పవన్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ | Sardar Gabbarsingh Teaser Release | Sakshi
Sakshi News home page

పవన్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్

Published Wed, Sep 2 2015 8:12 AM | Last Updated on Sat, Jul 6 2019 4:09 PM

పవన్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ - Sakshi

పవన్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్

ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న " సర్దార్ గబ్బర్ సింగ్ " సినిమా టీజర్‌ను విడుల చేశారు.అర్ధరాత్రి విడుదల చేసిన ఈ టీజర్ ఆన్‌లైన్‌లో సందడి చేస్తోంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో  శరత్‌మరార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2016 లో రిలీజ్ కానుంది.

పవన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కథ కూడా తానే అందించటంతో సినిమా మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే లాంగ్ గ్యాప్ తీసుకోవటంతో పాటు దర్శకులుగా చాలా పేర్లు మార్చటం.. సెట్స్ మీదకు వెళ్లటం ఆలస్యం కావటం లాంటి వాటితో కాస్త ఢీలా పడ్డ అభిమానులకు ఈ టీజర్ కొత్త కిక్ ఇచ్చింది.

ఫుల్ మాస్ పోలీస్ గా కనిపిస్తున్న పవన్ తన ట్రేడ్ మార్క్ ఇంట్రడక్షన్ తో ఆకట్టుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమా ఇంట్రో తరహాలోనే గుర్రంతో కనిపించిన పవన్, టీజర్ లుక్ తోనే ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తున్నాడు. ఆలస్యం అయినా అభిమానుల కోరిక తీర్చే మాస్ ఎంటర్ టైనర్ రెడీ చేస్తున్నానని టీజర్ తోనే కన్ఫామ్ చేశాడు పవర్ స్టార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement