Ramajogaiah Sastry
-
దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా 'రామం రాఘవం' సాంగ్ విడుదల
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం 'రామం రాఘవం' నటుడు ధనరాజ్ కొరనాని మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గురుపూజోత్సవం సందర్బంగా ఈ మూవీ నుంచి 'తెలిసిందా నేడు' పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.ఎమోషనల్‌గా సాగే ఈ మెలోడీ సాంగ్ విడుదలైన కొద్దిసేపతిలోనే వైరల్ అవ్వడం విశేషం. తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషన్‌ను కరెక్ట్‌గా కాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ సాంగ్‌ను అరుణ్ చిలువేరు సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్,సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. తమిళ తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది. -
ఏఐ టెక్నాలజీ వస్తే చిత్రపరిశ్రమలో జరిగేది ఇదే: రామజోగయ్య శాస్త్రి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం అన్ని రంగాల్లో ఏ మేరకు ఉంటుంది? కొందరు ఉపాధి కోల్పోయేలా చేస్తుందా? వంటి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా రంగంపైనా ఏఐ ప్రభావం భారీగా ఉంటుందన్నది కొందరి ఊహ. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంపై ఎక్కువ ప్రభావం పడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ అంశంపై ఇటీవల ‘సాక్షి’ సినిమా పేజీలో ఓ కథనం కూడా ప్రచురితమైంది. తాజాగా ‘స్టార్ రైటర్స్’ చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి ‘ఏఐ’ గురించి తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు.అది మనకు బానిస.... మనం బాస్ – చంద్రబోస్ మనిషి కంటే.. మనిషి మేధస్సు కంటే ఏదీ గొప్పది కాదు. కాక΄ోతే కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా మనిషికి సాయం చేయడానికే కనిపెట్టబడుతున్నాయి. మనిషిని కొల్లగొట్టడానికి, కూల్చేయడానికి కాదు. ఈ కోణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆహ్వానిస్తే అన్నీ మంచి ఫలితాలే వస్తాయి. నిజమే... అన్నింటా ఏఐ పరిజ్ఞానంపై చర్చ జరుగుతోంది... కాదనడం లేదు. సెల్‌ఫోన్ చాలా రకాల పనుల్ని చేస్తోంది. అందులో ఉన్న కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాం. అయినా బయట ఫొటో, వీడియో స్టూడియోలు ఉన్నాయి. అందులో సరికొత్త నిపుణులు పుట్టుకొచ్చారు. ఇంకా పెద్దగా అది విస్తరించింది. చాలా మందికి ఉపాధి లభిస్తోంది. ఏ వస్తువొచ్చినా కూడా మనిషి మాత్రమే ప్రత్యేకంగా చేయగలిగింది ఒకటుంటుంది.కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. దాంతో (టెక్నాలజీ) మనం చాకిరీ చేయించుకోవాలి. బానిసలాగా ఆ కొత్త పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. అక్కడే మనిషి ప్రతిభ తెలుస్తుంది. అది బాణీలు కట్టి సాహిత్యాన్నిస్తుంటే.. దాన్నుంచి వందల కొద్దీ బాణీలు తీసుకుని అందులోని ఆత్మను ఎంపిక చేసి దానికి మనం మెరుగులు అద్దుకోవాలి. ఉదాహరణకు కంప్యూటర్ వల్ల మనకు ఎంతో సమయం ఆదా అవుతోంంది. అలా ఆదా అయిన సమయాన్ని వేరే దానికి మళ్లిస్తున్నాం. అలాగే సంగీతంలో కూడా ఏఐ ఇచ్చే ట్యూన్ల నుంచి మంచిది ఎంపిక చేసుకుని దానికి మన సృజనాత్మకతను జోడించి ఏఐ కూడా చేయలేని సరికొత్త రాగాన్ని సృష్టించాలి. అంతే కానీ ఎవరి ఉద్యోగాలూపోవు. ఎవరి పనులూ ఆగిపోవు. అదేమీ దేవుడు కాదు.కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ వచ్చినప్పుడు అందరి ఉద్యోగాలూపోతాయన్నారు.. మరి కంప్యూటరే లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు పేపర్ మీద పాట రాసుకునేవాడ్ని. ఇప్పుడు రిమార్కర్ అనే సాంకేతికత ద్వారా రాసుకుంటున్నా. ఒకప్పుడు తప్పులొస్తే తుడిచేయడానికి వైట్ మార్కర్‌తో కొట్టేయాల్సి వచ్చేది. ఇప్పుడు రిమార్కర్పైన ఆ సమస్యే లేదు. అందుకే ఏ సాంకేతికతనైనా విశాల హృదయంతో స్వీకరించినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. దానిని సరిగ్గా వాడుకోవడం తెలుసుకుంటే అది మనకు బానిసే అవుతుంది.. దానికి మనం బాసే అవుతాం. ఏఐ ఆత్మను ఆవిష్కరించగలదా? – రామజోగయ్య శాస్త్రి మనం సంధి కాలంలో ఉన్నాం. నేను రోళ్లు చూశాను.. మిక్సీలు చూశాను. మార్పును తిరస్కరించలేం. టెక్నాలజీ పరంగా ఎదగాల్సిందే. అయితే.. దేనిని ఎంత మేర వాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు పంచాంగం చూడాలంటే ఫోనులో ‘మెటా’ని అడిగినా చెబుతుంది. అదే ఫోన్‌ను మంచికీ చెడుకీ వాడొచ్చు. సో.. టెక్నాలజీని తప్పనిసరిగా స్వాగతించాల్సిందే. పాటలు లేకుండా సినిమాలు ఆడతాయని కొందరు అన్న సందర్భాలు ఉన్నాయి. మరి జరిగిందా? సో.. తెలుగువాళ్లను సినిమాల నుంచి వేరు చేయలేము... పాటల నుంచీ వేరు చేయలేము. పల్లెల్లో పని చేసుకునేవాళ్లు తమకొచ్చినది పాడుతుంటారు. వాటిల్లోనూ మంచి ట్యూన్లుంటాయి. అలాగే హైదరాబాద్‌లోనే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లున్నారు.కూచోబెట్టి 15 ట్యూన్లు అలవోకగా పాడేవాళ్లుంటారు. అంతటితో అయి΄ోతుందా.. దానికి పరిపుష్టి చేకూర్చేలా వాయిద్యాల సహకారం ప్లాన్ చేయటం, పాడించడం వంటివన్నీ ఉంటాయి కదా. ఓ ట్యూన్ జనరేట్ చేసి ఆర్కెస్ట్రైజేషన్ చేస్తే సరిపోతుందా? అది నచ్చాలి కదా.. తుది మెరుగులు దిద్దితేనే అది బాగుంటుంది. ‘లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక...’ (‘శుభలగ్నం’లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ‘చిలుకా ఏ తోడు లేక...’ పాటను ఉద్దేశించి) అనే పాటను ఏఐ ఇవ్వగలదా? ఒక మనిషి తాలూకు భావనను పరికించి.. పరిశీలించి.. ప్రతిస్పందించి ఇవ్వగలిగేది మనిషి, మనసు మాత్రమే. ఆ మనసు ఏఐకి ఉందా? సినీ ఇండస్ట్రీలో పర్ఫెక్షన్ కోసం ఏమిచ్చినా ఇంకా ఏదో కావాలంటాం.80 శాతం ఫలితమొచ్చినా దాన్ని వంద శాతం తీసుకొచ్చేందుకు మళ్లీ ఓ మనిషి కావాల్సిందే. యంత్రాలొచ్చినప్పుడు కార్మికులకు పనిపోతుందనుకున్నాం..పోయిందా..? ఏఐ కావాల్సిందే.. అదే పనిగా ఏఐతో పది పదిహేను సినిమాలు చేస్తే బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మళ్లీ మనుషులే కావాల్సి వస్తారు. పాట అనేది ఆత్మకు సంబంధించిన అంశం. ఇవాళ ఉన్న టెక్నాలజీతో ప్రతి శబ్దాన్ని వర్చ్యువల్‌గా సృష్టించవచ్చు. వయొలిన్, కీ బోర్డ్, మృదంగం ఇలా... కానీ దానిని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ శబ్దాలతో మళ్లీ రీ ప్లేస్ చేస్తారు. అలాంటప్పుడు మృదంగం, వయొలిన్ విద్వాంసుల ఉద్యోగాలు ఎప్పుడోపోయుండాలి. ఏదైనా ఆర్గానిక్‌గా వచ్చే దాని అందమే వేరు. సాహిత్యం విషయంలోనూ అంతే. మనిషి అనుభవంతో పలికే పదాలుంటాయి. వాటిని ఏఐ నుంచి ఎలా ఆశించగలం? కొన్నింటిని మనిషే పుట్టించగలడు.. ఏదోప్రాస కోసం వెదుకుతున్నప్పుడు కొన్ని పదాలను ఏఐ ఇవ్వచ్చేమోగాని పాట యొక్క ఆత్మను ఏఐ ఆవిష్కరించలేదు కదా. -
గుంటూరు కారం సాంగ్‌పై ట్రోలింగ్.. 'ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి'
సూపర్ స్టార్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. పోస్టర్, లుక్స్, పాటలు, డైలాగులు.. ఇలా ప్రతీది అద్భుతహ అనిపించేలా ఉండాలని ఆశిస్తుంటారు అభిమానులు. ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియాలో విమర్శలతో విరుచుకుపడుతారు. ఇప్పుడదే జరిగింది. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా నుంచి బుధవారం ఓ మై బేబీ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఓ మై బేబీ సాంగ్‌పై ట్రోలింగ్.. 'నా కాఫీ కప్పులో షుగర్ క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..' అంటూ ఈ పాట మొదలైంది. అయితే చాలామంది ఈ పాట ట్యూన్, లిరిక్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాట బాగోలేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరుతూ దూషిస్తూ మాట్లాడారు. దీంతో ఓపిక నశించిన గేయరచయిత రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. విషం చిమ్ముతున్నారు 'సోషల్ మీడియా కుక్కల చేతిలోకి వెళ్తోంది. ఒక విషయం గురించి తలాతోకా ఏదీ తెలియని వాళ్లు కూడా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇతరులను జడ్జ్ చేస్తున్నారు. కావాలని విషాన్ని చిమ్ముతున్నారు. సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నవారిని టార్గెట్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. వీళ్లు గీతలు దాటుతున్నారు' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. 'ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరేవాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చేయలేం. అది తెలుసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి. సక్రమంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పద్ధతి మీరకండి' అని మరో ట్వీట్లో హెచ్చరించాడు. ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరే వాడే అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి — RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023 Social media is going to DOGS.. …people who do not know a thing abt the process..think that they can comment and judge…with all d ill intentions..of spreading hate..targeting the technicians…NO..NOT at all good..ఎవరో ఒకరు మాట్లాడాలి..గీతలు దాటుతున్నారు వీళ్ళు.. https://t.co/zF2xViOw0r — RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023 చదవండి: ఆగిపోయిన లైవ్, రేపటితో ఓటింగ్‌కు శుభంకార్డు -
హర్టయిన శాస్త్రిగారు, కానీ దానికోసం కాదట!
నందమూరి నటసింహం ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా నుంచి మాస్ ఆంథెమ్ సాంగ్ జై బాలయ్య రిలీజైంది. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి పేరు అంటూ సాగే ఈ పాట ఒసేయ్ రాములమ్మ సాంగ్‌ను గుర్తు చేస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు సంగీతం అందించిన తమన్‌ను కాపీ క్యాట్ అంటూ ఆడేసుకుంటున్నారు. కాపీ పాటకు లిరిక్స్ అందించావటూ రామజోగయ్య శాస్త్రిపై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రామజోగయ్య శాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. ప్రతిపాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగినవారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టూ.. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. ఇబ్బందిగా అనిపిస్తే ఇటు రాకండి అని రాసుకొచ్చాడు. అలా పాట రిలీజ్ అయిందో లేదో ఇలా ట్రోలింగ్ జరగడంతో రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యాడని పలువురూ భావించారు. దీంతో తన ట్వీట్‌కు వివరణ ఇచ్చుకున్నాడీ రచయిత. వేరే విషయం మీద ఆ ట్వీట్ చేశానని, ట్రోలింగ్ లేదు, ఏమీ లేదని స్పష్టం చేశాడు. అభిమానులందరూ నేనంటే చాలా ఇష్టపడతారని, ముఖ్యంగా జై బాలయ్య పాట పట్ల సాహిత్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022 చదవండి: నా కోడలు బంగారం అంటున్న నయనతార అత్త -
హెబ్బాపటేల్‌తో ఫోటోలు దిగిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాత వరస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు తక్కువగా ఉండటంతో ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. దీనితో పాటు హెబ్బా సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. ఇక ఓ సినిమా షూటింగ్ కోసం పోలండ్ వెళ్లిన హెబ్బా పటేల్ అక్కడ ఓ లిరిసిస్ట్‌తో దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఎప్పుడూ నుదుటన బొట్టు పెటుకొని, సంప్రదాయబద్దంగా కనిపించే రామజోగయ్య శాస్త్రి ఈ సారి మాత్రం స్టైల్ మార్చేశారు. ట్రెండీగా గాగుల్స్ పెట్టుకొని హెబ్బాపటేల్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన నెటిజన్లు రామజోగయ్య శాస్త్రి లుక్ చూసి షాకవుతున్నారు. -
కేజీఎఫ్ 2: 'అమ్మ పాట' ఫుల్ వీడియో చూశారా ?
KGF 2: Voice Of Every Mother Full Song Released: రాఖీ భాయ్ కలెక్షన్ల తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోన యాక్షన్ సీన్స్, పాటలు ఆడియెన్‌ను ఒక రేంజ్లో ఉర్రూతలూగించాయి. యాక్షన్, ఎలివేషన్స్, సాంగ్స్, బీజీఎంకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇందులో కొడుకు గురించి తల్లి పాడే ఎదగరా ఎదగరా అనే పాట ప్రతి ఒక్కరికీ గుర్తు ఉంటుంది. ఈ పాటను 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్ (అమ్మ పాట)' అని ఇదివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదివారం (మే 8) మదర్స్ డే సందర్భంగా పూర్తి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్' అని ట్వీట్ చేస్తూ షేర్ చేశారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. చదవండి: విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు Voice of every MOTHER!#GaganaNee/#FalakTuGarajTu/#YadagaraYadagara/#AgilamNee/#GaganamNee : https://t.co/lsnsFyAupu#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @RaviBasrur @LahariMusic @Mrtmusicoff pic.twitter.com/b2RbaKR8U0 — RamajogaiahSastry (@ramjowrites) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భీమ్లా నాయక్ పాటపై వివాదం: ఐపీఎస్ అధికారి అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’లోని పాటను విడుదల చేశారు. విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పోలీస్‌గా నటిస్తున్న పవన్ కల్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో పాటతో అర్ధమవుతోంది. అయితే ఆ పాటపై ఓ ఐపీఎస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఓ ట్వీట్ చేశారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేశ్ భీమ్లా నాయక్ పాట విన్న అనంతరం ఓ ట్వీట్ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్ అధికారి రమేశ్ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ పాట సాహిత్యంపై కూడా కొందరు నెటిజన్లు సాధారణంగా ఉన్నాయని.. అంత గొప్పగా లేవని చెబుతున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి తగ్గట్టు పాటలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు నేరుగా రామజోగయ్యను ట్యాగ్ చేస్తూ చెప్పారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రామజోగయ్య స్పందించారు. ‘మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా ‘నెక్ట్స్ టైం బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్’ అని శాస్త్రి రిప్లయ్ ఇచ్చారు. మరి ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్‌కు రామజోగయ్యశాస్త్రి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం భీమ్లా నాయక్ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాటను తెలంగాణ జానపద కళాకారుడు, అరుదైన కిన్నెరను వాయించే దర్శనం మొగులయ్య పాడడం ప్రత్యేకంగా ఉంది. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s — M. Ramesh IPS (@DCPEASTZONE) September 2, 2021 -
‘సంక్రాంతి అంటే అదే’
సంక్రాంతికి కవులు పదాలను పతంగులుగా చేసి ఎగురవేస్తారు. పద్యాలను ఇళ్ల ముందరి ముగ్గుల వలే అందంగా తీర్చిదిద్దుతారు. పాటలను బాణీకట్టి ఆడపిల్లల కిలకిలలకు జోడు కడతారు. కవులు సంక్రాంతి వస్తే పాతభావాలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయమంటారు. కొత్త చైతన్యాన్ని గడపలకు తోరణాలుగా కట్టమంటారు. కళలు వెల్లివిరిసే సమాజమే సంతోషకరమైన సమాజం. కవులు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. సమాజం కవుల వాక్కుకు చప్పట్లు అర్పించాలి. అభ్యుదయమే అసలైన క్రాంతి. పురోగమించడమే అసలైన సంక్రాంతి. స్వాగతం మంచు పరచిన దారి మళ్లివెలుగు వెచ్చని బాటలోకి అడుగుపెట్టే రవికిరణమా సంక్రాంతి ఆభరణమా స్వాగతం హరివిల్లు రంగుల ముగ్గులన్నీ పరచి వాకిట తేనెలొలికే పలుకు తీయని స్వాగతం పాడిపంటలు పచ్చదనమై ఆడిపాడే పల్లె వెలుగై నిదుర మబ్బులు మేలుకొలిపే పల్లె సీమల పాట స్వరమై భోగి వెలుగుల జిలుగు మంటలపాతనంతా ఆహుతంటూ పలుకు తీయని స్వాగతం పిల్లపాపలనెల్లకాలం పదిలమంటూపసిడి పంటల పరిమళాలను జల్లుజల్లుగ భోగిరోజున పళ్ళు పూలై తలతడిమి జారే దీవెనలుగా ఆశీస్సులన్నీ అడుగుఅడుగున వెన్నంటి నిలిచే చిలక పలుకుల స్వాగతం. రాతిరంతా వెలుగు మడుగై వేలికొసలన రంగు రూపై కొత్త చిత్రపు ముగ్గు మధ్యన పూలరెక్కల పాన్పుపై గౌరీ దేవిగపూజలందే ప్రాణదాతకు ప్రకృతికి గొంతువిప్పిన గొబ్బిపాటల స్వాగతం పాతకొత్తల మేలుకలయిక గంగిరెద్దుల నాట్య హేలకు సన్నాయి రాగం డోలు శబ్దం నింగికెగసే గాలి పటమైహరిలోరంగహరీ అక్షయపాత్రన వెలిగే దక్షత నింగే నేలై తెలిపే స్వాగతం విందు వినోదం ఆహ్లాదంపితృదేవతల పరమార్థం జంతు సేవలకు తీర్చు ఋణం అతిథి దేవులకు ఆడబిడ్డలకు వెచ్చని మమతల ప్రతిరూపం మాటమాటనా మరువపు మొలకల స్వాగతం. – సుద్దాల అశోక్‌తేజ సమైక్య క్రాంతి పండగ వస్తుంది.. వెళుతుంది. ప్రతి పండగనీ మనం చేసుకుంటాం. అయితే అర్థాన్ని తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా? అన్నది ముఖ్యం. కొత్త బట్టలు, పిండి వంటలు ఇవి ఎలానూ ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి తాలూకు అర్థాన్ని పిల్లలకు చెప్పాలి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. ‘నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా’ అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదే సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. అంటే ఒక మంచి మార్పు. మనది పల్లెటూరు బేస్ అయిన సంస్కృతి కాబట్టి పంట ఇంటికొచ్చే రోజు ప్రత్యక్షంగా వస్తువు ఉత్పత్తి చేయకపోయినా మానసిక వికాసానికి తోడ్పడే కళల మీదే జీవనాధారంగా బతుకుతున్నవాళ్లకు ధాన్యం కొలిచి ఇవ్వడం సంక్రాంతి. ఇది చేయడానికి రాజులే అవ్వాల్సిన అవసరంలేదు. ఎవరైనా చేయొచ్చు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఇలా సంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. అమెరికాలాంటి దేశాల్లో స్థిరపడ్డవాళ్లకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిష్ మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి ‘బొహియల్లో.. బొహియల్లో..’ అని తిప్పకండి. సంక్రాంతి పండగ అర్థం చెప్పండి. ఎలక్ట్రికల్ భోగి మంట వేసుకుంటున్నారు. కానీ ఆ భోగి మంట అర్థం పిల్లలకు చెప్పండి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లందరూ ఆ రోజు ఒకచోట కలవండి. అవసరమైనవాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. నా బాల్యంలో సంక్రాంతి గురించి చెప్పాలంటే.. ఉత్సాహం కలిగించే పండగల్లో ఇదొకటి. సంక్రాంతి అంటే భోగి మంట. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామో అని పెద్దవాళ్లు కంగారు పడేవాళ్లు (నవ్వుతూ). – సిరివెన్నెల అందుకే ఈ పండగంటే ఇష్టం సంక్రాంతి అనగానే చక్కనైన ముగ్గులు చూసి చుక్కలన్నీ చాటుకుపోయే వేకువ సన్నివేశం. కలశంతో పొద్దున వచ్చే తులసీదాసుల హరి కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి మేళాలు, నవధాన్యాల పిండి వంటలు, అల్లుళ్ల సందడి, ఆడబిడ్డల వైభోగం, కోడి పందెం, యెద్దుల పరుగులు, రచ్చబండల యక్షగాన రూపకాలు, హేమంతపు గాలులు, వెన్నెల రాత్రులు, ఎల్తైన పంట రాశులు, వాగునీట యెద్దుల ఈతలు, లేగ మెడలో మువ్వల గంటలు, రేగిపండ్లు, పిండిపూలు, పసుపు కుంకుమల గొబ్బెమ్మలు, ఆహ్లాదం, ఆనందం... ప్రకృతి యెడల భక్తిభావం... ఇలాంటి మంచి పండగ అంటే నాకు చాలా ఇష్టం. కారణం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వ్యవసాయానికి, గ్రామీణ జీవితానికి శోభాయమానంగా ఉండే పండగ కాబట్టి రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ పండగ నాకిష్టం. మహిషాసురుణ్ణి చంపిన సందర్భంగా దసరా పండగ చేసుకుంటారు. నరకాసురుడి అంతమే దీపావళి పండగ. సంక్రాంతికి ఇలాంటిది లేదు. ఇది రైతుల పండగ. అందరి పండగ. మా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో సంక్రాంతి బాగా చేస్తారు. – గోరటి వెంకన్న, కవి అలా రెండు సంక్రాంతులు గడిచాయి సంక్రాంతి అనగానే నాకు నేను రెండు రకాలుగా గుర్తొస్తాను. ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఆ తర్వాతలా అన్నమాట. అంతకు ముందు సంక్రాంతి అనగానే ఫ్యామిలీతో అందరం కలిసి ఉండటం. అరిసెలు ఆరగించడం. అరిసెలు చేయటంలో మోస్ట్ ఫేవరేట్ ప్లేస్ మా అమ్మమ్మ గారిల్లు. అందుకే పండగ అంటే అమ్మమ్మగారింట్లోనే. అమ్మమ్మగారి ఊళ్లో ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి గాలి పటాలు ఎగరేయటం. గాలి పటాలెగరేసుకుంటూ విన్న పాటలతో పాటు నేను పెరిగాను. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలను ఇక్కడ ప్రస్తావించాలి. అప్పుడు ఆ పాటల్లోని భావాలను వింటూ ఎప్పటికైనా నేను మంచి పాటలు రాయాలనుకునేవాణ్ని. ఆ పాటలు ఏంటంటే... ‘వర్షం’ చిత్రంలోని ‘కోపమా నా పైనా, ఆపవా ఇకనైనా అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా..’ అనే ప్రేమ పాటలు వింటూ ఆ పాటలోని అక్షరాలతో ఓ సంక్రాంతి గడిచింది. మరో సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే... ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా...’ అంటూ శాస్త్రిగారు రాసిన మాటలు నేను ఈ ఇండస్ట్రీకి రావటానికి స్ఫూర్తినిచ్చాయి. విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాలు నిర్మించిన యం.యస్. రాజుగారిని సంక్రాంతి రాజు అని పిలిచేటంత హిట్టయ్యాయి ఆ సినిమాలు. ఇక ఆ తర్వాత కథ ఏంటంటే.. అలా పాటలు వింటూ సంక్రాంతి చేసుకున్న నేను ఇక్కడికొచ్చాక ‘శతమానం భవతి’ సినిమాలో సంక్రాంతిని ఉద్దేశించి ‘హైలో హైలెస్సారో... ఆదిలక్ష్మీ, అలిమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు... కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్లు...’ అనే పాట రాశాను. ఆ పాట పెద్ద హిట్. ప్రతి సంక్రాంతి పండక్కి ప్రేక్షకులు ఈ పాట వింటూ పండగ చేసుకోవాలన్నది నా ఆకాంక్ష. సంక్రాంతి అంటే తెలుగువాళ్లందరి సిరి. బంధువులందర్నీ ఓ చోట కలిపి మన మనసులను ఆనందింపజేసే పండగ ఇది. – శ్రీమణి ఇది కర్షకుల పండగ పండిన పంట ఇంటికొచ్చే రోజు, పడిన కష్టం చేతికొచ్చే రోజు సంక్రాంతి. వ్యవసాయమే ఆధారంగా మనుగడ సాగే మన భరత ఖండంలో ఏ పేరున జరుపుకున్నా ప్రధానంగా ఇది కర్షకుల (రైతులు) పండగ. పండగంటేనే సంతోషం. అందునా ఇది పెద్ద పండగ. మరి అంత సంతోషంగా రైతు జీవితం గడుస్తుందా? ప్రశ్నార్థకమే. ఉన్నంతలో పండగ జరుపుకోవడం కాకుండా ఉన్నతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అసలైన అర్థంతో పండగ జరుపుకునే దిశగా సంక్రాంతుల్లో సంక్రమం చేయాలని ఆకాంక్ష. – రామజోగయ్య శాస్త్రి -
కెలకమాకు సామీ ... వర్మకు కౌంటర్
వివాదాస్పద దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ తన ట్విట్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ పై ఆయన చేసిన కామెంట్లతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు కూడా. అనవసర విషయాలపై రియాక్ట్ కావడం, దానిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయడం వర్మకు అలవాటు. తనపై వచ్చే విమర్శలను రాంగోపాల్ వర్మ ఏమాత్రం పట్టించుకోరు. తనపై వచ్చే విమర్శల జడివానకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన సెటైర్లు వేస్తూనే ఉంటారు. తాజాగా వర్మ పవన్‌పై కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ తిరుమలకు కాలినడకన వెళ్తూ మార్గమధ్యలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై వర్మ ట్వీట్ చేస్తూ..‘పవర్‌స్టార్ పవర్ఫుల్ ఎనర్జీకి ఇదే ఉదాహరణ’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. అయితే వర్మ కామెంట్‌కు రామ జోగయ్య శాస్త్రి కౌంటర్ ఇస్తూ.. ‘ కెలకమాకు సామీ... కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరు.. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. మరి రామజోగయ్య శాస్త్రి ట్విట్ కు వర్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కెలకమాకు సామీ ...కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు ...ఇది మీకు హుందా అయినది కాదు 😎తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు 😎 ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి😎 https://t.co/7Rv2gYjqHP — Ramajogaiah Sastry (@ramjowrites) 13 May 2018