ఎక్స్‌ఎల్‌ టు స్మాల్‌! | Lakshmi Rai weight loss secret | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ఎల్‌ టు స్మాల్‌!

Published Thu, Aug 31 2017 11:37 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

ఎక్స్‌ఎల్‌ టు స్మాల్‌!

ఎక్స్‌ఎల్‌ టు స్మాల్‌!

‘‘బాగా సన్నగా ఉన్నావు.. కొంచెం బరువు పెరుగు’ అని ఎవరైనా అంటే.. ఈజీగా పెరగొచ్చు. కానీ, పెరిగాక తగ్గమంటే మాత్రం అంత ఈజీ కాదు’’ అంటున్నారు రాయ్‌ లక్ష్మీ. ఆ మధ్య ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’లో ‘తప్పు తప్పే తప్పు తప్పే.. శుద్ధ తప్పే..’ పాటలో కూడా కనువిందు చేశారామె. ఇప్పుడీ బ్యూటీ హిందీ చిత్రం ‘జూలీ–2’లో నటించారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రెచ్చిపోనంతగా ఈ సినిమాలో గ్లామర్‌వైజ్‌గా రెచ్చిపోయారు. బికినీ ధరించారు.

 దాని గురించి చెబుతూ – ‘‘సౌత్‌ సినిమాల్లో నేను ‘సెమీ బికినీ’ వేసుకున్నా. ఫస్ట్‌ టైమ్‌ పక్కా బికినీ వేసుకున్నది ఈ సినిమాకే. కథ డిమాండ్‌ చేసినప్పుడు, ఫిజిక్‌ బాగున్నప్పుడు బికినీ వేసుకుంటే తప్పేంటి? అది తప్పు కాదు.. శుద్ధ తప్పు కాదు’’ అన్నారు. ఇక, బరువు తగ్గడానికి ఏం చేశారనే విషయం గురించి రాయ్‌ లక్ష్మీ చెబుతూ – ‘‘ఇండియాలో ఉన్న బెస్ట్‌ ట్రైనర్స్‌ 35 మంది ‘వెయిట్‌ లాస్‌’ విషయంలో నాకు ట్రైనింగ్‌ ఇచ్చారు. నా డ్రెస్‌ సైజ్‌ ‘ఎక్స్‌ఎల్‌’ (ఎక్స్‌ట్రా లార్జ్‌) అనుకోండి.. అక్కణ్ణుంచి ‘ఎమ్‌’ (మీడియమ్‌), ఆ తర్వాత స్మాల్‌ సైజ్‌కి చేరుకున్నా.

అది అంత ఈజీ కాదండి’’ అన్నారు.  రాయ్‌ లక్ష్మీ పడ్డ కష్టం ఊరికే పోదు.. ‘జూలీ–2’ పోస్టర్స్‌ చూసినవాళ్లు ‘కేక’ అంటున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. రాయ్‌ లక్ష్మీ నటన చూసి, కూడా అదే మాట అంటారని ఊహించవచ్చు. అన్నట్లు.. ఇది ఆమెకు 50వ సినిమా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement