నందమూరి నటసింహం ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా నుంచి మాస్ ఆంథెమ్ సాంగ్ జై బాలయ్య రిలీజైంది. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి పేరు అంటూ సాగే ఈ పాట ఒసేయ్ రాములమ్మ సాంగ్‌ను గుర్తు చేస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు సంగీతం అందించిన తమన్‌ను కాపీ క్యాట్ అంటూ ఆడేసుకుంటున్నారు. కాపీ పాటకు లిరిక్స్ అందించావటూ రామజోగయ్య శాస్త్రిపై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రామజోగయ్య శాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. ప్రతిపాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగినవారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టూ.. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. ఇబ్బందిగా అనిపిస్తే ఇటు రాకండి అని రాసుకొచ్చాడు.
అలా పాట రిలీజ్ అయిందో లేదో ఇలా ట్రోలింగ్ జరగడంతో రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యాడని పలువురూ భావించారు. దీంతో తన ట్వీట్‌కు వివరణ ఇచ్చుకున్నాడీ రచయిత. వేరే విషయం మీద ఆ ట్వీట్ చేశానని, ట్రోలింగ్ లేదు, ఏమీ లేదని స్పష్టం చేశాడు. అభిమానులందరూ నేనంటే చాలా ఇష్టపడతారని, ముఖ్యంగా జై బాలయ్య పాట పట్ల సాహిత్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని క్లారిటీ ఇచ్చాడు.
ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..
— RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022
అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను
సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..
ఉంటే ఇటు రాకండి🙏
Comments
Please login to add a commentAdd a comment