Sardar Gabbar Singh
-
ఎక్స్ఎల్ టు స్మాల్!
‘‘బాగా సన్నగా ఉన్నావు.. కొంచెం బరువు పెరుగు’ అని ఎవరైనా అంటే.. ఈజీగా పెరగొచ్చు. కానీ, పెరిగాక తగ్గమంటే మాత్రం అంత ఈజీ కాదు’’ అంటున్నారు రాయ్ లక్ష్మీ. ఆ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ‘తప్పు తప్పే తప్పు తప్పే.. శుద్ధ తప్పే..’ పాటలో కూడా కనువిందు చేశారామె. ఇప్పుడీ బ్యూటీ హిందీ చిత్రం ‘జూలీ–2’లో నటించారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రెచ్చిపోనంతగా ఈ సినిమాలో గ్లామర్వైజ్గా రెచ్చిపోయారు. బికినీ ధరించారు. దాని గురించి చెబుతూ – ‘‘సౌత్ సినిమాల్లో నేను ‘సెమీ బికినీ’ వేసుకున్నా. ఫస్ట్ టైమ్ పక్కా బికినీ వేసుకున్నది ఈ సినిమాకే. కథ డిమాండ్ చేసినప్పుడు, ఫిజిక్ బాగున్నప్పుడు బికినీ వేసుకుంటే తప్పేంటి? అది తప్పు కాదు.. శుద్ధ తప్పు కాదు’’ అన్నారు. ఇక, బరువు తగ్గడానికి ఏం చేశారనే విషయం గురించి రాయ్ లక్ష్మీ చెబుతూ – ‘‘ఇండియాలో ఉన్న బెస్ట్ ట్రైనర్స్ 35 మంది ‘వెయిట్ లాస్’ విషయంలో నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నా డ్రెస్ సైజ్ ‘ఎక్స్ఎల్’ (ఎక్స్ట్రా లార్జ్) అనుకోండి.. అక్కణ్ణుంచి ‘ఎమ్’ (మీడియమ్), ఆ తర్వాత స్మాల్ సైజ్‌కి చేరుకున్నా. అది అంత ఈజీ కాదండి’’ అన్నారు. రాయ్ లక్ష్మీ పడ్డ కష్టం ఊరికే పోదు.. ‘జూలీ–2’ పోస్టర్స్ చూసినవాళ్లు ‘కేక’ అంటున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. రాయ్ లక్ష్మీ నటన చూసి, కూడా అదే మాట అంటారని ఊహించవచ్చు. అన్నట్లు.. ఇది ఆమెకు 50వ సినిమా. -
న్యాయం జరిగే వరకూ దీక్ష
‘‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులు కొని సుమారు రెండు కోట్ల రూపాయలు నష్టపోయా. అప్పుడు నాకు ‘కాటమరాయుడు’ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇస్తామని నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ హామీ ఇచ్చి, ఇప్పుడు ఇవ్వడం లేదు’’ అని ఆ సినిమా డిస్టిబ్య్రూటర్ సంపత్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ వద్ద శుక్రవారం ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిట్ అవుతుంది, నీకేం భయం లేదంటూ మాయ మాటలు చెప్పి అధిక ధరకు కృష్ణాజిల్లా పంపిణీ హక్కులు కొనిపించి, నన్ను రోడ్డున పడేశారు. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ‘కాటమరాయుడు’ సినిమా పంపిణీ హక్కులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు వేరే డిస్టిబ్య్రూటర్‌కు ఇచ్చారు. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్‌గారి దృష్టికి తీసుకెళదామనుకుంటే, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆయన జోక్యం చేసుకుని నాకు పంపిణీ హక్కులు ఇవ్వాలి. లేకుంటే, దీక్ష విరమించేది లేదు’’ అన్నారు. -
ఇంతకీ 'సర్దార్' కలెక్షన్లు ఎంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతా తానై తీసిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విడుదల కావడానికి ముందు బోలెడంత హైప్ క్రియేట్ చేసింది. నిజానికి ఆ సినిమా విడుదలకు ముందే మొత్తం బిజినెస్ 100 కోట్లు చేసింది. గబ్బర్‌సింగ్ విజయంతో ఈ సినిమా మీద భారీ అంచనాలతో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు పోటీలు పడి సినిమాను కొనేశారు. కానీ, వంద కోట్లు వసూలు చేయలేక.. బాక్సాఫీసు వద్ద సినిమా చతికిలపడింది. సినిమాను తెలుగు, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా విడుదల చేసినా, అంతా కలిపి సినిమాకు వచ్చినది కేవలం రూ. 52.92 కోట్లు మాత్రమేనన్నది టాలీవుడ్ టాక్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ హక్కులను రూ. 87 కోట్లు పెట్టి కొన్నారు. కానీ, ఈ రెండు రాష్ట్రాలలో కలిపి అందులో సగం కూడా రాలేదు. దాంతో వాళ్లంతా నష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల లోఫర్ సినిమా నష్టాల విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మీద డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. మరిప్పుడు వాళ్లు ఈ సినిమా దర్శకుడు బాబీని అడుగుతారా, లేక సినిమాకు అంతా తానే అయిన పవన్‌ను అడుగుతారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. అయితే.. ఎస్జే సూర్యతో తాను చేయబోతున్న నెక్స్ట్ సినిమాతో ఈ సినిమా నష్టాలకు పరిహారం ఇస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారని టాక్. ఏరియాల వారీగా సర్దార్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి... నైజాం - రూ .12.05 కోట్లు, సీడెడ్ - రూ. 8.40 కోట్లు, నెల్లూరు - రూ. 1.73 కోట్లు, కృష్ణా - రూ. 2.96 కోట్లు, గుంటూరు - రూ. 4.10 కోట్లు, వైజాగ్ - రూ. 4.15 కోట్లు, తూర్పుగోదావరి - రూ. 3.80 కోట్లు, పశ్చిమగోదావరి - రూ. 3.75 కోట్లు... మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి రూ. 40.94 కోట్లు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇతర ప్రాంతాల్లో.. కర్ణాటక రూ. 5.10 కోట్లు, మిగిలిన దేశం అంతా కలిపి రూ. 1.53 కోట్లు, ఓవర్సీస్ - రూ. 5.35 కోట్లు. ఇది కూడా కలుపుకొంటే మొత్తం కలిపి సర్దార్ గబ్బర్ సింగ్ వసూలు చేసింది రూ. 52.92 కోట్లని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. -
పవన్‌ను నిద్ర లేపండి..!
పవన్ కళ్యాణ్‌ను నిద్రలేపాల్సిన బాధ్యత ఆయన అభిమానుల మీద ఉందని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పవన్ మీడియాతో మాట్లాడిన తర్వాత సర్వసాధారణంగా తనకు అలవాటైన అర్ధరాత్రి సమయంలోనే రాంగోపాల్ వర్మ రెండు ట్వీట్లు చేశారు. ఇంగ్లీషు నుంచి డబ్బింగ్ అయిన సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుంటే, పవర్ స్టార్ సినిమా మాత్రం అలా నడవడం లేదని వ్యాఖ్యానించారు. అందువల్ల ఇప్పటికైనా ఆయనను నిద్ర లేపాల్సిన నైతిక బాధ్యత పీకే అభిమానుల మీద ఉందని అన్నారు. దాంతోపాటు, జంగిల్ బుక్ సినిమాలో నటించిన బాలనటుడి ఫొటో ఒకటి పోస్ట్ చేసి.. మెగా పవర్ సర్దార్ గబ్బర్‌సింగ్‌తో పాటు రాజా సర్దార్ గబ్బర్‌సింగ్‌ను కూడా చంపేసిన చిన్న పిల్లాడిని చూడండి అంటూ చెప్పారు. కాగా, అటు పవన్ మాత్రం రాంగోపాల్ వర్మ విషయం మీద కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. వర్మ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన బయటవాళ్ల మీద పెట్టే శ్రద్ధ తనపై, తన సిన్మాలపై పెడితే వేరే స్థాయికి వెళ్లేవారని పవన్ అన్నారు. ఆయన తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటానని, కాదంటే, తనకూ లోపల వేరే భాష చాలా ఉందని కాస్తంత కటువుగా చెప్పారు. తానూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలనని ఒకింత హెచ్చరించారు కూడా. If foreign dubbed film is houseful all over and PK's is not its the loyal responsibility of PK fans to wake up Power Star from his sleep — Ram Gopal Varma (@RGVzoomin) 10 April 2016 Meet the small little kid who killed the mega power SARDAR GABBAR SINGH and also RAJA SARDAR GABBAR SiNGH pic.twitter.com/xZSU9MV6Hj — Ram Gopal Varma (@RGVzoomin) 10 April 2016 -
‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో సీటుకోసం అభిమానుల మధ్య గొడవ
నెయిల్ కట్టర్‌తో దాడి... ఒకరి మృతి పావగడ (కర్ణాటక): తుమకూరు జిల్లా పావగడలో శుక్రవారం పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదల సందర్భంగా జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన రాకేశ్(20), టీకొట్టు నిర్వాహకుడు రవి.. పవన్ అభిమానులు. వీరు మధ్యాహ్నం స్థానిక అలంకార్ థియేటర్లో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని చూసేందుకు వెళ్లారు. కుర్చీ కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రవి నెయిల్ కట్టర్‌కు ఉండే చిన్నపాటి చాకుతో రాకేశ్ మెడపై పొడిచాడు. ప్రధాన నరం తెగింది. దీంతో అక్కడున్న వారు వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య నేపథ్యంలో థియేటర్లో చిత్ర ప్రదర్శనను నిలిపేశారు. -
రెచ్చిపోయిన పవన్ అభిమానులు
హైదరాబాద్ : అభిమాన హీరో సినిమాను తొలిరోజే చూసేందుకు వీరాభిమానులు పాట్లు పడుతుంటారు. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టికెట్ల విషయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని చేయి విరిగింది. మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. థియేటర్ గేట్లు తెరవకపోవడంతో ఒక్కసారిగా జనాలు తోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పరమేశ్వరి థియేటర్ పై ప్రేక్షకులు దాడి చేశారు. సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. మరోవైపు నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో పవన్ కల్యాణ్ అభిమానులు హల్ చల్ చేశారు. స్థానిక థియేటర్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సినిమా ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెచ్చిపోయిన పవన్ అభిమానులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అలాగే పవన్‌కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని మొదటి రోజు తొలి ఆట చూడటానికి వచ్చిన ఓ అభిమానికి టికెట్ దొరక్కపోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాస టాకీస్ ఎదుట ఓ యువకుడు టికెట్ దొరకలేదని మనస్తాపానికి గురై వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ...థియేటర్ వద్ద సందడి చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద హడావుడి చేస్తూ, పటాసులు కాల్చి, రంగులు చల్లుకుంటూ, పవన్ కటౌట్లకు క్షీరాభిషేకం చేశారు. -
విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో !
కీలక నేత కుటుంబానికి కలెక్షన్ల పండుగ థియేటర్లు యజమానులవి.. టికెట్లు వీరివి అడ్డంగా రేట్లు పెంచేసి అమ్మకాలు తొలి మూడు రోజుల్లో రూ. 50 కోట్ల దోపిడీకి స్కెచ్ అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే...ఫ్యాన్స్‌కు పండగే పండుగ. తొలి షోనే చూడాలి. కుదరకపోతే కనీసం తొలిరోజే ఏదో ఓ షో చూడాల్సిందే. .. ఈల వేసి... గోల చేసి.. కేవ్వు కేక పుట్టించాల్సిందే. ఇదీ అభిమానుల ఆరాటం.. కోలాహలం.. సరిగ్గా ఈ ఆరాటాన్నే నగరంలోని కీలక నేత కుటుంబం అడ్డంగా వాడేసుకుంటోంది. అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు అక్రమ కలెక్షన్ల షోకు తెగించింది. ఇసుక, మద్యం మాఫియాలను మించిపోయేలా... క్రికెట్ బెట్టింగులనూ తలదన్నేలా... జిల్లాలో సరికొత్త సినీ వ్యాపారానికి తెరతీసింది. గతంలో బాహుబలి సినిమాతో ప్రారంభించిన ఆ దందాను సర్దార్ గబ్బర్ సింగ్‌తో రెట్టింపు చేసింది. వెండితెర సాక్షిగా తొలి మూడు రోజుల్లో నగరంలో రూ. 33.75 కోట్లు... గ్రామీణ జిల్లాలో రూ. 15 కోట్లు వసూళ్ల దందాకు తెరతీసింది. విశాఖపట్నం : పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ శుక్రవారం విడుదల కావడంతో ఆయన అభిమానుల్లో కోలాహలం కట్టలు తెంచుకుంటోంది. జిల్లాలో సుమారు 50 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పెద్ద హీరో సినిమా అయినందున ఓపెనింగ్ కలెక్షన్లకు కొదవ ఉండదు. ఈ కలెక్షన్లను సొంతం చేసుకునేందుకు నగరంలోని అధికార పార్టీకి చెందిన కీలక నేత కుటుంబం రంగంలోకి దిగింది. ఈ సినిమా విడుద రోజైన శుక్రవారం ఉగాది సెలవు.. ఆ వెంటనే శని, ఆదివారం కూడా కలసి వచ్చాయి. దాంతో ఆ మూడు రోజుల కలెక్షన్లపై కీలక నేత కుటుంబం కన్నేసింది. ఆ కుటుంబ సభ్యులు థియేటర్ల యజమానులతో వారం రోజుల ముందే చర్చలు జరిపారు. సామదానభేదదండోపాయాలతో వారిని ఒప్పించారు. అధికార బలం, పోలీసు బెదిరింపులనూ ప్రయోగించారు. థియేటర్ల నిర్వహణ యజమానులదే... కానీ షోలు మాత్రం తాము వేసుకుంటామని తేల్చి చెప్పేశారు. అందుకుగాను షోకు హాల్ కెపాసిటీని బట్టి టికెట్ల వాస్తవ రేటు సొమ్ము ఇచ్చేస్తామని చెప్పారు. అక్కడే ఉంది అసలు కిటుకు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకు తొలి వారం టిక్కెట్టు ధరను రూ. 100 వరకు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఆ ప్రకారం థియేటర్ యజమానులకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ లెక్కన షోకు సగటున 1500 టిక్కెట్లు ఉంటాయి. అందులో 20 శాతం ఇంటర్నెట్ ద్వారా విక్రయించాలి. మిగిలిన టిక్కెట్లు కౌంటర్లలోనే అమ్మాలి. కానీ కీలక నేత కుటుంబం గంపగుత్తగా టిక్కెట్లు సొంతం చేసుకుంది. ఆ టిక్కెట్ల ధరను భారీగా పెంచేసి అడ్డంగా సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైంది. 3 రోజుల్లో దాదాపు రూ. 50 కోట్ల దోపిడీకి స్కెచ్ అలా దక్కించుకున్న టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు సిద్ధపడింది కీలక నేత కుటుంబం. ఒక్కో టిక్కెట్టును రూ. 500 చొప్పున బ్లాక్‌లో విక్రయం ప్రారంభించింది. అంతలోనే దాన్ని రూ. 1000కి, చివరికి రూ. 2000 వరకు పెంచుకుంటూ పోయింది. జిల్లాలో 50 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వాటిలో 30 థియేటర్లు నగరంలోనే ఉన్నాయి. ప్రతి థియేటర్లో తొలి మూడు రోజులు 5 షోలు చొప్పున వేస్తున్నారు. ఒక్కో షోకు సగటున 1500 టిక్కెట్లు... అంటే రోజుకు 225000 టిక్కెట్లు, ఒక్కో టిక్కెట్టు రూ. 500 చొప్పున వేసుకున్నా... రోజుకు రూ. 11.25 కోట్ల అక్రమార్జన... దిమ్మ తిరిగే భారీ అక్రమం కదా... ఆ ప్రకారం తొలి మూడు రోజుల్లో రూ. 33.75 కోట్ల అక్రమార్జనకు కీలక నేత కుటుంబం బరి తెగించింది. గ్రామీణ జిల్లాలో పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అక్కడ కూడా రోజుకు దాదాపు రూ. 5 కోట్లు చొప్పున తొలి మూడు రోజుల్లో రూ. 15 కోట్ల వరకు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. చెష్టలుడిగిన అధికార యంత్రాంగం ప్రేక్షకుల సినీ వ్యామోహాన్ని ఇంతగా దోచుకుంటున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి పోయింది. కీలక నేత కుటుంబ సభ్యులే స్వయంగా రంగంలోకి దిగి దందా సాగిస్తుండటంతో మౌనంగా ఉండిపోయింది. సినిమా థియేటర్ల సక్రమ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన జాయింట్ కలెక్టర్ గానీ బ్లాక్ విక్రయాలను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం గానీ కిమ్మనడం లేదు. వారి ఉదాసీనత కీలక నేత కుటుంబ భారీ అక్రమాలకు రక్షావకచంగా నిలుస్తోంది. -
అర్థరాత్రి సర్దార్ సందడి
హైదరాబాద్: హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి సర్దార్ గబ్బర్ సింగ్ సందడి మొదలైంది. కూకట్ పల్లిలో అర్జున్ థియేటర్ బెన్ ఫిట్ షోకు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పవన్ కల్యాణ్ అభిమానులు బారులు తీరారు. వీరిలో తొలి గబ్బర్ సింగ్ చిత్రాన్ని తీసిన దర్శకుడు హరీష్ శంకర్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ కూడా ఉన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) థియేటర్లో అభిమానులతోపాటు ఈ సెలబ్రిటీలు కూడా చేరడంతో పండగ వాతావరణం కనిపించింది. అంతేకాదు సాధారణ ప్రేక్షకుల్లాగే వీరు వచ్చారు. సాయి ధరమ్ తేజ అయితే ఏకంగా పక్కా మాస్ అబ్బాయిలాగా మెడలో ఎర్ర కండువా, షార్ట్ ధరించి వచ్చాడు. ఇక సినిమాకు వచ్చిన చాలామంది సర్దార్ గబ్బర్ సింగ్ వేషధారణలో వచ్చి చిందులేశారు. ప్రతి ఒక్కరి మెడలో సర్దార్ గబ్బర్ సింగ్‌లో పవన్ కల్యాణ్ లాగా ఎర్ర కండువా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
వెంకన్నసేవలో సర్దార్ డైరెక్టర్
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు బాబి(కే.ఎస్ రవీంద్ర) స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న దర్శకుడు రవీంద్రకు దర్శనం అనంతరం టిటిడి అధికారలు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు రవీంద్రతో పోటోలు దిగటానికి భక్తులు ఉత్సహం చూపారు. మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శ్రీవారి సుప్రభాతసేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. -
‘సర్దార్ గబ్బర్ సింగ్’ లీకైంది..!
♦ పొద్దుటూరులో సీడీ షాపులపై పోలీసుల దాడులు ♦ పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు ప్రొద్దుటూరు క్రైం: విడుదల కంటే ముందే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం లీకైందంటూ పుకార్లు వినిపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం ఉదయం నుంచి దాడులు చేశారు. పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్‌గబ్బర్‌సింగ్ ఈనెల 8న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్లోకి విడుదలయ్యాయనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సీడీ షాపులు, తయారీ దారులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ చిత్రానికి పని చేసిన కొందరు టెక్నీషియన్ లు రెండు రోజుల క్రితం ల్యాబ్ నుంచి కాపీ చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి. ప్రొద్దుటూరులోని పలు సీడీ షాపులలో పోలీసులు సోదాలు చేశారు. సీడీలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న దుకాణాలపై కూడా దాడి చేసి హార్డ్ డిస్క్‌లు, సీడీ రైటర్లను పరిశీలించారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని, త్రీ టౌన్ పరిధిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు వారిని బైండోవర్ చేసి తహ సీల్దార్ వద్ద హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను చిత్రం విడుదల అయ్యే వరకూ ప్రతి రోజూ స్టేషన్లో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన సీడీలు ఎవరి వద్ద దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు థియేటర్ యజమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. -
'పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. టేపులతో రండి'
'బివేర్.. మరో రెండు రోజుల్లో సమ్మర్ హీట్ పీక్స్ కు వెళ్లబోతోంది. ఆకాశంలో సూర్యుడి ప్రతాపంతోకాదు, బాక్సాఫీస్ దగ్గర పవన్ కల్యాణ్(పీకే) సినిమా'సర్దార్ గబ్బర్ సింగ్ (ఎస్జీఎస్)' సృష్టించబోతోన్న ప్రభంజనంతో!'.. ఫిల్మ్ నగర్ లోనేకాదు పీకే సినిమాతో రిలేట్ అయిన ప్రతిఒక్కరి నోటా ఇదే మాట! ఇక మెగా కుటుంబానికి వీరాభిమానినని(!) చెప్పుకునే రామ్ గోపాల్ వర్మదీ దాదాపు ఇదే మాట. మామూలుగానే పీకేపై ట్వీట్ల బాణాలు కురిపించే వర్మ.. ఎస్జీఎస్ రిలీజ్ అవుతోందంటే ఊరుకుంటాడా! మళ్లీ వదిలాడు.. 'పీకే ఫ్యాన్స్.. మీరంతా దూరాలు కొలిచే టేపులతో థియేటర్లకు రండి' అని సలహా ఇస్తున్నాడు వర్మ. ఎందుకు? ఇంకెందుకు.. ఎస్ జీఎస్ రిలీజ్ అవుతోన్న థియేటర్ల దగ్గర టికెట్లకోసం జనం కట్టిన క్యూ లైన్లు ఎంత పొడుగుంటాయో కొలవడానికి. 'బాహుబలి విడులైన రోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర టికెట్లకోసం జనం 1.5 కిటోమీటర్ల దూరం క్యూ కట్టారు. ప్రభాస్ కే అంత దూరం క్యూ కడితే, ఇక పీకే కోసం ఏ రేంజ్ లో క్యూకడతారో చూడాలని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల స్క్రీన్లపై ఉగాది(8న) పండుగనాడు విడుదలకానున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో భారీ స్థాయిలో విడుదలవుతోన్న రెండో చిత్రంగా రికార్డులకెక్కనుంది. ఓవర్సీస్ లో దాదాపు 800 స్క్రీన్లు, హిందీలో మరో 800 స్క్రీన్లపై చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక తెలుగులో రమారమి రెండున్నరవేల పైచిలుకు స్క్రీన్లపై సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలయ్యే అవకాశంఉంది. I think PK fans from all over should come with measuring tapes,measure the q and prove to the whole world that PK is bigger than Prabhas — Ram Gopal Varma (@RGVzoomin) 5 April 2016 Compared to 1.5 kilometre long line for Bahubali on 1st day outside Prasad I max..very curious how many kilometres long line SGS will have — Ram Gopal Varma (@RGVzoomin) 5 April 2016 -
పవన్‌కి విలన్.. ప్రభాస్‌కు ప్రాణం
మొన్నటివరకు అతనో సాధారణ టీవీ సీరియల్ నటుడు. 'శరద్ కేల్కర్.. బాగా నటిస్తాడు' అనే కితాబులే తప్ప పెద్దగా అవకాశాలు చిక్కని పరిస్థితి. అయితే బాహుబలి- ది బిగినింగ్ విడుదలయ్యాక మాత్రం అతని దశ,దిశలు మారిపోయాయి. హిందీ బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పి తన గొంతుతో బాహుబలి పాత్రకు ప్రాణంపోసిన శరద్ కేల్కర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెయిన్ విలన్(భైరవ్ సింగ్)గా నటించాడు. తెలుగు హీరోకు గాత్రదానం చేసి మన్ననలు పొందిన శరద్.. తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఇటీవలే విలేకరులతో మాట్లాడిన శరద్ కేల్కర్ ఏమన్నాడంటే.. 'ఎంతో పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదు. చాలా హిందీ సీరియల్స్ లో నా వాయిస్ విన్న కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా. సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు నమోదయ్యాయో తెలిసిందే. ఇక బాహుబలి 2 హిందీ డబ్బింగ్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నా. దాంతోపాటు నేను తొలిసారిగా వెండితెరపై నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నా. స్క్రీన్ టెస్ట్ కాకముందే పవన్ సార్ నన్ను విలన్ గా ఓకే చేయడం ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది' అంటూ భావోద్వేగంగా స్పందించాడు శరద్ కేల్కర్. -
పాస్ ల కోసం పవన్ ఫ్యాన్స్ లొల్లి
- చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పవన్ అభిమానుల నిరసన హైదరాబాద్ పవన్‌కల్యాణ్ అభిమానులకు సర్దార్ గబ్బర్ సింగ్ ఫీవర్ పట్టుకుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం పాస్‌లు కావాలంటూ పవన్ అభిమానులు ఏకంగా ఆందోళనకు దిగారు. జూబ్లిహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు గేటు ముందు ఆదివారం పవన్ బ్యానర్ పట్టుకుని తమకు పాస్‌లు కావాలంటూ అభిమానులు కొద్దిసేపు నినాదాలు చేశారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. కాగా... భద్రతా కారణాల రీత్యా పాస్‌లు లేని వారు కార్యక్రమానికి రావద్దని పవన్‌కల్యాణ్ తన అభిమానులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ కు పాస్ లు కావాలని పవన్ అభిమానులు రోడ్డెక్కారు. -
పవన్.. ఆ తప్పు చేయొద్దు: వర్మ
ఎప్పుడూ తన సినిమాలతో పాటు వివాదాస్పద ట్వీట్లతో సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తన మార్కు సెటైర్లు వేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో విడుదల చేయడం సూపర్ డూపర్ తప్పు అవుతుందని అన్నాడు. బాహుబలి స్థాయిలో విజువల్స్ స్థాయి ఉంటే తప్ప ఆ సినిమాను హిందీలో విడుదల చేయొద్దని సలహా ఇచ్చాడు. జాతీయస్థాయిలో పవన్ కల్యాణ్ కంటే ప్రభాస్ ఎక్కువన్న విషయం సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో హిందీ బాక్సాఫీసులో రుజువైతే, అది అతడికి చాలా దారుణం అవుతుందని చెప్పాడు. పవన్ కల్యాణ్ చుట్టూ ఉన్నవాళ్లలో నిజమైన వ్యక్తి, తెలివైన వ్యక్తి కనీసం ఒక్కరు ఉన్నా కూడా.. హిమాలయాలంత స్థాయి తప్పు చేయొద్దని అతడికి సలహా ఇవ్వాలని కోరాడు. తన సినిమా కూడా బాహుబలి అంత పెద్దదైతేనే పీకే హిందీలోకి రావాలని, కానీ బాహుబలితో పోల్చి చూసినపుడు.. పవన్ కల్యాణ్ లేకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చాలా చిన్నగా కనపడుతుందని చెప్పాడు. Without having the Visual Magnitude of "Bahubali" it will be a super duper blunder to release "Sardar Gabbar Singh" in Hindi — Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2016 It will be bad for Pawan Kalyan if "Sardar Gabbar Singh" box office in Hindi will prove that Prabhas is bigger than P k on a National Level — Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2016 If there is even just one smart and truthful person around Pawan Kalyan,I request him to advise P K not to this Himalayan Mistake — Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2016 P k should come in Hindi only when the film also is as big as BahuBali ..Sardar Gabbar Singh minus PK will look very small in front of BB — Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2016 -
సర్దార్ గబ్బర్ సింగ్ మేకింగ్ వీడియో
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు శుభవార్త. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా మేకింగ్ కు సంబంధించి ఓ వీడియో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఆ చిత్ర యూనిట్ అప్ లోడ్ చేసిన అధికారిక వీడియో యూట్యూబ్ లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. శనివారం సాయంత్రం ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన విషయం తెలిసిందే. విడుదల తేదీ ఏప్రిల్ 8 అని తెలిసి పవన్ అభిమానులు ఇప్పటికే ఎంతో హుషారుగా ఉన్నారు. 41 సెకన్ల నిడివి ఉన్న ఈ తాజా వీడియో ఇప్పటికే భారీ హిట్స్, లైక్స్ అందుకుంటుంది. ఈ సినిమా నిర్మాత, పవన్ సన్నిహితుడు... శరత్ మరార్ 'మేకింగ్ ఆఫ్ సర్దార్ గబ్బర్ సింగ్ వీడియో' చూడండి అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీ ఆడియో విడుదల ఈ నెల 20న చేయనున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మేకింగ్ వీడియో పోస్ట్ అయిన క్షణాల్లోనే లైక్ లు వెల్లువెత్తుతున్నాయి. -
పోలీస్ షర్ట్.. గళ్ల లుంగీ.. పవర్‌స్టార్ అదుర్స్
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించి సంక్రాంతి స్పెషల్ గా ఓ టీజర్ ను గురువారం సాయంత్రం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే మాస్ ప్రేక్షకులకు నిజంగా పండగే అన్నట్లుగా ఉంది. ఎప్పుడూ విభిన్నమైన స్టైల్స్ ను టాలీవుడ్ హీరోలకు పరిచయం చేస్తూ తనదైన మార్క్ చూపించే పవర్ స్టార్ ఈ టీజర్ లో కూడా విచిత్ర పోలీసు వేషదారణలో కనిపించి అబ్బురపరిచారు. ఈ చిత్రానికి సంబంధించి ముందునుంచి కూడా ఆయన సంచలన ఫొటోలతో, చిన్నసైజు వీడియోలతో కనిపిస్తూ అదరగొట్టేస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ చిత్రంలో మాదిరిగానే సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా పోలీసు అధికారిగా నటిస్తున్న పవన్ కల్యాణ్.. ఆ చిత్రంలో డైలాగులు ఎంత మాస్ గా ఉన్నా పోలీసు డ్రెస్సింగ్ విషయంలో కాస్త జాగ్రత్త పాటించారు. కానీ, కొత్తగా విడుదల చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్రచారక వీడియోలో మాత్రం ఆయన పోలీసు వేషం చూస్తుంటే థియేటర్లోకి ఈ సినిమా ఎంత తొందరగా వస్తుందా అనిపించక మానదు. పైన పోలీసు షర్ట్.. దాని మీదుగా పోలీస్ బెల్ట్, కుడిచేత్తో భుజంపై తుపాకీ, ఎడం చేతిలో గుర్రం.. కానీ, పోలీసు ప్యాంట్ కాకుండా ఓ గళ్ల లుంగీ ధరించి సగం పోలీసు అధికారిలాగా దర్శనమిచ్చారు పవన్ కల్యాణ్. అనంతరం ఈ వీడియోపై సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. -
'ఫ్యాన్స్‌కి ఏం కావాలో పవన్‌కి బాగా తెలుసు'
పవన్ ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్లో కనిపించి చాలా కాలం గడిచిపోయింది. అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ హీరోగా సినిమా రాలేదు. మధ్యలో గోపాల గోపాల సినిమాలో నటించినా.. అది పవన్ అభిమానుల ఆకలి తీర్చే పాత్ర కాదు. దీంతో పవన్ కళ్యాణ్ హీరోయిజం కనిపించే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎదురు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ అలాంటి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అంటున్నాడు నిర్మాత శరత్ మరార్. 'సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్లో ఓ గొప్పరోజు ముగిసింది. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ టీంతో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ ఎంత కష్టాపడతాడో ఇప్పుడు తెలుస్తోంది. అభిమానులు ఏం కోరుకుంటున్నారో పవన్‌కు బాగా తెలుసు, పక్కాగా చెప్పుతున్నాను సర్థార్ గబ్బర్‌సింగ్ కంప్లీట్ ఎంటర్టైనర్' అంటూ ట్వీట్ చేశాడు శరత్ మరార్. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గబ్బర్‌సింగ్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీలో వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. Just finished a great day of work on d sets of #SardaarGabbarSingh . #PawanKalyan was at his best.Feel blessed to be a part of this project — Sharrath Marar (@sharrath_marar) January 8, 2016 All his hard work is unfolding now. #PawanKalyan knows so well what his fans want & he is making sure that #SGS is a complete entertainer. — Sharrath Marar (@sharrath_marar) January 8, 2016 -
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు శుభవార్త. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా విడుదల తేదీ ఖరారైనట్టు సమాచారం. ఏప్రిల్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రాజెక్టు విషయంలో బాగా జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది దశ షూటింగ్ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. 'జనవరి 4 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. దాదాపు నెలపాటు ఉంటుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. సినిమా ఏప్రిల్‌లో విడుదల చేయాలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు' అని చిత్రానికి సంబంధించి విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. ఇంకా పోస్టు ప్రోడక్షన్ వర్క్‌లోకి వెళ్లకముందే సినిమా హక్కుల కోసం డిస్టిబ్యూటర్లు పోటీపడుతున్నట్టు తెలుస్తున్నది. 2012లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్' సినిమాకు 'సర్దార్ గబ్బర్‌సింగ్' సీక్వెల్‌గా వస్తున్నది. -
ఫుల్ ఎంజాయ్...
‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పాటు తమిళ చిత్రాలు, రెండు హిందీ చిత్రాలు చేస్తున్న రాయ్ లక్ష్మి కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా వెళ్లిపోయారు. దాదాపు అరడజను మంది స్నేహితులతో నాలుగైదు రోజుల క్రితమే ఇక్కణ్ణుంచి వెళ్లిన రాయ్ లక్ష్మి అమెరికాలో చూడవలసినవన్నీ చూస్తున్నారు. డిస్నీల్యాండ్ వెళ్లారు. అక్కడికెళ్లగానే చిన్నపిల్లలా అయిపోయాననీ, చుట్టూ జనాలు ఉన్న విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేశాననీ రాయ్ లక్ష్మి అన్నారు. యూనివర్సల్ స్టూడియోను కూడా సందర్శించారు. హాలీవుడ్లో ఉన్న ఆరు పెద్ద ఫిలిమ్ స్టూడియోల్లో ఇదొకటి. స్టూడియోలోని సౌకర్యాలు చూసి మైమరచిపోయానని లక్ష్మీ రాయ్ పేర్కొన్నారు. -
అదేరోజు మళ్లీ వస్తున్న గబ్బర్‌సింగ్
చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానుల కోరిక తీరే రోజు దగ్గరకొచ్చింది. ఇప్పటి వరకు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వని యూనిట్ తాజాగా సినిమా రిలీజ్‌పై ఓ నిర్ణయం తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా జనవరిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, షూటింగ్ లేటు కావటంతో వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించిన యూనిట్ అందుకు తగ్గట్టుగా ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది. సర్దార్ గబ్బర్‌సింగ్ రిలీజ్ కోసం ముహుర్తం కూడా ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మూడేళ్ల క్రితం గబ్బర్‌సింగ్ సినిమా రిలీజ్ అయిన సంచలనాలు నమోదు చేసిన మే 11న సర్థార్ గబ్బర్‌సింగ్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు గబ్బర్‌సింగ్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే పవన్ సత్తా చాటుతాడని నమ్ముతున్నారు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పవర్ ఫేం బాబి (కెయస్ రవీంద్ర) దర్శకుడు. -
కాజల్‌ను వరించిన అదృష్టం
చెన్నై : కలిసొచ్చే కాలంలో ఒక అవకాశం పోయినా మరోకటి వరిస్తుంది. దాన్నే అదృష్టం అంటారు. నటి కాజల్ అగర్వాల్‌ది సేమ్ టైమ్. ఆ మధ్య విశాల్‌తో పాయుంపులి చిత్రంలో నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. నృత్యదర్శకుడు, నటుడు లారెన్స్‌కు జంటగా మొట్టశివ కెట్ట శివ చిత్రంలో కాజల్ నాయకిగా ఎంపికయ్యారు. అయితే ఆ చిత్ర కథ మారిపోవడం, కాజల్ నటించాల్సిన చిత్రం వాయిదా పడటం జరిగింది. అదే విధంగా విక్రమ్‌తో నటించాల్సిన అవకాశం చేజారిపోయింది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మర్మమనిధన్ చిత్రంలో విక్రమ్‌తో రొమాన్స్ చేయనున్న కాజల్ అనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం చేతులు మారడంతో విక్రమ్ సరసన కాజల్‌ను తొలగించి నయనతారను ఎంపిక చేశారు. అదే విధంగా మరో నాయకిగా బిందుమాధవి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడా పాత్రలో నిత్యామీనన్ వచ్చి చేరింది. విక్రమ్ ఈ చిత్రంతో పాటు దర్శకుడు తిరు దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఆ విధంగా ఒకటి మిస్ అయినా మరో మైటీ అవకాశం కాజల్ అగర్వాల్‌ను ఖుషీ చేసిందన్న మాట.ప్రస్తుతం ఆమె తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన సర్ధార్ గబ్బర్‌సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే హిందిలో రణదీప్ హూడతో నటించిన దో లఫ్జోన్ కీ కహానీ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
సంక్రాంతికి సర్థార్ సందడి
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండగకి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ షూటింగ్లో ఉన్న పవర్ స్టార్ ఈ సినిమా తొలి టీజర్‌ను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ టీజర్‌తో కొద్ది రోజులుగా సినిమా మీద వస్తున్న నెగెటివ్ పబ్లిసిటీకి కూడా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇటీవలే గుజరాత్లో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన సర్థార్ గబ్బర్ సింగ్ టీం దాదాపు 40 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గుజరాత్ షెడ్యూల్ నుంచి హీరోయిన్ కాజల్ కూడా షూటింగ్లో పాల్గొంటుండటంతో కొత్త సంవత్సరం కానుకగా కాజల్, పవన్‌ల పోస్టర్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ టీజర్ ఎలా ఉండాలి అన్న అంశం మీద పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు బాబీ కసరత్తులు ప్రారంభించారు. -
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు..?
సినీ రంగంలో సెంటిమెంట్ ను ఫాలో అయినంతగా మరే రంగంలోనే ఫాలో అవ్వరు అంటే అతిశయోక్తి కాదేమో. అందుకే హిట్ కాంబినేషన్లను, హిట్ ఫార్ములాలను పదే పదే రిపీట్ చేస్తుంటారు మన టాలీవుడ్ సినీ ప్రముఖులు. అలాంటి ఓ సెంటిమెంట్‌నే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్. గతంలో స్టార్ హీరోలతో తన సంగీతం దర్శకత్వంలో పాటలు పాడించి సక్సెస్ సాధించిన దేవీ, మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడట. రెగ్యులర్‌గా తన సినిమాలో సింగర్స్‌తో పాటు గొంతు కలిపే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... 'అత్తారింటికి దారేది', 'గబ్బర్‌సింగ్' సినిమాల్లోనూ పాటలు పాడిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల సక్సెస్‌లో పవన్ పాడిన పాటలు కూడా తమ వంతుగా కలెక్షన్ల వేటకు సాయం చేశాయి. అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్‌తో ఓ పాటలో హమ్ చేయించాడు దేవీ శ్రీ. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఇది సెంటిమెంట్‌గా భావించిన దేవీ శ్రీ ప్రసాద్, మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' సినిమాతో పాటు, పవన్ హీరోగా తెరకెక్కుతున్న 'సర్థార్ గబ్బర్ సింగ్' సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు దేవీ శ్రీ. ఈ రెండు సినిమాల్లో మరోసారి పవన్, ఎన్టీఆర్‌లతో పాటలు పాడించాలని ప్లాన్ చేస్తున్నాడట. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఈ రెండు సినిమాలు కూడా ఘనవిజయం సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
బన్నీకి చెక్ పెడుతున్న పవన్, మహేష్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కి సమ్మర్ హీరోగా మంచి రికార్డ్ ఉంది. గత రెండేళ్లుగా సమ్మర్ సీజన్లో తిరుగులేని రికార్డ్స్ సాధించాడు బన్నీ. దీంతో ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్‌నే టార్గెట్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసిన బన్నీ, ఆ రెండు సినిమాలను 50 కోట్ల క్లబ్లో చేర్చి సత్తా చాటాడు. మరోసారి అదే సీజన్లో, అదే ఫీట్ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం ఈ రికార్డ్ అంత ఈజీగా అందేలా కనిపించటం లేదు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సరైనోడు (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న బన్నీ.. ఆ సినిమాను కూడా సమ్మర్ బరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే గతంలోలా ఈసారి వార్ వన్ సైడ్లా కనిపించటం లేదు. బన్నీకి పోzwగా పవన్, మహేష్‌లు బరిలో నిలిచే ఛాన్స్ ఉందgటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మహేష్, బాబీ దర్శకత్వంలో సర్దార్ గబ్బర్‌సింగ్ చేస్తున్న పవన్‌లు తమ సినిమాలను సమ్మర్ హాలీడేస్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా పోటీ లేకుండా సోలోగా సత్తా చాటిన బన్నీ, ఈసారి మాత్రం ఇద్దరు టాప్ హీరోలతో పోటీపడాల్సి వస్తోంది. మరి ఇంత పోటీలో కూడా బన్నీ బాక్సాఫీస్ దగ్గర పవర్ చూపిస్తాడా..? లేక ముగ్గురు హీరోలు కలెక్షన్ల రికార్డ్లను పంచుకుంటారా..? తెలియాలంటే మాత్రం సమ్మర్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
'వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. మేమంతా ఒక్కటే'
హైదరాబాద్: అన్నయ్య, తాను వేర్వేరు పార్టీల్లో ఉన్నా తామంతా ఒక్కటేనని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అన్నయ్య చిరంజీవిని ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కలిసిన సందర్భంగా పవన్ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను వెళుతానో లేదో ఇప్పుడు చెప్పలేనన్నారు. తనకు వెళ్లాలని ఉన్నా షూటింగ్ షెడ్యూల్, డేట్స్ వల్ల ఇంకా నిర్ణయానికి రాలేదని చెప్పారు. సినిమాలపరంగా తామంతా ఒకటేనని తెలిపారు. అన్నయ్య మళ్లీ సినిమాల్లోకి రావడం ఆనందం కలిగించిందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నయ్యను కొన్నిసార్లే కలుసుకున్నానని చెప్పారు. రాజకీయంగా తమ విధానాలు వేరైనాకానీ.. సినిమాలపరంగా, కుటుంబపరంగా అన్నయ్య అంటే గౌరవమని తెలిపారు. మీరిద్దరు మళ్లీ కలిసి నటించే అవకాశముందా? అన్న ప్రశ్నకు నాడు శంకర్ దాదా సినిమాలో యాదృచ్ఛికంగానే నటించానని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా తాను నిర్మించబోయే సినిమా కోసం రెండు, మూడు కథలను పరిశీలించామని చెప్పారు. 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు.