌ ఎలా ఉంది? పిక్చరైజేషన్‌ ఎలా చేయబోతున్నారు? అనేవాటిపై నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది’’ అన్నారు.

 మామూలుగా బిర్యానీ తయారీకి వాడే మసాలా సరుకుల రేటు కంటే కిళ్లీ రేటు తక్కువే. కానీ, ఒక్కోసారి కిళ్లీని బట్టి రేటు పెరుగుతుంది. ఇండస్ట్రీలోనూ అంతే. సిన్మాలో హీరోయిన్‌ కంటే ఒక్కోసారి ఐటమ్‌ సాంగు చేసిన స్టార్‌ హీరోయిన్‌కు ఎక్కువ డబ్బులు ఇస్తుంటారు. కానీ, కాజల్‌ మాత్రం ‘‘నాకు ఇప్పుడు డబ్బుల కంటే మంచి పాత్రలు చేయడమే ముఖ్యం’’ అంటున్నారట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement