ఈ గ్యాప్ మంచికే! | The best interests of the Gap! | Sakshi
Sakshi News home page

ఈ గ్యాప్ మంచికే!

Published Sat, Aug 22 2015 11:56 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఈ గ్యాప్ మంచికే! - Sakshi

ఈ గ్యాప్ మంచికే!

పవన్ కల్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో జతకట్టే అదృష్టం కాజల్‌ను వరించేసింది. చిత్రనిర్మాత శరత్ మరార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత కాజల్ వేరే తెలుగు చిత్రం సైన్ చేయలేదు. ఆ విధంగా కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ మంచికే అనొచ్చు. ఎందుకంటే, ఏదో ఒకటి చేయాలి కదా అని ఏవేవో సినిమాలు అంగీకరించి ఉంటే, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’కి డేట్స్ కేటాయించలేకపోయేవారామె.
 
 ఇక, ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్‌తో ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే...’ అని పాడిన పవన కల్యాణ్ ఈ సినిమాలో కాజల్ కోసం ఎలాంటి పాటలు పాడతారో చూడాలి. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ , పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్రనాథ్(బాబీ) దర్శకుడు.
 
 ‘‘త్వరలోనే కాజల్ అగర్వాల్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇప్పటికే ఈ చిత్రానికి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: జయనన్ విన్సెంట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement