సర్దార్ గబ్బర్ సింగ్ మేకింగ్ వీడియో | Pawan Kalyan movie Sardar Gabbar Singh official making video | Sakshi
Sakshi News home page

సర్దార్ గబ్బర్ సింగ్ మేకింగ్ వీడియో

Published Sat, Mar 12 2016 7:46 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సర్దార్ గబ్బర్ సింగ్ మేకింగ్ వీడియో - Sakshi

సర్దార్ గబ్బర్ సింగ్ మేకింగ్ వీడియో

హైదరాబాద్‌: పవర్‌ స్టార్ పవన్‌కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా మేకింగ్ కు సంబంధించి ఓ వీడియో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఆ చిత్ర  యూనిట్ అప్ లోడ్ చేసిన అధికారిక వీడియో యూట్యూబ్ లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. శనివారం సాయంత్రం ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన విషయం తెలిసిందే. విడుదల తేదీ ఏప్రిల్ 8 అని తెలిసి పవన్ అభిమానులు ఇప్పటికే ఎంతో హుషారుగా ఉన్నారు. 41 సెకన్ల నిడివి ఉన్న ఈ తాజా వీడియో ఇప్పటికే భారీ హిట్స్, లైక్స్ అందుకుంటుంది.

ఈ సినిమా నిర్మాత, పవన్ సన్నిహితుడు... శరత్ మరార్ 'మేకింగ్ ఆఫ్ సర్దార్ గబ్బర్ సింగ్ వీడియో' చూడండి అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీ ఆడియో విడుదల ఈ నెల 20న చేయనున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మేకింగ్ వీడియో పోస్ట్ అయిన క్షణాల్లోనే లైక్ లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement