'ఫ్యాన్స్కి ఏం కావాలో పవన్కి బాగా తెలుసు' | Producer Sharth Marar on sardar gabbar singh movie | Sakshi
Sakshi News home page

'ఫ్యాన్స్కి ఏం కావాలో పవన్కి బాగా తెలుసు'

Published Sat, Jan 9 2016 10:35 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'ఫ్యాన్స్కి ఏం కావాలో పవన్కి బాగా తెలుసు' - Sakshi

'ఫ్యాన్స్కి ఏం కావాలో పవన్కి బాగా తెలుసు'

పవన్ ఫుల్లెంగ్త్ క్యారెక్టర్లో కనిపించి చాలా కాలం గడిచిపోయింది. అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ హీరోగా సినిమా రాలేదు. మధ్యలో గోపాల గోపాల సినిమాలో నటించినా.. అది పవన్ అభిమానుల ఆకలి తీర్చే పాత్ర కాదు. దీంతో పవన్ కళ్యాణ్ హీరోయిజం కనిపించే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎదురు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్సింగ్ అలాంటి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అంటున్నాడు నిర్మాత శరత్ మరార్.

'సర్దార్ గబ్బర్సింగ్ సెట్లో ఓ గొప్పరోజు ముగిసింది. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ టీంతో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ ఎంత కష్టాపడతాడో ఇప్పుడు తెలుస్తోంది. అభిమానులు ఏం కోరుకుంటున్నారో పవన్కు బాగా తెలుసు, పక్కాగా చెప్పుతున్నాను సర్థార్ గబ్బర్సింగ్ కంప్లీట్ ఎంటర్టైనర్' అంటూ ట్వీట్ చేశాడు శరత్ మరార్.

పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గబ్బర్సింగ్ సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీలో వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement