నందమూరి హీరోతో రత్తాలు..? | Lakshmi rai Item song in Ntr Jai Lavkusa | Sakshi
Sakshi News home page

నందమూరి హీరోతో రత్తాలు..?

Published Fri, Jan 27 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

నందమూరి హీరోతో రత్తాలు..?

నందమూరి హీరోతో రత్తాలు..?

మాస్ కమర్షియల్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ కంపల్సరీ అయిపోయింది. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్కు సై అంటున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఓ మాస్ మాసాలా ఐటమ్ నంబర్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. గతంలో ఐటమ్ సాంగ్స్ తో ఊపేసిన అందాల భామలతో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు.

సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో పవన్తో.. ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో కలిసి చిందేసిన అందాల భామ లక్ష్మీరాయ్తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. వరుసగా రెండు సూపర్ హిట్ ఐటమ్ నెంబర్స్లో నటించిన లక్ష్మీరాయ్తో స్పెషల్ సాంగ్ చేయిస్తే తమ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు  చిత్రయూనిట్. అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement