పవన్‌ను నిద్ర లేపండి..! | ramgopal varma asks fans to wake up pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ను నిద్ర లేపండి..!

Published Mon, Apr 11 2016 9:19 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌ను నిద్ర లేపండి..! - Sakshi

పవన్‌ను నిద్ర లేపండి..!

పవన్ కళ్యాణ్‌ను నిద్రలేపాల్సిన బాధ్యత ఆయన అభిమానుల మీద ఉందని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పవన్ మీడియాతో మాట్లాడిన తర్వాత సర్వసాధారణంగా తనకు అలవాటైన అర్ధరాత్రి సమయంలోనే రాంగోపాల్ వర్మ రెండు ట్వీట్లు చేశారు. ఇంగ్లీషు నుంచి డబ్బింగ్ అయిన సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుంటే, పవర్ స్టార్ సినిమా మాత్రం అలా నడవడం లేదని వ్యాఖ్యానించారు. అందువల్ల ఇప్పటికైనా ఆయనను నిద్ర లేపాల్సిన నైతిక బాధ్యత పీకే అభిమానుల మీద ఉందని అన్నారు.

దాంతోపాటు, జంగిల్ బుక్ సినిమాలో నటించిన బాలనటుడి ఫొటో ఒకటి పోస్ట్ చేసి.. మెగా పవర్ సర్దార్ గబ్బర్‌సింగ్‌తో పాటు రాజా సర్దార్ గబ్బర్‌సింగ్‌ను కూడా చంపేసిన చిన్న పిల్లాడిని చూడండి అంటూ చెప్పారు.

కాగా, అటు పవన్ మాత్రం రాంగోపాల్ వర్మ విషయం మీద కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. వర్మ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన బయటవాళ్ల మీద పెట్టే శ్రద్ధ తనపై, తన సిన్మాలపై పెడితే వేరే స్థాయికి వెళ్లేవారని పవన్ అన్నారు. ఆయన తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటానని, కాదంటే, తనకూ లోపల వేరే భాష చాలా ఉందని కాస్తంత కటువుగా చెప్పారు. తానూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలనని ఒకింత హెచ్చరించారు కూడా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement