కెలకమాకు సామీ ... వర్మకు కౌంటర్‌ | Rama Jogayya Sastry Comment On RGV Post On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Published Mon, May 14 2018 11:24 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Rama Jogayya Sastry Comment On RGV Post On Pawan Kalyan - Sakshi

వివాదాస్పద దర్శక నిర్మాత రాంగోపాల్‌ వర్మ తన ట్విట‍్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్ పై ఆయన చేసిన కామెంట్లతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యారు కూడా. అనవసర విషయాలపై రియాక్ట్‌ కావడం, దానిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్‌ చేయడం వర్మకు అలవాటు. తనపై వచ్చే విమర్శలను రాంగోపాల్‌ వర్మ ఏమాత్రం పట్టించుకోరు. తనపై వచ్చే  విమర్శల జడివానకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన సెటైర్లు వేస్తూనే ఉంటారు.

తాజాగా వర్మ పవన్‌పై కామెంట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు కాలినడకన వెళ్తూ మార్గమధ్యలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై వర్మ ట్వీట్‌ చేస్తూ..‘పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ ఎనర్జీకి ఇదే ఉదాహరణ’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు.

అయితే వర్మ కామెంట్‌కు రామ జోగయ్య శాస్త్రి కౌంటర్‌ ఇస్తూ.. ‘ కెలకమాకు సామీ... కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరు.. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్‌ చేసి మాట్లాడుకోండి’ అంటూ ట్వీట్‌ చేశారు. మరి రామజోగయ్య శాస్త్రి ట్విట్‌ కు వర్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement