సర్దార్ గబ్బర్‌సింగ్‌తో కెవ్వు కేక! | Lakshmi Rai in Sardar Gabbar Singh movie | Sakshi
Sakshi News home page

సర్దార్ గబ్బర్‌సింగ్‌తో కెవ్వు కేక!

Published Wed, Sep 2 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

సర్దార్ గబ్బర్‌సింగ్‌తో కెవ్వు కేక!

సర్దార్ గబ్బర్‌సింగ్‌తో కెవ్వు కేక!

 ‘గబ్బర్ సింగ్’లో పాటల సందడిని అంత సులువుగా మర్చిపోలేం. మలైకా అరోరాతో పవన్ కల్యాణ్ ‘కెవ్వు కేక...’ అంటూ వేసిన మాస్ స్టెప్పులు చూసి, ‘మా బాస్ కేక’ అని ఆయన అభిమానులు అన్నారు. అదే చిత్రంలో రౌడీ గ్యాంగ్ ఆడే అంత్యాక్షరి కూడా సూపర్. ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో కూడా పాటల జోరు భలేగానే ఉంటుందని సమాచారం. ‘గబ్బర్‌సింగ్’లో ఉన్నట్లే ఈ చిత్రంలో కూడా కెవ్వు కేక అనిపించే ఒక ఐటమ్ సాంగ్ ఉంది.
 
 ఆ పాటకు పవన్ కల్యాణ్‌తో కలిసి నటి రాయ్ లక్ష్మి కాలు కదపనున్నారు. పాటలో మాత్రమే కాకుండా కీలక సన్నివేశాల్లో కూడా కనిపిస్తారామె. ‘బలుపు’ చిత్రంలో రవితేజతో కలిసి ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేశారు రాయ్ లక్ష్మి. ఆ తర్వాత ఆమె చేయనున్న ఐటమ్ సాంగ్ ఇదే. పవన్ కల్యాణ్‌తో డ్యాన్స్ చేయనున్నందుకు ఆనందంగా ఉందనీ, చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ రాయ్ లక్ష్మి పేర్కొన్నారు. బాబీ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement