
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాత వరస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు తక్కువగా ఉండటంతో ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. దీనితో పాటు హెబ్బా సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. ఇక ఓ సినిమా షూటింగ్ కోసం పోలండ్ వెళ్లిన హెబ్బా పటేల్ అక్కడ ఓ లిరిసిస్ట్‌తో దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి.
ఎప్పుడూ నుదుటన బొట్టు పెటుకొని, సంప్రదాయబద్దంగా కనిపించే రామజోగయ్య శాస్త్రి ఈ సారి మాత్రం స్టైల్ మార్చేశారు. ట్రెండీగా గాగుల్స్ పెట్టుకొని హెబ్బాపటేల్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన నెటిజన్లు రామజోగయ్య శాస్త్రి లుక్ చూసి షాకవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment